AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

సద్భావన ఎక్స్‌ప్రెస్ రైళ్లో షాకింగ్‌ ఘటన.. రాత్రి 10 గంటలు దాటగానే మొదలైన రచ్చ..!

రైలు ప్రయాణాల్లో రాత్రి వేళ తోటి ప్రయాణికుల నుంచి ఎదురయ్యే శబ్ధాలు, అల్లరి, గోలపై మరోసారి తీవ్రమైన చర్చ మొదలైంది. సద్భావన ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణిస్తున్న ఒక వ్యక్తి, రాత్రి 10 గంటలు దాటిన తర్వాత కూడా కోచ్‌లోని ఇతర ప్రయాణికులు బిగ్గరగా మాట్లాడుకుంటూ తమ నిద్రకు భంగం కలిగిస్తున్నారని సోషల్ మీడియా వేదికగా రైల్వే అధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనకు సంబంధించిన పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారడంతో భారతీయ రైల్వే నిబంధనలు, ప్రయాణికుల బాధ్యతలపై నెటిజన్లు పెద్ద ఎత్తున స్పందిస్తున్నారు. అసలేం జరిగింది?

సద్భావన ఎక్స్‌ప్రెస్ రైళ్లో షాకింగ్‌ ఘటన.. రాత్రి 10 గంటలు దాటగానే మొదలైన రచ్చ..!
Indian Railways Night Rules
Jyothi Gadda
|

Updated on: Oct 08, 2026 | 7:18 PM

Share

సద్భావన ఎక్స్‌ప్రెస్ రైలులో ప్రయాణిస్తున్న ఒక ప్రయాణికుడు, రాత్రి వేళ కోచ్‌లో సహ-ప్రయాణికులు గట్టిగా మాట్లాడుతుండటంతో రాత్రి 10 గంటల తర్వాత శబ్ద నియమాలపై ఎక్స్ వేదికగా రైల్వే సవాకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో రైలు ప్రయాణాల్లో పాటించాల్సిన నిబంధనలపై పెద్ద ఎత్తున చర్చ మొదలైంది. సద్భావన ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణిస్తున్న వ్యక్తి రాత్రి సమయం దాటినా తోటి ప్రయాణికులు నిరంతరాయంగా గట్టిగా మాట్లాడుకుంటూ రచ్చ చేస్తుండటంతో, వారిని ఎంత కోరినా వినకపోవడంతో రైల్వే సేవా ని ఎక్స్‌లో ట్యాగ్ చేస్తూ పిఎన్‌ఆర్ (PNR) నంబర్‌తో ఫిర్యాదు చేశారు. వెంటనే స్పందించిన రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ సిబ్బంది, ఆ కోచ్ వద్దకు వెళ్లి నిబంధనలను అతిక్రమిస్తున్న ప్రయాణికులకు సర్దిచెప్పి సమస్యను పరిష్కరించారు.

రైల్వేస్ రాత్రి నిబంధనలు:

ఇవి కూడా చదవండి

ప్రయాణికుల సౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకుని భారతీయ రైల్వేస్ రాత్రి 10:00 గంటల నుండి ఉదయం 6:00 గంటల వరకు కొన్ని కఠినమైన నిబంధనలను అమలు చేస్తోంది. రాత్రి 10 గంటల తర్వాత కోచ్‌లో బిగ్గరగా మాట్లాడటం లేదా ఇతరులకు ఇబ్బంది కలిగించేలా ఫోన్ల స్పీకర్లలో పాటలు, వీడియోలు వినడం నిషేధం. ఇయర్ ఫోన్స్ మాత్రమే ఉపయోగించాలి. నైట్ లైట్లు మినహా కోచ్‌లోని ప్రధాన లైట్లన్నీ రాత్రి 10 గంటలకల్లా ఆపివేయాలి. రాత్రి 10 గంటల తర్వాత టికెట్ తనిఖీ సిబ్బంది ప్రయాణికుల టికెట్లను పరిశీలించకూడదు.

ఈ పోస్ట్‌పై నెటిజన్లు రెండుగా విడిపోయారు. కొందరు ప్రయాణికుడికి మద్దతుగా నిలుస్తూ రైలు ప్రయాణంలో తోటి ప్రయాణికుల ప్రశాంతతను గౌరవించడం ప్రాథమిక బాధ్యత అని పేర్కొనగా, మరికొందరు రైలు ప్రయాణంలో స్వల్ప సంభాషణలు సహజమే, ప్రతి చిన్న విషయానికి అధికారులకు ఫిర్యాదు చేయడం సరికాదు అని అభిప్రాయపడ్డారు. ఏది ఏమైనా, ప్రయాణికులు బాధ్యతాయుతంగా ప్రవర్తిస్తేనే ప్రయాణం అందరికీ సుఖమయంగా ఉంటుందని ఈ ఘటన నిరూపిస్తోంది.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Follow Us