టాయిలెట్‌లో వింత జంతువును చూసి షాక్ వీడియో
రాజస్థాన్లో ఒక నివాస ప్రాంతంలో ఊహించని సంఘటన చోటుచేసుకుంది. ఓ ఇంట్లోని మరుగుదొడ్డి నుంచి ఏకంగా రెండు అడుగుల పొడవైన ఉడుము బయటకు రావడంతో ఆ కుటుంబ సభ్యులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఉదయాన్నే బాత్రూంకు వెళ్దామనుకున్న ఆ ఇంట్లోని వారికి లోపల నుంచి వింత శబ్దాలు రావడంతో కంగారుపడ్డారు. ఏమై ఉంటుందా అని డోర్ కొద్దిగా ఓపెన్ చేసి చూడగా టాయిలెట్ బౌల్ నుంచి ఒక పెద్ద ఉడుము బయటకు వస్తుండటం చూసి ఒక్కసారిగా షాకయ్యారు. మొదట అదేమిటో అర్థం కాక తీవ్ర ఆందోళనకు గురయ్యారు.
వెంటనే తేరుకొని బాత్రూం తలుపులను మూసివేసి సాయం కోసం స్థానిక అధికారులకు సమాచారం అందించారు. సాధారణంగా భారతదేశ ఉపఖండంలో బెంగాల్ మానిటర్ జాతి ఉడుములు ఎక్కువగా కనిపిస్తాయి. ఇవి విషపూరితం కానప్పటికీ వాటి పరిమాణం ఆకస్మికంగా ఇళ్లలోకి ప్రవేశించడం వల్ల ప్రజలు భయపడడం సహజం. ఈ బెంగాల్ మానిటర్ ఉడుము 177 సెంటీమీటర్ల పొడవు వరకు పెరుగుతుంది. ప్రస్తుతం కనిపించిన ఉడుము దాదాపు రెండు అడుగుల పొడవు ఉంది. దీనిపై వన్యప్రాణి నిపుణులు మాట్లాడుతూ అడవులు తగ్గిపోవడం వల్ల ఆహారం ఆశ్రయం కోసం వన్యప్రాణులు ఎక్కువగా మానవ నివాసాల్లోకి వస్తున్నాయని అన్నారు. ముఖ్యంగా డ్రైనేజీ వ్యవస్థకు అనుసంధానంగా ఉండే బాత్రూమ్ లు టాయిలెట్లు కొన్నిసార్లు అనుకోకుండా సరీసృపాలు ఇళ్లలోకి ప్రవేశించడానికి మార్గంగా మారుతున్నాయని వివరించారు.
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్‌గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
గ్లాస్ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
