Viral: అరుదైన నోటు అని వేలానికి పెట్టాడు.. పలికిన ధర చూసి కళ్లు తేలేశాడు.!

ఓ చారిటీ సంస్థలో దొరికిన అరుదైన బ్యాంక్ నోటును వేలం వేయగా.. అనుకున్న ధర కంటే ఎక్కువ రెట్లకు అమ్ముడైపోవడం అందరినీ షాక్‌కు గురి చేసింది...

Viral: అరుదైన నోటు అని వేలానికి పెట్టాడు.. పలికిన ధర చూసి కళ్లు తేలేశాడు.!
Currency
Follow us
Ravi Kiran

|

Updated on: May 18, 2022 | 10:38 AM

అరుదైన నాణేలు, నోట్లు ఆన్‌లైన్‌లో వేలం వేస్తుంటారని మనం వింటూనే ఉన్నాం. వాటిల్లో కొన్ని అత్యధిక ధర కూడా పలుకుతుంటాయి. అయితే ఇప్పుడిదంతా ఎందుకంటే.! ఓ చారిటీ సంస్థలో దొరికిన అరుదైన బ్యాంక్ నోటును వేలం వేయగా.. అనుకున్న ధర కంటే ఎక్కువ రెట్లకు అమ్ముడైపోవడం అందరినీ షాక్‌కు గురి చేసింది. మరి ఆ నోటు స్టోరీ ఏంటో తెలుసుకుందాం పదండి!

వివరాల్లోకి వెళ్తే.. పాలస్తీనాలోని ఆక్స్‌ఫామ్ అనే స్వచ్చంద సంస్థలో పాల్ అనే వ్యక్తి వాలంటీర్‌గా పని చేస్తున్నాడు. అతడికి 1927లో బ్రిటీష్ ప్రభుత్వం జారీ చేసిన 100 పౌండ్ల కరెన్సీ నోటు దొరికింది. సన్నిహితుల ద్వారా ఇది చాలా అరుదైన నోటు అని తెలుసుకున్న పాల్.. లండన్‌లోని స్పింక్ వేలం హౌస్‌లో వేలానికి పెట్టాలని నిర్ణయించాడు.

ఇలా అనుకున్నాడో లేదో.. వెంటనే ఆ నోటును ఆన్‌లైన్‌లో వేలానికి ఉంచాడు. ఇక ఆ నోటు వేలంలో ఏకంగా రూ. 1.3 కోట్లకు అమ్ముడైంది. అసలు రేటు కంటే 1400 రెట్లు ఎక్కువకు అమ్ముడైందని తెలుస్తోంది. దీనితో ఒక్కసారిగా అందరి ఫ్యూజులు ఎగిరిపోయాయి. నిజానికి ఆ నోటు విలువ రూ. 29 లక్షలట. కాగా, వేలంలో వచ్చిన ఆ మొత్తాన్ని ఆక్స్‌ఫామ్ స్వచ్చంద సంస్థ సేవా కార్యక్రమాలకు వినియోగించనుంది.

ఇవి కూడా చదవండి

Source: Timesnownews