AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral: 800 ఏళ్ల నాటి మమ్మీ చెంపపై మెరుస్తున్నట్టు ఏదో లైట్.. ఏంటా అని పరిశీలించగా

800 ఏళ్ల నాటి మమ్మీ చెంపపై ఉన్న టాటూను చూసి శాస్త్రవేత్తలు ఆశ్చర్యపోయారు. నిజానికి, టాటూలకు వాడే సిరా దాదాపు 1000 సంవత్సరాలుగా చెక్కుచెదరకుండా ఉంటుంది. కానీ ఈ మమ్మీపై ఉన్న పచ్చబొట్టు శాస్త్రవేత్తలకు అనేక విధాలుగా మర్మమైనదిగా అనిపించింది. అదేంటంటే

Viral: 800 ఏళ్ల నాటి మమ్మీ చెంపపై మెరుస్తున్నట్టు ఏదో లైట్.. ఏంటా అని పరిశీలించగా
Anicent Mummy
Ravi Kiran
|

Updated on: May 26, 2025 | 7:23 PM

Share

దక్షిణ అమెరికాలో జరిగిన ఓ అధ్యయనంలో పురావస్తు శాస్త్రవేత్తలు ఓ అరుదైన టాటూను కనుగొన్నారు. సుమారు 800 సంవత్సరాల పురాతన మమ్మీ చెంపపై ఈ పచ్చబొట్టును గుర్తించారు. ఆ పురాతన మమ్మీ విగ్రహంపై పలు పరిశోధనలు చేపట్టడమే కాదు.. ఆ పచ్చబొట్టుకు ఎలాంటి సిరాను ఉపయోగించారన్న దానిని కూడా కనుగొనేందుకు ప్రయత్నిస్తున్నారు. 800 సంవత్సరాలు గడిచినా ఇంకా చెక్కుచెదరకుండా ఉండటాన్ని చూసి ఆశ్చర్యపోతున్నారు.

800 ఏళ్ల నాటి మమ్మీ చెంపపై ఉన్న టాటూను చూసి శాస్త్రవేత్తలు ఆశ్చర్యపోయారు. నిజానికి, టాటూలకు వాడే సిరా దాదాపు 1000 సంవత్సరాలు ఉంటుంది. కానీ ఈ మమ్మీపై ఉన్న పచ్చబొట్టు శాస్త్రవేత్తలకు అనేక విధాలుగా మర్మమైనదిగా అనిపించింది. ఎందుకూ అంటే.? సాధారణంగా టాటూకు వాడిన సిరా సంవత్సరాలు గడిచే కొద్దీ దానంతట అదే మాయమైపోతుంది. అయితే ఇలా చెంపపై వేయించుకున్న పచ్చబొట్టు కొన్ని సంవత్సరాలలో మాయమైపోతుంది. కానీ ఇది మాయం కాలేదు.

మమ్మీ అంటే ఏమిటి.?

నిజానికి, మమ్మీని తయారు చేయడంలో ఒక పురాతన ప్రక్రియను ఉపయోగిస్తారు. దీనిలో ఏదైనా శవం లేదా మృతదేహాన్ని ప్రత్యేక రకమైన పూతతో చుట్టి ఉంచుతారు. కీటకాలు, వాతావరణం వల్ల మృతదేహం చెడిపోకుండా రక్షించడమే దీని ఉద్దేశ్యం. ఇక ఈ మమ్మీ దక్షిణ అమెరికాలో నివసిస్తున్న ఒక మహిళదని తేలింది. ఆమె శరీరం 800 సంవత్సరాల క్రితం మరణించిన తర్వాత మమ్మీగా మార్చబడింది. దాదాపు 100 సంవత్సరాల క్రితం ఇటలీలోని ఒక మ్యూజియంకు విరాళంగా ఇచ్చారు.

టాటూను ఎలా గుర్తించారు?

800 ఏళ్ల మమ్మీ చెంపపై ఉన్న టాటూను గుర్తించడం వెనుక ఒక కథ ఉంది. నిజానికి, ఇటలీలోని టురిన్ విశ్వవిద్యాలయానికి చెందిన జియాన్లుయిగి మాంగియాపేన్ నేతృత్వంలోని శాస్త్రవేత్తలు, పురావస్తు శాస్త్రవేత్తల బృందం మమ్మీని పరిశీలించింది. ఈ సమయంలో బృందం మమ్మీ చెంపపై మెరుస్తున్నట్టుగా పైనుంచి ఏదో లైట్ పడుతున్నది చూశారు. దాన్ని పరిశీలించగా మమ్మీ చెంపపై ఉన్న పచ్చబొట్టును గుర్తించగలిగారు.