Viral: 100కిపైగా మేకపోతులతో నాన్‌వెజ్‌ వంటకాలు.. తిన్నోళ్లకు తిన్నంత.. ఆడవాళ్లకు నో ఎంట్రీ.!

అదో నాన్‌వెజ్‌ జాతర.. తిన్నోళ్లకు తిన్నంత.. కేవలం నాన్‌వెజ్‌ వంటకాలతో ‌ఫెస్టివల్‌.. అది కేవలం పురుషులకే..ఆడవాళ్లకు మాత్రం నో ఎంట్రీ.. ఇంతకీ ఈ ఫెస్టివల్‌ ఎక్కడో తెలుసా? వివరాల్లోకెళ్తే.. తమిళనాడులోని మధురై జిల్లా తిరుమంగళంలో ఉన్న కరుప్పారై ముత్తయ్య ఆలయంలో నిర్వహించే.. ఆ వివరాలు..

Viral: 100కిపైగా మేకపోతులతో నాన్‌వెజ్‌ వంటకాలు.. తిన్నోళ్లకు తిన్నంత.. ఆడవాళ్లకు నో ఎంట్రీ.!
Non Veg Festival
Follow us
Ravi Kiran

|

Updated on: May 19, 2024 | 10:42 AM

అదో నాన్‌వెజ్‌ జాతర.. తిన్నోళ్లకు తిన్నంత.. కేవలం నాన్‌వెజ్‌ వంటకాలతో ‌ఫెస్టివల్‌.. అది కేవలం పురుషులకే..ఆడవాళ్లకు మాత్రం నో ఎంట్రీ.. ఇంతకీ ఈ ఫెస్టివల్‌ ఎక్కడో తెలుసా? వివరాల్లోకెళ్తే.. తమిళనాడులోని మధురై జిల్లా తిరుమంగళంలో ఉన్న కరుప్పారై ముత్తయ్య ఆలయంలో నిర్వహించే, ఓ జాతర ఇప్పుడు టాక్‌ ఆఫ్‌ ది టౌన్‌గా నిలిచింది. ప్రతి ఏడాది ఎంతో గ్రాండ్‌‌గా జరిగే ఈ జాతరకు ఓ ప్రత్యేకత ఉంది. ఈ జాతరను కిడా విరుందు జాతర అని పిలుస్తుంటారు. కిడా విరుందు అంటే మాంసాహార జాతర అని అర్థం.. ఈ జాతారకు పురుషులు పెద్ద ఎత్తున తరలివస్తారు. ప్రతి సంవత్సరం మార్గళిమాసంలో ఉత్సవాలు జరుగుతాయి. ప్రతి ఒక్కరు తమ మొక్కులు చెల్లించడానికి ఒక్కో మేక పోతులను సంవత్సరం పాటు పెంచుతారు. ఉత్సవాల సమయంలో స్వామి వారికి మొక్కుకున్న మేకపోతులతో నాన్ వెజ్ విందు ఏర్పాటు చేస్తారు. ఈ నాన్ వెజ్ విందులో పురుషులు మాత్రమే పాల్గొంటారు. 100కు పైగా మేక పోతులని స్వామి వారికి నైవేద్యంగా సమర్పిస్తారు. ఇక్కడ ఎవరు ఎంత తింటారో అంత వడ్డిస్తారు.

అయితే ఈ జాతరకు కానీ, ఆలయంలోకి కానీ స్త్రీలకు మాత్రం ప్రవేశం ఉందదు..ఆలయంలో ఉన్న స్వామివారిని దర్శించుకోవాలంటే మహిళలు ఒక నిబంధన పాటించాలి.. నాన్ వెజ్ విందు పూర్తి ఆయన తరువాత పురుషులు ఇస్తరులు తీయకుండా అక్కడనుండి వెళ్లిపోతారు. అవి పూర్తిగా ఎండిపోయే వరకు స్త్రీలు పరిసర ప్రాంతాలకు వెళ్లకూడదు.. ఇస్తరులు పూర్తి గా ఎండిపోయి కనుమరుగైన తరువాత మాత్రమే స్త్రీలకు ఆలయ ప్రవేశం ఉంటుంది.

Also Read: పైకి చూస్తే అదొక గుడిసె.. కానీ లోపలకెళ్లి చూడగా మతిపోవాల్సిందే.!

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం..