చెత్త మధ్యన ఉన్నది ఏదో సాధారణ శిల్పం అనుకుంటే పొరపాటే
సిద్ధిపేట జిల్లా గజ్వేల్ మండలంలోని చారిత్రక ప్రాధాన్యత కలిగిన గ్రామం బెజుగామలో వేర్వేరు కాలాలకు చెందిన జైన తీర్థంకరుడు వర్ధమాన మహావీరుని రెండు శిల్పాలను కొత్త తెలంగాణ చరిత్ర బృందం చరిత్రకారుడు కొలిపాక శ్రీనివాస్ గుర్తించారు. మొదటి శిల్పం గ్రామంలోని రాయ చెరువు వద్ద ఉంది. ఇది ధ్యాన ముద్రలో ఉన్న మహావీరుని శిల్పం.
శిల్పంపై ఉన్న ఉష్ణీషం అరుదైన కళాత్మకతతో ఆకర్షిస్తోంది. కోలముఖంతో కనిపించే ఈ శిల్పం 8, 9వ శతాబ్దాలకు చెందినది. ఇది బ్లాక్ కోరైట్ రాయిపై చెక్కబడింది. ఆ కాలానికి ప్రత్యేకమైన శిల్పకళను ప్రతిబింబిస్తుంది. రెండవ శిల్పం గ్రామంలోని హనుమాన్ ఆలయం పక్కన చెత్తలో పడి ఉంది. ఇది కొంత విరిగిపోయినా, 10 లేదా 11వ శతాబ్దం శైలిలో చెక్కబడినట్లు స్పష్టంగా తెలుస్తోంది. ఈ శిల్పం గుండ్రని ముఖంతో, చిన్న ఉష్ణీషంతో ఉంది. బెజుగాం దేవుడు అనే జైనతీర్థంకరుడికి సంబంధించిన కళ్యాణీ చాళుక్యులు పాలించిన.. భువనైకమల్ల దేవర కాలానికి చెందిన శాసనాలు ఈ గ్రామంలో ఉన్నాయి. వీటిలో 1072 సంవత్సరానికి చెందిన ఒక శాసనమూ, మరొక శాసన శకలమూ ఉన్నాయి. శాసనంలో పేర్కొన్న బెజుగాం దేవుడు జైనతీర్థంకరుడే అయ్యుండవచ్చని చరిత్రకారులు భావిస్తున్నారు. పరిశోధకుడు కొలిపాక శ్రీనివాస్ గ్రామస్తులకు పిలుపునిస్తూ, చెరువులో ఉన్న మహావీరుని శిల్పాన్ని నీటిలో మునిగిపోకముందే బయటకు తీసి సురక్షితంగా ఉంచాలని, తమ గ్రామ చరిత్రను సంరక్షించుకోవాలని సూచించారు. ఈ శిల్పాలు, శాసనాలు బెజుగామ చారిత్రక వైభవాన్ని ప్రతిబింబిస్తున్నాయి.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఆటోలో తన లేగదూడను చూసి వెంబడించిన ఆవు.. చివరికి
TOP 9 ET News: బన్నీ అవుట్.. NTR ఇన్! అన్ స్టాపబుల్‌గా త్రివిక్రమ్
దిమ్మతిరిగే అప్ డేట్.. త్రివిక్రమ్ డైరెక్షన్లో కార్తికేయుడిగా NTR
బుర్జ్ ఖలీఫాలో ప్లాట్ కొన్న ఒకే ఒక్క ఇండియన్ స్టార్ హీరో..
పవన్ ఫ్యాన్స్‌కు దిమ్మతిరిగే న్యూస్.. ఉస్తాద్ సెట్లో అడుగుపెట్టిన పవర్ స్టార్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్ చేసిన డ్రైవర్ షాక
ఖతర్నాక్ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
డ్రైవర్‌పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్
తల్లిపై కూతురు పోటీ.. ఆసక్తిగా మారిన పంచాయతీ పోరు..
రోడ్డు పక్కన నిలిపి ఉన్న కారు.. డోర్ తెరవగానే
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్ చేసిన డ్రైవర్ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..

