Pakistani Woman Arrested:హైదరాబాదీ ప్రేమికుడి కోసం సరిహద్దు దాటబోయిన పాకిస్థాన్‌ మహిళ అరెస్ట్..

అయితే, అహ్మద్‌ కోసం హైదరాబాద్ రావాలనుకుంది నూర్.. ఆమె కోసం అన్నీ ఏర్పాట్లు చేశాడు అహ్మద్‌..అందుకోసం దుబాయ్‭లో ఉండే తన నేపాల్ ఫ్రెండ్ సహాయం తీసుకున్నాడు.

Pakistani Woman Arrested:హైదరాబాదీ ప్రేమికుడి కోసం సరిహద్దు దాటబోయిన పాకిస్థాన్‌ మహిళ అరెస్ట్..
Untitled 1
Follow us
Jyothi Gadda

|

Updated on: Aug 10, 2022 | 7:21 PM

Pakistani Woman Arrested: ఎళ్లలు దాటుతున్న ప్రేమ.. దేశ సరిహద్దులు దాటి గెలిచిన సంఘటనలు ఇటీవలి కాలంలో అనేకం చూస్తున్నాం..కానీ, ఇక్కడో ప్రేమ కథకు బార్డర్‌ పోలీసులు చెక్‌ చెప్పారు. భారతదేశంలో ఉన్న ప్రియుడిని కలుసుకునేందుకు.. సరిహద్దు దాటబోయిన ఓ యువతిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆమెకు సహకరించిన మరో ఇద్దరిని కూడా అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుండి నకిలీ ఆధార్‌ కార్డులు సహా మరికొన్ని నకిలీ పత్రాలను సీజ్‌ చేశారు. పూర్తి వివరాల్లోకి వెళితే..

కలిసా నూర్ అనే పాకిస్తానీ యువతి ఫైసలాబాద్ నివాసి. హైదరాబాద్‭కు చెందిన అహ్మద్‭తో ప్రేమలో పడింది. అహ్మద్ గల్ఫ్‭లో ఒక హోటల్‭లో పని చేస్తున్నాడు. అయితే, అహ్మద్‌ కోసం హైదరాబాద్ రావాలనుకుంది నూర్.. ఆమె కోసం అన్నీ ఏర్పాట్లు చేశాడు అహ్మద్‌..అందుకోసం దుబాయ్‭లో ఉండే తన నేపాల్ ఫ్రెండ్ జీవన్ సహాయం తీసుకున్నాడు. అతడితో పాటు అతడి సోదరుడు మహమూద్ ఆమెకు తోడుగా ఉన్నారు. నూర్‭ను ముందుగా నేపాల్ తీసుకువచ్చి అక్కడి నుంచి భారత్‭లోకి ప్రవేశించేలా ప్లాన్ వేశారు. నకీలీ ఆధార్, సర్టిఫికెట్లు తయారు చేయించారు. ముగ్గురు కలిసి ఇండియాలోకి ప్రవేశిస్తుండగా భద్రతా దళాలు వారిని అడ్డుకుని విచారించగా అసలు విషయం బట్టబయలైంది.

వారి వద్దనున్న సర్టిఫికెట్లు తీసి పరిశీలించగా అవన్నీ నకిలీవని తేలింది. వెంటనే ఆ ముగ్గురిని సరిహద్దు భద్రతా సంస్థ అదుపులోకి తీసుకుని ఆపై పోలీసులకు అప్పగించారు. అనంతరం ముగ్గురిని స్థానిక మేజిస్ట్రేట్‌ ఎదుట హాజరుపరిచారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నూర్, అహ్మద్‌లు ఆన్‌లైన్‌లో పరిచయమై ప్రేమించుకున్నారు. ప్రేమ కోసమే నూర్‌ హైదరాబాద్‌ వచ్చేందుకు ప్రయత్నించిందని వెల్లడించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి