Viral: వామ్మో.. ఇదేందిరా నాయనా.. పాముకు కాళ్లు.. ట్విస్ట్ ఏంటంటే..?
ఇన్ స్టాగ్రామ్‌లో ఓ వీడియో వైరల్‌గా మారింది. అందులో ఓ పాముకు ఏకంగా నాలుగు కాళ్లు ఉన్నాయి. సాధారణంగా పాములకు కాళ్లు ఉండవు. దీంతో దీనికి ఉన్న కాళ్లు చూసి నెటిజన్స్ షాక్ అవుతున్నారు. రకరకాలు కామెంట్స్‌తో వీడియోను వైరల్ చేస్తున్నారు.
సోషల్ మీడియా వచ్చాక వింత ఘటనల తాలూకా ఫోటోలు, వీడియోలు భలే వైరల్ అవుతున్నాయి. ఎక్కడ ఏది జరిగినా సరే క్షణాల్లో మన ఫోన్‌లోకి వచ్చేసింది. నెట్టింట కొన్ని రకాల అరుదైన జంతువులు, వింత జీవుల దృశ్యాలను చూస్తే మనకు ఆశ్చర్యం వేస్తుంది. ముఖ్యంగా పాములకు సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. పాములు అంటే అందరికీ తెలుసు వాటికి కాళ్లు ఉండవు, పాకుతూ సాగిపోతుంటాయి. అలాంటి సాధారణ పాము కనపడితే చాలామంది భయపడిపోతారు. అక్కడి నుంచి పరుగులు తీస్తారు. అలాంటిది ఆ పాముకు కూడా కాళ్లు కూడా ఉంటే..? వెన్నులో వణుకు పుట్టాల్సిందే.
తాజాగా అలాంటి వింత జీవి వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. అసలు అది పామేనా కాదా అనేది అర్థం కాక చాలామంది కన్‌ఫ్యూజ్ అవుతున్నారు. “ఇది ఏ జీవి అనేది ఎవరికైనా తెలుసా?” అని కొందరు కామెంట్స్ పెడుతున్నారు. మరికొందరు ఇది అందంగా ఫోటోషాప్ చేసివ వీడియోగా అభివర్ణిస్తున్నారు. వీడియోలో కెమెరా కదులుతున్నా పాము మాత్రం కదలనట్టు ఉండటంతో అది పక్కాగా ఎడిటెడ్ వీడియో అని వారు చెబుతున్నారు. వీడియోలోని జీవికి మొత్తం రెండు జతల కాళ్లు ఉన్నట్టు కనిపిస్తోంది. @balichannel అనే ఇన్‌స్టా అకౌంట్‌లో షేర్ చేసిన ఈ వీడియో ప్రజంట్ వైరల్ అవుతోంది.
వీడియో దిగువన చూడండి…
View this post on Instagram
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం..