ఏనుగు ‘షాపింగ్’ బిల్లు’ను చెల్లించిన వన్యప్రాణి సంరక్షణ కేంద్రం వీడియో
థాయ్‌లాండ్‌లో ఒక అడవి ఏనుగు అమాంతం సూపర్ మార్కెట్లోకి దూసుకొచ్చి ఎలాంటి బీభత్సం సృష్టించకుండా తనకేం కావాలో అవి మాత్రమే తినేసి నెమ్మదిగా అక్కడినుంచి వెళ్ళిపోయింది. నఖోన్ రాట్చసిమా ప్రావిన్స్‌లో ఈ ఘటన జరిగింది. ఈ దృశ్యాలు అక్కడి సిసిటివి కెమెరాలలో రికార్డయ్యాయి. దుకాణం ఉన్న ప్రాంతం ఖనో జాతీయ పార్క్‌కు దగ్గర్లో ఉంది. ఈ నేషనల్ పార్క్‌లో అడవి ఏనుగులు ఎక్కువ.
వాటిలో కొన్ని అడవినుంచి బయటకు వచ్చి తిరుగుతుంటాయి. అలా తిరిగే ఏనుగుల్లో 27 ఏళ్ల మగ ఏనుగు బియాంగ్ లేక్ కూడా ఒకటి. ఈ ఏనుగు తరచూ అదే ప్రాంతంలో సంచరిస్తున్న ఎవరికీ ఎప్పుడూ ఎలాంటి హాని తలపెట్టలేదు. అయితే జూన్ రెండో తేదీన ఈ ఏనుగు హఠాత్తుగా ఒక మహిళకు చెందిన ఒక సూపర్ మార్కెట్లోకి దూరింది. అప్పుడు అక్కడే కౌంటర్ వద్ద ఉన్న మహిళా యజమాని ఒక్కసారిగా భయపడిపోయి అరిచి దుకాణం లోపలికి పారిపోయింది. సాధారణంగా అడవి మదపు ఏనుగులు పట్టరాని ఆవేశంతో ఉంటాయి. సమీప ప్రాంతాలను నాశనం చేస్తాయి. కానీ బియాంగ్ లేక్ ఏనుగు మాత్రం ఎంతో ప్రశాంతంగా కనిపించింది. కేవలం అక్కడున్న మిఠాయిలను మాత్రమే తినాలని నిర్ణయించింది.
వైరల్ వీడియోలు

వర్క్ ఫ్రం హోమ్ అంటే ఆశపడ్డ మహిళ.. కట్ చేస్తే..

‘దగ్గరికొస్తే దూకి చస్తా’.. పోలీసులకు నేరస్తుడి వార్నింగ్

సెకండ్ హ్యాండ్ సైకిల్ పైన వీధి కుక్క తో 15 రాష్ట్రాల యాత్ర

మనవళ్లే.. ఆ రైతన్నకు కాడెద్దులు వైరల్ వీడియో

ఫోన్ చూసీ.. చూసీ.. చివరికి ఒక వ్యక్తికి ఏమైందో తెలుసా?వీడియో

ఇదేంటి భయ్యా.. తాగకుండానే పాజిటివ్ వీడియో

తన భర్త మరో మహిళను చూడగానే ఆడ గొరిల్లా ఏం చేసిందంటే?వీడియో
