ఆటోలో తన లేగదూడను చూసి వెంబడించిన ఆవు.. చివరికి
అమ్మ ఎవరికైనా అమ్మే.. మనిషులైనా.. పశుపక్ష్యాదులైనా తల్లిప్రేమకు సాటి మరొకటి ఉండదు. వందమందిలో ఉన్నా తన బిడ్డను గుర్తిస్తుంది తల్లి.. అలాగే.. దూడ అరుపు విని తన బిడ్డను గుర్తించింది ఓ ఆవు. ఆటోలో తీసుకెళ్లిపోతున్న తన బిడ్డ కోసం ఆటో వెంట పరుగులు తీసింది ఆగోమాత. జగిత్యాల పట్టణం గోవిందుపల్లెకు చెందిన నరేందర్ అనే వ్యక్తి ఆవును పెంచుకుంటున్నాడు.
ఈ మధ్యనే అది ఓ దూడకు జన్మనిచ్చింది. ఈ క్రమంలోనే ఆవు బుధవారం రాత్రి మేతకోసం వెళ్లి ఇంటికి తిరిగి రాలేదు. దీంతో లేగ దూడ పాల కోసం అరుస్తూ తల్లి కనిపించక తల్లడిల్లిపోయింది. అంబా అంబా అంటూ అరుస్తూనే ఉంది. దాని బాధ చూసి తల్లడిల్లిన నరేందర్ ఓ ఆటోలో లేగ దూడను తీసుకొని పట్టణం అంతా తిరుగుతూ తల్లి ఆవుకోసం వెతుకుతున్నాడు. ఎట్టకేలకు జగిత్యాల కొత్త బస్టాండ్ వద్ద ఆవును గుర్తించాడు. ఆటోలో దూడను చూసిన ఆవు తన బిడ్డేనని గుర్తించింది. తన దూడను ఎవరో తీసుకెళ్లిపోతున్నారని భావించిన ఆవు వెంటనే ఆటోవెంట పరుగుతీసింది. అలా ఆటోవెంట పరుగెత్తి చివరికి తన యజమాని ఇంటికి చేరింది. పాలిచ్చి దూడ ఆకలి తీర్చింది. దూడకోసం ఆటోవెంట పరుగులు తీస్తున్న ఆవును చూసి స్థానికులు ఆశ్చర్యపోయారు. ఈ ఆవుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
TOP 9 ET News: బన్నీ అవుట్.. NTR ఇన్! అన్ స్టాపబుల్‌గా త్రివిక్రమ్
దిమ్మతిరిగే అప్ డేట్.. త్రివిక్రమ్ డైరెక్షన్లో కార్తికేయుడిగా NTR
బుర్జ్ ఖలీఫాలో ప్లాట్ కొన్న ఒకే ఒక్క ఇండియన్ స్టార్ హీరో..
పవన్ ఫ్యాన్స్‌కు దిమ్మతిరిగే న్యూస్.. ఉస్తాద్ సెట్లో అడుగుపెట్టిన పవర్ స్టార్
పూర్తిగా పాడైన కోట కాళ్లు.. ఏకంగా కాలి వేళ్లు తీయాల్సిన పరిస్థితి
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్ చేసిన డ్రైవర్ షాక
ఖతర్నాక్ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
డ్రైవర్‌పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్
తల్లిపై కూతురు పోటీ.. ఆసక్తిగా మారిన పంచాయతీ పోరు..

