Making Of Jaggery: చెరుకు రసం నుంచి బెల్లాన్ని ఎలా తయారు చేస్తారో తెలుసా.? దీని వెనక ఎంత పెద్ద కథ ఉంటుందంటే..

నిత్యం మనం ఉపయోగించే ఆహార పదార్థాల్లో బెల్లం ఒకటి. ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే బెల్లాన్ని ఏదో ఒక రూపంలో ఆహారంలో భాగం చేసుకోవాలని పెద్దలు చెబుతుంటారు. అందుకే పండుగల సమయంలో చేసే ప్రసాదాల్లో బెల్లాన్ని వాడుతుంటారు. బెల్లం శరీరంలోని..

Making Of Jaggery: చెరుకు రసం నుంచి బెల్లాన్ని ఎలా తయారు చేస్తారో తెలుసా.? దీని వెనక ఎంత పెద్ద కథ ఉంటుందంటే..
Making Of Jaggery
Follow us

|

Updated on: Jan 06, 2023 | 3:24 PM

నిత్యం మనం ఉపయోగించే ఆహార పదార్థాల్లో బెల్లం ఒకటి. ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే బెల్లాన్ని ఏదో ఒక రూపంలో ఆహారంలో భాగం చేసుకోవాలని పెద్దలు చెబుతుంటారు. అందుకే పండుగల సమయంలో చేసే ప్రసాదాల్లో బెల్లాన్ని వాడుతుంటారు. బెల్లం శరీరంలోని రక్తాన్ని శుద్ధి చేసి మెటబాలిజంను క్రమబ్దీకరిస్తుంది. ప్రతీరోజూ ఒక గ్లాసు నీటితో బెల్లాన్ని కలిపి తీసుకుంటే పొట్టలో గ్యాస్‌, ఉబ్బరం వంటి సమస్యలకు చెక్‌ పెట్టొచ్చు. ఇక బెల్లం ధర కూడా చాలా తక్కుగా ఉంటుంది. అందుకే ఎన్నో ఏళ్ల నుంచి బెల్లాన్ని ఆరోగ్యంలో భాగం చేసుకుంటున్నారు. ఇదిలా ఉంటే ఇన్ని ఉపయోగాలు ఉన్న బెల్లాన్ని అసలు ఎలా తయారు చేస్తారో మీలో ఎంత మందికి తెలుసు.? చెరుకును పొలం నుంచి సేకరించడం మొదలు బెల్లంగా మార్చే వరకు పెద్ద ప్రాసెస్‌ ఉంటుంది. బెల్లం తయారీ విధానం ఎలా ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం..

* చెరుకు పంట చేతికొచ్చిన తర్వాత మొదట బెల్లాన్ని ఫ్యాక్టరీకి తీసుకొస్తారు.

* అనంతరం చెరుకును క్రషర్‌లో వేసి రసాన్ని వేరు చేస్తారు. తర్వాత రసంలో ఉండే వ్యర్థ పదార్థాలను వడపోత ద్వారా బయటకు తీసి రసాన్ని మొత్తం ఒక పెద్ద పాత్రలో పోస్తారు.

ఇవి కూడా చదవండి

* ఆ తర్వాత రసాన్ని శుభ్రపరిచే క్రమంలో ఒకరమైన లిక్విడ్‌ను అందులో కలుపుతారు.

* దీంలో చెరుకు రసంలో ఉండే మలినాలు పైభాగానికి చేరుకుంటాయి. దీనిని బయటకు తొలగిస్తారు.

* ఇదంతా అయ్యాక రసాన్ని బాగా వేడి చేస్తారు. చిక్కగా అయ్యేంత వరకు రసాన్ని వేడి చేస్తూనే ఉంటారు. ఇలా చేయడం వల్ల ముదురు రంగులోకి మారుతుంది.

* బెల్లం రూపంలోకి మారిన తర్వాత కాస్త జిగుటుగా ఉండే బెల్లాన్ని తీసుకొని డబ్బాల్లో నింపుతారు. అనంతరం పూర్తిగా చల్లబడ్డ తర్వాత బెల్లాన్న వేరు చేసి మార్కెట్‌కు తరలిస్తారు.

బెల్లం తయారీ వీడియో..

మరిన్ని ట్రెండింగ్ ఆర్టికల్స్ కోసం క్లిక్ చేయండి..

Latest Articles