AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Watch: ఇతనో బాహుబలి..! ఒకే బైక్‌పై డజన్‌ మందిని తీసుకెళ్తూ రోడ్డుపై హల్‌చల్‌…

సోషల్ మీడియా ప్రపంచంలో ఎప్పుడూ ఏదో ఒకటి వైరల్ అవుతూనే ఉంటుంది. ఇక్కడ చాలా వీడియోలు వైరల్ అవుతాయి. అవి మన ఊహకు అందవు. బెట్టింగ్స్‌, స్టంట్స్‌, ప్రమాదాలు, వివిధ విన్యాసాలకు సంబంధించిన అనేక వీడియోలు సోషల్ మీడియాలో షేర్ చేయబడతాయి. ఇవి వినియోగదారుల దృష్టిని ఎక్కువగా ఆకర్షిస్తాయి. ఇప్పుడు అలాంటి ఒక ఆకర్షణీయమైన వీడియో నెట్టింట వేగంగా చక్కర్లు కొడుతోంది.. వీడియోలో ఒక బైకర్ బహుబలి రేంజల్‌లో బైక్‌ నడుపుతున్నాడు.. ఎలాగంటే.. ఒకరు కాదు, ఇద్దరు కాదు ఏకంగా డజన్ల కొద్దీ మంది తన బైక్‌పై ఎక్కించాడు. ఈ ఫీట్‌ను చూసి రోడ్డుపై ఉన్న ప్రతి ఒక్కరూ ఆశ్చర్యపోయారు.

Watch: ఇతనో బాహుబలి..! ఒకే బైక్‌పై డజన్‌ మందిని తీసుకెళ్తూ రోడ్డుపై హల్‌చల్‌...
Dozen Children
Jyothi Gadda
|

Updated on: Aug 20, 2025 | 11:28 AM

Share

సోషల్ మీడియా ప్రపంచంలో ఎప్పుడూ ఏదో ఒకటి వైరల్ అవుతూనే ఉంటుంది. ఇక్కడ చాలా వీడియోలు వైరల్ అవుతాయి. అవి మన ఊహకు అందవు. బెట్టింగ్స్‌, స్టంట్స్‌, ప్రమాదాలు, వివిధ విన్యాసాలకు సంబంధించిన అనేక వీడియోలు సోషల్ మీడియాలో షేర్ చేయబడతాయి. ఇవి వినియోగదారుల దృష్టిని ఎక్కువగా ఆకర్షిస్తాయి. ఇప్పుడు అలాంటి ఒక ఆకర్షణీయమైన వీడియో నెట్టింట వేగంగా చక్కర్లు కొడుతోంది.. వీడియోలో ఒక బైకర్ బహుబలి రేంజల్‌లో బైక్‌ నడుపుతున్నాడు.. ఎలాగంటే.. ఒకరు కాదు, ఇద్దరు కాదు ఏకంగా డజన్ల కొద్దీ మంది తన బైక్‌పై ఎక్కించాడు. ఈ ఫీట్‌ను చూసి రోడ్డుపై ఉన్న ప్రతి ఒక్కరూ ఆశ్చర్యపోయారు.

వైరల్ వీడియోలో ఒక వ్యక్తి రిక్షాలో కూర్చుని రోడ్డుపై కొన్ని అద్భుతమైన దృశ్యాలను తన కెమెరాలో బంధించడం కనిపిస్తుంది. ఆ మరు క్షణంలో మనం అతని పక్కనే ఒక ప్రత్యేకమైన బైక్ వెళ్లటం కనిపిస్తుంది. ఈ బైక్ ప్రత్యేకమైనది ఎందుకంటే..ఆ బైక్‌లో ఇద్దరు లేదా ముగ్గురు వ్యక్తులు కాదు, డజనుకు పైగా ఉన్నారు. వీడియోలో, బైక్ రైడర్ అతని వెనుక ఇద్దరు మహిళలు, వారి వెనుక ఒక చిన్న కారు చూడవచ్చు. అందులో కనీసం అర డజను మంది పిల్లలు కూర్చుని ఉన్నారు.. ఆ వ్యక్తి ఈ దేశీ జుగాడ్‌ ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షించింది.

ఇవి కూడా చదవండి

వీడియో ఇక్కడ చూడండి..

ఈ వైరల్ వీడియోను @usphira166492 అనే ఇన్‌స్టాగ్రామ్ ఖాతా షేర్ చేసింది. ఈ వీడియోను ఇప్పటివరకు మిలియన్ల మంది వీక్షించారు. వేలాది మంది వినియోగదారులు వీడియోపై వ్యాఖ్యానించారు. కొంతమంది ఈ జుగాడ్‌ను ప్రశంసిస్తున్నారు. మరికొందరు వారి భద్రత పట్ల ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ వీడియో ఎక్కడ నుండి వచ్చిందో ఇంకా స్పష్టంగా తెలియకపోయినా, భారతదేశంలో జుగాడ్ ప్రజల కొరత లేదని ఈ వీడియో మరోసారి చూపిస్తుంది.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..