571కి చేరిన ఏలూరు వింత వ్యాధిగ్రస్తుల సంఖ్య, బలహీనపడుతున్న వ్యాధి, పది నిమిషాలకు ఒక కేసు నుంచి గంటకో కేసు

ఏలూరు నగరంతో పాటు సమీపంలోని గ్రామాలను కలవరపరుస్తున్న వింత వ్యాధి వ్యాధి బలహీన పడుతోంది. క్రమంగా రోగుల సంఖ్య తగ్గుతోంది. వింత వ్యాదిగ్రస్తుల సంఖ్య ప్రస్తుతం 571కి చేరింది. మొత్తం 468 మంది డిఛార్జ్ కాగా ఇంకా 72 మందికి చికిత్స అందుతోంది.

571కి చేరిన ఏలూరు వింత వ్యాధిగ్రస్తుల సంఖ్య, బలహీనపడుతున్న వ్యాధి,  పది నిమిషాలకు ఒక కేసు నుంచి గంటకో కేసు
Follow us

|

Updated on: Dec 09, 2020 | 7:08 AM

Eluru disease: ఏలూరు నగరంతో పాటు సమీపంలోని గ్రామాలను కలవరపరుస్తున్న వింత వ్యాధి వ్యాధి బలహీన పడుతోంది. క్రమంగా రోగుల సంఖ్య తగ్గుతోంది. వింత వ్యాదిగ్రస్తుల సంఖ్య ప్రస్తుతం 571కి చేరింది. మొత్తం 468 మంది డిఛార్జ్ కాగా ఇంకా 72 మందికి చికిత్స అందుతోంది. రోగుల్లో 1 నుంచి 12 సంవత్సరాల మధ్య వారు 75 మంది ఉన్నారు. ఇందులో బాలురు 45, బాలికలు 30 మంది ఉన్నారు. 12 నుంచి 35 ఏళ్ల మధ్యవారు 311 మంది ఉన్నారు. ఇందులో పురుషులు 153మంది, మహిళలు 158 మంది ఉన్నారు. 35 ఏళ్లకు పైబడిన వారు మొత్తం 185 మంది ఉన్నారు. ఇందులో పురుషులు 101, మహిళలు 84 మంది ఉన్నారు.

విజయవాడ, గుంటూరు ఆసుపత్రులకు 30 మందిని తరలించారు. ఎయిమ్స్ బృందం రోగులను నుంచి శాంపిల్స్ సేకరించింది. కూరగాయల్లో రసాయనాలు, పాల కల్తీయే కారణమని ఎయిమ్స్ నిపుణుల అంచనాకు వచ్చారు. రోగుల వెన్నుపూస నుంచి తీసిన నమూనాలపై చేసిన కల్చర్ పరీక్షల ఫలితాల్లోనే నెగిటివ్ వచ్చింది. బాధితుల శరీరాల నుంచి తీసిన శాంపిల్స్ లో నికెల్ , సీసం అవశేషాలు అధికంగా ఉన్నట్లు నిర్ధారణ అయింది. పాలు , నీరు తదుపరి పరీక్షల కోసం ఢిల్లీ ఎయిమ్స్ కు శాంపిల్స్ ను అధికారులు పంపించారు. పది నిమిషాలకు ఒక కేసు వచ్చే దగ్గరి నుంచి గంటకో కేసు వస్తోంది. దీంతో అధికార యంత్రాంగం ఊపిరి పీల్చుకుంటోంది. ఏలూరులో ని అన్ని సచివాలయాల వద్ద మెడికల్ క్యాంపు లు ఏర్పాటు చేశారు. నిన్న రాత్రంతా కేవలం 6 కేసులు మాత్రమే నమోదయ్యాయి.

ఈ వింత వ్యాధిని నిర్ధారించేందుకు ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రతినిధులు కూడా రంగంలో దిగారు. జాతీయ స్థాయి నిపుణులు కూడా ఏలూరు వస్తున్నారు. వివిధ ప్రాంతాల నుంచి వైద్యరంగానికి చెందిన పరిశోధకులు ఏలూరులో అంతుచిక్కని సమస్యకి అసలు కారణాలు కనుగొనే ప్రయత్నంలో ఉన్నారు. ఇప్పటికే ఢిల్లీ ఎయిమ్స్‌కి పంపించిన శాంపిళ్ల ద్వారా ప్రాథమిక నివేదిక బయటికి వచ్చింది. పేషెంట్ల బ్లడ్ శాంపిల్స్‌లో ఎక్కువగా సీసం (లెడ్), నికెల్ ఉన్నట్లు తేలిన విషయం తెలిసిందే.

దిన ఫలాలు (ఏప్రిల్ 24, 2024): 12 రాశుల వారికి ఇలా..
దిన ఫలాలు (ఏప్రిల్ 24, 2024): 12 రాశుల వారికి ఇలా..
మహిళలకు అదిరిపోయే గుడ్‌న్యూస్‌.. భారీగా తగ్గిన బంగారం ధర.. ఎంతంటే
మహిళలకు అదిరిపోయే గుడ్‌న్యూస్‌.. భారీగా తగ్గిన బంగారం ధర.. ఎంతంటే
ఇక ఓటీపీతో మోసాలకు పాల్పడేవారికి చెక్‌..ప్రభుత్వం కొత్త టెక్నాలజీ
ఇక ఓటీపీతో మోసాలకు పాల్పడేవారికి చెక్‌..ప్రభుత్వం కొత్త టెక్నాలజీ
మార్కస్ స్టొయినిస్ సూపర్ సెంచరీ.. చెన్నైపై లక్నో సంచలన విజయం
మార్కస్ స్టొయినిస్ సూపర్ సెంచరీ.. చెన్నైపై లక్నో సంచలన విజయం
ఈ స్టార్ హీరోయిన్లు ఇండియాలో ఓటు వేయలేరు.. లిస్టులో అలియా కూడా..
ఈ స్టార్ హీరోయిన్లు ఇండియాలో ఓటు వేయలేరు.. లిస్టులో అలియా కూడా..
మీరు కొన్నది నిజమైనా వెండినా లేక కల్తీనా? ఇలా చెక్ చేసుకోండి!
మీరు కొన్నది నిజమైనా వెండినా లేక కల్తీనా? ఇలా చెక్ చేసుకోండి!
SRH కెప్టెన్‌ కమిన్స్‌ను కలిసిన మహేశ్ సతీమణి నమ్రత.. ఫొటోస్
SRH కెప్టెన్‌ కమిన్స్‌ను కలిసిన మహేశ్ సతీమణి నమ్రత.. ఫొటోస్
ఈ పైనాపిల్స్ మధ్య మూడు మొక్కజొన్నలు నక్కాయి.. కనిపెట్టండి చూద్దాం
ఈ పైనాపిల్స్ మధ్య మూడు మొక్కజొన్నలు నక్కాయి.. కనిపెట్టండి చూద్దాం
ఈసీ సంచలన నిర్ణయం.. ఇద్దరు ఐపీఎస్ అధికారులపై బదిలీ వేటు..కారణమిదే
ఈసీ సంచలన నిర్ణయం.. ఇద్దరు ఐపీఎస్ అధికారులపై బదిలీ వేటు..కారణమిదే
కాలేజీ స్టూడెంట్‏ను చూసి తొలిచూపులోనే ప్రేమ, పెళ్లి..
కాలేజీ స్టూడెంట్‏ను చూసి తొలిచూపులోనే ప్రేమ, పెళ్లి..