ఇది పర్యావరణ పెళ్లి.. అంతా మొక్కలతోనే
ప్రపంచ పర్యావరణ దినోత్సవం రోజున వరంగల్ లో ఓ జంట వినూత్నంగా వివాహం చేసుకున్నారు. సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్న వరుడు సాయిచంద్ పర్యావరణహితం కోరుతూ, ప్లాస్టిక్ ఫ్రీ వివాహం చేసుకున్నారు. పత్రికల పంపిణీ నుండి పెళ్లి మండపం వరకు అంతా మొక్కలతో నింపేశారు. మండపమంతా మొక్కలే.. ఆ పెళ్లికి వచ్చిన వారికి కూడా మొక్కలను రిటర్న్ గిఫ్ట్‌గా పంచి అందరికీ ఆదర్శంగా నిలిచారు.
ప్రపంచం అంతా కాలుష్యం బారిన పడుతోంది.ప్లాస్టిక్ మనిషి నిత్య జీవితంలో భాగమైంది. ప్రాణవాయువు ఇచ్చే చెట్లు కనుమరుగైపోతున్నాయి. భావితరాలు బాగుండాలంటే, ప్లాస్టిక్ ఫ్రీ సమాజం, చెట్లను పెంచి ప్రకృతిని కాపాడడం తప్ప మరో మార్గం లేదని భావించాడు వరంగల్ లోని విద్యానగర్ కు చెందిన గుండపు సాయిచంద్. హైదారాబాద్ లోని ఓ కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా పనిచేస్తున్న సాయిచంద్ తన పెళ్లి వేడుక ద్వారా సమాజానికి ఓ మంచి మెసేజ్ ఇవ్వాలని భావించాడు. అందుకోసం వినూత్న నిర్ణయం తీసుకున్నాడు. పర్యావరణంపై అవగాహన కల్పించేందుకు తన పెళ్లికి ప్రపంచ పర్యావరణ దినోత్సవమే శుభ ముహూర్తమని ఫిక్స్ అయ్యాడు. తన పెళ్లిలో ఎక్కడా ప్లాస్టిక్ కనిపించకూడదని నిర్ణయించుకున్నాడు. పెళ్లి పత్రికలు పంచుతూ బంధుమిత్రులకు పత్రికలతో పాటు వినూత్నంగా స్టీల్ బాటిల్, మొక్కలు అందించాడు. అంతేకాదు, తన వెంట గడ్డపార తీసుకెళ్లిన వరుడు బంధువుల ఇండ్ల వద్ద తనే స్వయంగా మొక్కలు నాటి పెళ్లికి రావాలని కోరాడు. పెళ్లికి హాజరైన బంధువుల కోసం రిటర్న్ గిఫ్టుగా జూట్ బ్యాగులు, మొక్కలు పంపిణీ చేసి ఔరా అనిపించారు ఈ నవ దంపతులు. విందు కార్యక్రమంలో ప్లాస్టిక్ వాడకుండా స్టీల్ గ్లాసులు, వుడ్ ప్లేట్స్ వినియోగించారు. పెళ్లి మండపం మొత్తం మొక్కలతో నింపేశారు.. పర్యావరణాన్ని రక్షించాలని సందేశాలు ఇస్తున్న ఫ్లకార్డులను ప్రదర్శించారు. సాయిచంద్ బావ ప్రశాంత్, స్వచ్ఛంద సంస్థ నిర్వహిస్తూ పర్యావరణ పరిరక్షణ కోసం కొన్నేళ్లుగా ఎన్నో కార్యక్రమాలు చేపట్టారు. తన బావ చేస్తున్న సామాజిక సేవకు ఆకర్షితుడై సాయిచంద్ సైతం పర్యావరణ ప్రేమికుడిగా మారిపోయాడు. పర్యావరణ మార్పుల వల్ల కలుగుతున్న అనర్ధాలను తెలుసుకొని జీవితాంతం ప్రకృతిని కాపాడే చర్యలు తీసుకుంటానని ప్రతి ఒక్కరూ పర్యావరణానికి మేలు చేసే పనులు చేయాలని పిలుపునిస్తున్నారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఆటోలో తన లేగదూడను చూసి వెంబడించిన ఆవు.. చివరికి
TOP 9 ET News: బన్నీ అవుట్.. NTR ఇన్! అన్ స్టాపబుల్‌గా త్రివిక్రమ్
దిమ్మతిరిగే అప్ డేట్.. త్రివిక్రమ్ డైరెక్షన్లో కార్తికేయుడిగా NTR
బుర్జ్ ఖలీఫాలో ప్లాట్ కొన్న ఒకే ఒక్క ఇండియన్ స్టార్ హీరో..
పవన్ ఫ్యాన్స్‌కు దిమ్మతిరిగే న్యూస్.. ఉస్తాద్ సెట్లో అడుగుపెట్టిన పవర్ స్టార్

సర్కారు ఆఫీసుకు దిష్టి.. పోవటానికి ఏం చేసారో తెలుసా

చోరీకి వెళ్లిన ఇంట్లోనే 3 రోజులు మకాం వేసిన దొంగ.. ఆ తర్వాత

బటర్ నాన్ ఆర్డర్ చేశాడు.. సరిగ్గా తినే టైంకి..

ఆకాశంలో ఉండగా విమానంలో వింత శబ్దాలు.. ఇదేం ఖర్మ రా నాయన..!

ప్రియురాలి కరివేపాకు కోరిక.. దేశాలు దాటి వచ్చిన ప్రియుడు

ఫ్రిజ్‌లో వింత సౌండ్స్.. వెళ్లి చూడగా గుండె గుభేల్

వాట్ ఏ టెక్నలాజియా.. బంతి లోయలో పడకుండా కుర్రాళ్ల జబర్దస్త్ ఐడియా
