సమాధి వద్దే యజమాని రాక కోసం కుక్క ఎదురుచూపులు
విశ్వాసానికి శునకాన్ని మించిన జంతువు మరొకటి ఉండదంటే అతిశయోక్తి కాదు. తనకు అన్నం పెట్టిన యజమానిని, అతని కుటుంబానికి రక్షణగా నిలుస్తుంది. తనకు నీడనిచ్చిన ఇంటి రక్షణ కోసం ప్రాణాలను సైతం పణంగా పెడుతుంది. అలాంటి ఓ శునకం తన యజమాని చనిపోవడంతో అది జీర్ణించుకోలేని ఆ మూగజీవి అతని రాకకోసం అతని సమాధి వద్దే తిరుగుతూ ఎదురుచూస్తోంది.
ఈ ఘటన పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్‌లో జరిగింది. జిల్లాలోని కనుకుల గ్రామానికి చెందిన తాళ్లపల్లి కొమురయ్య అనే వ్యక్తి ఇటీవలే కారు ప్రమాదంలోచనిపోయాడు. అతను ఓ శునకాన్ని పెంచుకుంటున్నాడు. రాజు అంటూ ముద్దుగా పిలుచుకునే ఆ శునకం అంటే ఆయనకు ఎంతో ప్రేమ. ఆ శునకానికి కూడా కొమురయ్య అంటే అంతే ఇష్టం. అతను చేత్తో పెడితేనే ఆహారం తింటుంది. ఎక్కడికి వెళ్లినా కొమురయ్య వెంటే ఉండేది ఆ శునకం. అయితే కొమురయ్య చనిపోయాడని, ఇక తిరిగిరాడని తెలియని ఆ మూగజీవి అతని రాకకోసం ఎదురుచూస్తోంది. కొమురయ్య అంత్యక్రియలో పాల్గొన్న ఆ శునకానికి కొమురయ్యను భూమిలో ఎందుకు పూడ్చుతున్నారో అర్థం కాని ఆ ప్రాణి ప్రతిరోజూ అతని సమాధి వద్దకు వెళ్లి అక్కడే కాసేపు పడుకొని ఇంటికి వస్తోంది. అతన్ని పిలుస్తూ సమాధి చుట్టూ తిరుగుతోంది. కొమురయ్య కుటుంబ సభ్యులు దానికి ఆహరం పెట్టినా తినకుండా యజమాని కోసం మూగగా రోధిస్తోంది. ఈ ఘటన చూపరులను కంటతడి పెట్టించింది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
అర్ధరాత్రి స్టైల్‌గా సిగరెట్ తాగుతూ వచ్చాడు.. కట్ చేస్తే.. ఆ తర్వాత సీన్‌కి దిమ్మతిరుగుద్ది
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్‌గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
గ్లాస్ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం

