Viral Video: అరేయ్ ఎవర్రా మీరంతా.. ఏకంగా ట్రైన్ టాయిలెట్‌లోనే బెడ్ వేసుకుని.. వీడియో వైరల్..
దేశంలో రైలు రద్దీ ఎలా ఉంటుందో చెప్పడానికి ఈ వీడియోనే సాక్ష్యం.. సీటు దొరక్క ఓ వ్యక్తి ఏకంగా రైలు టాయిలెట్‌నే తన ప్రైవేట్ బెడ్‌రూమ్‌గా మార్చేశాడు. లోపల లగేజీపై హాయిగా పడుకుని, కిటికీలోంచి మడత మంచాన్ని పట్టుకోవడం చూసి నెటిజన్లు ఆశ్చర్యపోయారు. ఇది చూసినోళ్లు నవ్వు ఆపుకోలేక ట్రైన్ టాయిలెట్ జుగాడ్ అంటే ఇదే అని కామెంట్లు పెడుతున్నారు.

దేశంలో ఎక్కువగా రద్దీ ఉండేది అంటే టక్కున గుర్తొచ్చేది రైలు. ఇక పండగల సమయంలో ఆ రద్దీ గురించి చెప్పాల్సిన పని లేదు. నెలల ముందే టికెట్లు బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. రద్దీ సమయాల్లో రైలులో సీట్ల కోసం కొంతమంది పడరాని పాట్లు పడుతుంటారు. రైలులో సీటు లేక ఓ వ్యక్తి ఏకంగా టాయిలెట్‌నే తన బెడ్‌రూమ్‌గా మార్చుకున్నాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
రైలు కిటికీ పక్కన ఉన్న టాయిలెట్‌లో ఒక వ్యక్తి తన లగేజీపై పడుకుని కనిపించాడు. రైలు కిటికీలోంచి ఒక మడతపెట్టిన మంచాన్ని కూడా పట్టుకుని ఉన్నాడు. ప్లాట్‌ఫామ్‌పై ఉన్న ఓ వ్యక్తి దీనిని వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టాడు. ‘‘అన్నయ్య వాష్‌రూమ్‌ను బెడ్‌రూమ్‌గా మార్చేశాడు’’ అని విశాల్ ఆశ్చర్యపోయాడు. “ఇదంతా మీ ఇంటి సామానేనా?” అని అడగగా.. ఆ వ్యక్తి నవ్వుతూ అవును అని సమాధానం ఇచ్చాడు.
క్రియేటివ్ ఐడియా
ఈ వీడియో ఆరు లక్షలకు పైగా వ్యూస్‌తో వైరల్ అయ్యింది. కొంతమంది.. ఈ ఆలోచన చాలా క్రియేటివ్‌గా ఉందని ఫన్నీ కామెంట్స్ చేశారు. మరికొందరు.. ఇలా చేయడం పబ్లిక్ స్థలాన్ని పాడుచేయడమే అని, రైల్వే అధికారులు చర్య తీసుకోవాలని ఆందోళన వ్యక్తం చేశారు. ఇంకొందరు మాత్రం.. రద్దీ ఎక్కువగా ఉన్నప్పుడు ప్రయాణికులు పడే కష్టాలను ఈ ఘటన చూపిస్తోందని కామెంట్స్ చేశారు.
View this post on Instagram
