Viral Photo: తగ్గేదేలే.! ఈ ఫోటోలోని పామును గుర్తిస్తే మీరే గ్రేట్.. ఈజీగా కనిపెట్టచ్చండోయ్!
ప్రస్తుతం అనేక రకాల పజిల్స్ నెట్టింట ట్రెండ్ సృష్టిస్తున్నాయి. వాటిల్లో ఫోటో పజిల్స్ కూడా ఒకటి. సవాళ్లు ఇష్టపడేవారు వీటిని ఈజీగా సాల్వ్ చేసేస్తారు...
ఆఫీస్ పని నుంచి రిలాక్సేషన్ పొందేందుకు.. బోర్ కొట్టకుండా టైం గడిచేందుకు ఈ మధ్య అందరూ కూడా సోషల్ మీడియాను మంచి ఆప్షన్‌గా ఎంచుకుంటున్నారు. ఫన్‌తో పాటు మెదడుకు మేత వేసే కంటెంట్ బోలెడంత ఇంటర్నెట్‌లో దొరుకుతుంది. వీడియోలు, ఫన్నీ మీమ్స్ మాత్రమే కాదు.. మీలో చురుకుదనాన్ని పెంచేందుకు ఫోటో పజిల్స్, ఆప్టికల్ ఇల్యూషన్ చిత్రాలు లాంటివి చాలానే ఉన్నాయి. ప్రస్తుతం అనేక రకాల పజిల్స్ నెట్టింట ట్రెండ్ సృష్టిస్తున్నాయి. వాటిల్లో ఫోటో పజిల్స్ కూడా ఒకటి. సవాళ్లు ఇష్టపడేవారు వీటిని ఈజీగా సాల్వ్ చేసేస్తారు. ఎక్కడ దొరికినా విడిచిపెట్టరు. ఓ పట్టు పట్టేస్తారు.
మరి మీకు కూడా సవాళ్లు ఎదుర్కోవడం ఇష్టమైతే..? ఒక్కసారి ఇలాంటి పజిల్‌పై దృష్టి పెట్టండి.. మీ కళ్లలో ఎంత పవర్ ఉందో తెలుసుకోండి.! ఈ ఫోటో పజిల్స్ కోసం సోషల్ మీడియాలో పలు పేజీలు ప్రత్యేకంగా రన్ అవుతున్నాయి. పజిల్ అంటే ఏముందిలే.. సండే బుక్స్‌లో వచ్చే పద సంపత్తి లాంటిదని అనుకోవద్దు.. పద సంపత్తి ఒక ఎత్తయితే.. ఈ ఫోటో పజిల్స్ మరో ఎత్తు. ఫోటో పజిల్స్‌లో మూడు రకాలు ఉంటాయి. కొన్ని సరదాగా.. ఈజీగా సాల్వ్ చేసేయగలిగితే.. మరికొన్ని కొంచెం కష్టంగా ఉంటాయి.. ఇంకొన్ని మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేసి పడేస్తాయి.
ఏది ఏమైనా పజిల్స్ సాల్వ్ చేస్తే మాత్రం అందరికీ మాంచి కిక్కుంటుంది. తాజాగా ఓ పజిల్ ఇంటర్నెట్‌లో తెగ చక్కర్లు కొడుతోంది. పైన పేర్కొన్న ఫోటో చూడటానికి ఏదో కేజ్(Cage)లాగ ఉంది కదూ.! అవునండీ! మీరు అనుకున్నది కరెక్టే.. అందులో ఓ పాము దాగుంది. అది ఎక్కడుందో మీరే చెప్పాలి. చాలా ఈజీ పజిల్. నూటికి 99 శాతం మంది ఈ పజిల్ తగ్గేదేలే అన్నట్లుగా పట్టు పట్టేశారు. చాలామంది దీన్ని ఫస్ట్ అటెంప్ట్‌లోనే సాల్వ్ చేసేశారు. మరి మీరూ మొదటి ప్రయత్నంలోనే పామును కనిపెడితే.. మీరే గ్రేట్ అని చెప్పాలి. ఒకవేళ మీకు ఎంతసేపు చూసినా పాము కనబడకపోతే.. సమాధానం కోసం కింద ఫోటోను చూసేయండి..
here is the answer.. pic.twitter.com/myc4Di3ZIP
— telugufunworld (@telugufunworld) May 18, 2022