Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వావ్‌.. అట్లుంటది ఏఐ రోబోతోని.. వీడియో

వావ్‌.. అట్లుంటది ఏఐ రోబోతోని.. వీడియో

Samatha J
|

Updated on: Jun 12, 2025 | 2:40 PM

Share

స్విట్జర్లాండ్ లోని శాస్త్రవేత్తలు కృత్రిమ మేధస్సు సాయంతో బ్యాడ్మింటన్ ఆడే రోబోను తయారుచేసి యావత్ ప్రపంచాన్ని ఆకర్షించారు. ఈటీహెచ్ జ్యూరిచ్ విశ్వవిద్యాలయ పరిశోధకులు ఈ అద్భుత సృష్టి సాంకేతిక రంగంలో మరో మైలురాయిగా నిలుస్తుంది. మారుతున్న కాలంతో పాటు సాంకేతిక పరిజ్ఞానం కొత్త శిఖరాలను అధిరోహిస్తుంది. మనిషి మేధస్సుకు సవాల్ విసురుతూ యంత్రాలు అత్యంత క్లిష్టమైన పనులను సైతం అలవోకగా పూర్తి చేస్తున్నాయి. ఈ కోవలోనే స్విట్జర్లాండ్ శాస్త్రవేత్తలు బ్యాడ్మింటన్ క్రీడలో మనుషులతో పోటీపడగల ఆధారిత రూపాన్ని ఆవిష్కరించారు.

ఈటీహెచ్ జ్యూరిచ్ విశ్వవిద్యాలయ పరిశోధకులు అనిమల్ డీ అనే నాలుగు కాళ్ల రోబోకు ఒక స్టీరియో కెమెరా బ్యాడ్మింటన్ రాకెట్ ను పట్టుకోవడానికి అనువుగా ఒక డైనమిక్ చేయిని అమర్చారు. రీ ఇన్ఫోర్స్ మెంట్ లెర్నింగ్ అనే అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి ఈ రోబోకు శిక్షణ ఇచ్చారు. దీని ద్వారా షటిల్ కాక్ కదలికలను గమనించి దాని గమనాన్ని అంచనా వేస్తూ కోర్టులో చురుగ్గా కదులుతూ షటిల్ లను తిరిగి కొట్టగలుగుతుంది. తప్పుల నుంచి పాఠాలు నేర్చుకుంటూ తన ఆటతీరును మెరుగుపరుచుకుంటుంది. మనుషులకు భిన్నంగా దీనికి నాలుగు కాళ్లు ఉండటం విశేషం. ఇది రోబోకు అధిక స్థిరత్వాన్ని అందించడమే కాకుండా వేగంగా కదిలేందుకు కూడా దోహదపడుతుంది. పరీక్షల్లో ఈ రోబో అద్భుత ప్రతిభ కనబరిచింది. మానవ క్రీడాకారులు కొట్టిన షాట్లను వివిధ వేగాలు కోణాల్లో విజయవంతంగా తిప్పికొట్టింది. ఒక సందర్భంలో ఏకంగా 10 షాట్ల వరకు ర్యాలీని కొనసాగించి ఆశ్చర్యపరిచింది.