Viral: అసలుసిసలు జాతిరత్నం మనోడే.. బోర్డు పరీక్షల్లో పాస్ చేయాలంటూ ఏకంగా ఆన్సర్ షీట్లకు..  

12వ తరగతి (సైన్స్) విద్యార్థి 500 రూపాయల నోటును ఆన్సర్ షీట్‌కు అతికించి.. తనను పాస్ చేయాలని కోరినట్లు అధికారులు తెలిపారు. ఈ వింత ఘటన గుజరాత్‌లో చోటుచేసుకుంది.

Viral: అసలుసిసలు జాతిరత్నం మనోడే.. బోర్డు పరీక్షల్లో పాస్ చేయాలంటూ ఏకంగా ఆన్సర్ షీట్లకు..  
Viral News
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Aug 12, 2022 | 12:59 PM

12th Class student: పరీక్షల్లో పాస్ అయ్యేందుకు విద్యార్థులు నానా తంటాలు పడుతుంటారు. కొందరు రాత్రి పగలు అనే తేడా లేకుండా చదివి ఫస్ట్ క్లాస్‌లో పాసవుతారు. ఇంకా సరిగా చదవలేని వారు కొంతమంది కాపీ కొట్టి పాస్ అవుతారు.. మరికొందరు ఏవేవో పిచ్చి పనులు చేస్తుంటారు. కానీ, ఇవన్నీ మనకెందుకులే  అనుకున్నాడో ఏమో.. ఓ విద్యార్థి ఏకంగా జవాబు పత్రానికి రూ.500 నోటు అతికించి పాస్ చేయాలంటూ ప్రాథేయపడ్డాడు. తీరా, విద్యార్థి ప్రయత్నం విఫలం కావడంతో.. ఏడాదిపాటు పరీక్షలు రాయకుండా అధికారులు డిబార్ చేశారు. అంతేకాకుండా ప్రస్తుత పరీక్షల్లో ఫెయిల్ చేశారు. 12వ తరగతి (సైన్స్) విద్యార్థి 500 రూపాయల నోటును ఆన్సర్ షీట్‌కు అతికించి.. తనను పాస్ చేయాలని కోరినట్లు అధికారులు తెలిపారు. ఈ వింత ఘటన గుజరాత్‌లో చోటుచేసుకుంది. సాధారణంగా యూనివర్శిటీ పరీక్షల్లో విద్యార్థులు పరీక్ష పాస్ అయ్యేందుకు డబ్బులు ఇస్తుంటారన్న ఘటనలు నివేదించబడినప్పటికీ.. పాఠశాల విద్యార్థులలో ఇలాంటి ప్రయత్నాలు చేయడం చాలా అరుదని, ఇది విస్మయానికి గురిచేసిందని గుజరాత్ బోర్డు ఉన్నతాధికారులు తెలిపారు.

సెంట్రల్ గుజరాత్‌కు చెందిన ఈ 12వ తరగతి (సైన్స్) విద్యార్థి బోర్డు పరీక్షల్లో “దయచేసి పాస్ చేయండి” అంటూ ఎగ్జామినర్‌ని అభ్యర్థిస్తూ పేపర్‌పై రూ.500 నోటును అతికించాడని అధికారులు తెలిపారు. ఈ సంవత్సరం బోర్టు పరీక్షలు ముగియడంతో ప్రస్తుతం ముల్యంకనం కొనసాగుతోంది. అయితే.. జవాబు పత్రాల మూల్యాంకన సమయంలో ఉపాధ్యాయులు ఫిజిక్స్, కెమిస్ట్రీ పేపర్లలో కరెన్సీని గుర్తించి అధికారులకు ఫిర్యాదు చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. అయితే.. విద్యార్థి అన్ని పేపర్లలో ఫెయిల్ అయినట్లు అధికారులు తెలిపారు. దీనిపై గుజరాత్ సెకండరీ ఎడ్యుకేషన్ బోర్డ్ పరీక్షా సంస్కరణల కమిటీని వివరణ కూడా కోరింది.

అయితే.. డబ్బులు దొరకడంతో విద్యార్థిని అధికారులు ప్రశ్నించారు. బోర్డు పరీక్షల్లో పాస్ అవుతానన్న నమ్మకం లేదని.. దీంతో జవాబు పత్రంలో డబ్బును ఉంచితే, (లంచం ఇస్తే) ఉత్తీర్ణత సాధించే అవకాశం ఉందని పుకార్లు విన్నానని బాలుడు ఒప్పుకున్నాడు. అయితే.. అలా చేయడం తనకు తెలియదని అతను చెప్పాడు. విద్యార్థి మధ్యతరగతి కుటుంబానికి చెందినవాడని.. అతని తల్లిదండ్రులు ట్యూషన్‌కు కూడా పంపారని.. అయినా పరీక్షలకు సరిగ్గా సిద్ధం కాలేకపోయాడని అధికారులు తెలిపారు. అయితే, ఈ రెండు సబ్జెక్టులలో 27 నుంచి 29 మార్కులు వచ్చాయని.. ఇలా చేయకపోతే కనీస మార్కులతో పాస్ అయ్యేవాడని అధికారులు పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి

ఇది కూడా చదవండి.. 

Airtel 5G: టెక్నాలజీలో సరికొత్త విప్లవానికి సిద్ధమైన ఎయిర్‌టెల్‌.. మారనున్న పలు రంగాల రూపు రేఖలు..

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..