AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

నది ఒడ్డున విహారయాత్రలో ఎంజాయ్.. ఇంతలోనే ఏంట్రీ ఇచ్చిన ఏనుగు..!

కొంతమంది ఆడవిలో నది ఒడ్డున విహారయాత్ర ఎంజాయ్ చేస్తుండగా, అకస్మాత్తుగా ఒక ఏనుగు అక్కడికి వచ్చింది. ఆడవిలో చోటు చేసుకున్న అనూహ్య ఘటనకు సంబంధించిన ఒక వీడియోను IFS అధికారి ప్రవీణ్ కస్వాన్ సోషల్ మీడియా X లో షేర్ చేశారు. ఇది ఎవరి తప్పు? అని ఆయన ప్రజలను అడిగారు. దీంతో నెటిజన్లు రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు.

నది ఒడ్డున విహారయాత్రలో ఎంజాయ్.. ఇంతలోనే ఏంట్రీ ఇచ్చిన ఏనుగు..!
Elephant Picnic
Balaraju Goud
|

Updated on: Jun 13, 2025 | 4:31 PM

Share

నది ఒడ్డున చాలా మంది తమ కుటుంబాలతో కలిసి విహారయాత్రను ఎంజాయ్ చేస్తున్నారు. ఇంతలో ఒక భారీ ఏనుగు అక్కడికి వచ్చింది. దీంతో ఆ ప్రాంతంలో ఒక్కసారిగా గందరగోళం నెలకొంది. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్లు షాక్ కు గురయ్యారు.

వైరల్ అవుతున్న వీడియోలో చాలా కుటుంబాలు పిక్నిక్ ఎంజాయ్ చేస్తున్నారు. వారిలో చాలా మంది అక్కడికక్కడే ఆహారం వండుకుంటున్నారు. ఇంతలో, ఒక భారీ ఏనుగు అడవి నుండి బయటకు వచ్చి వారి వైపు పరుగెత్తింది. ఈ దృశ్యం నిజంగా భయానకంగా ఉంది. ఏనుగును చూసిన తర్వాత అక్కడున్న వారంతా భయపడి తమ వస్తువులను వదిలి ఎక్కడికక్కడ పరుగులు తీశారు.

ఈ సమయంలో, అక్కడ ఉన్న ఒక వాహన డ్రైవర్ కూడా ఏనుగును చూసిన తర్వాత తన మార్గాన్ని మార్చుకున్నాడు. అదృష్టవశాత్తూ, ఏనుగు ఎవరికీ హాని చేయలేదు. అడవిలోకి తిరిగి వెళ్లిపోయింది. ఈ సంఘటన అస్సాం-అరుణాచల్ సరిహద్దులో ఉన్న ఒక ప్రసిద్ధ పిక్నిక్ ప్రదేశంలో జరిగినట్లు తెలుస్తోంది.

వీడియోను ఇక్కడ చూడండి

ఈ ఆశ్చర్యకరమైన వీడియోను ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ (IFS) అధికారి పర్వీన్ కస్వాన్ తన హ్యాండిల్ @ParveenKaswan ద్వారా షేర్ చేశారు. ఇది ఎవరి తప్పు అని అడిగారు? ఈ సంఘటన ప్రజలలో కొత్త చర్చకు దారితీసింది. ఇలాంటి సంఘటనలను నివారించడానికి అధికారులు తగినంత చర్యలు తీసుకోలేదని కొందరు ఆరోపించగా, మరికొందరు ఈ తప్పు అటవీ ప్రాంతాలలో పిక్నిక్‌లకు వెళ్లే వారిదేనని అంటున్నారు. ఒక యూజర్ ఇలా వ్యాఖ్యానించారు. “ప్రభుత్వం అలాంటి ప్రదేశాలలో ప్రజల సంచారాన్ని నిషేధించాలి. మీరు ఏనుగుల ఇంట్లోకి ప్రవేశిస్తే, అవి ఖచ్చితంగా కోపంగా ఉంటాయి” అని మరొక యూజర్ అన్నారు. అటవీ శాఖ ఈ దిశగా తీవ్రంగా ఆలోచించాల్సిన అవసరం ఉందని మరొక యూజర్ రాశారు.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..