ఓరేయ్.. మీకేం పోయేకాలంరా..! పండుగ వేళ ఇలా పరిహాసాలకు తెగబడ్డారు..నాగుపాము ముందు కేక్‌పెట్టి…
వైరల్ వీడియోలో, కొంతమంది యువకులు నాగుపాము ముందు కేక్ పెట్టి నాగ పంచమిని జరుపుకుంటున్న దృశ్యం కనిపిస్తుంది. పాముకు పాటలు పాడుతూ..జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ, మన సంప్రదాయాలను, ఆచారాలను భయం, భక్తి లేకుండా ఎగతాళి చేస్తున్నారు.
ప్రాచీన మతమైన హిందూమతంలో వ్రతాలు, పండుగలకు విశేష ప్రాధాన్యం ఉంది. ప్రతి పండుగకు దాని ప్రత్యేక ఆచారాలు ఉన్నాయి. ఈ పండుగలలో నాగ పంచమి ఒకటి. శ్రావణ మాసంలోని శుక్ష పక్ష పంచమి తిథి నాడు జరుపుకునే నాగ పంచమిని భక్తిశ్రద్ధలతో జరుపుకుంటారు. ఈ రోజు నాగుపాము పుట్టల వద్దకు వెళ్లి ప్రజలు భక్తిశ్రద్ధలతో పూజిస్తారు. కానీ, కొందరు యువకులు మాత్రం భయం, భక్తి లేకుండా, సంప్రదాయ ఆచారాలకు ఏ మాత్రం విలువ ఇవ్వకుండా నాగరాజు ముందు కేకులు పెట్టి నాగపంచమి జరుపుకున్నారు. అందుకు అనుగుణంగా పాటలు కూడా పాడుతున్నారు. ఈ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. యువకులు చేసిన ఈ విపరీత వైఖరికి పట్ల నెటిజన్లలో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది.
వైరల్ వీడియోలో, కొంతమంది యువకులు నాగుపాము ముందు కేక్ పెట్టి నాగ పంచమిని జరుపుకుంటున్న దృశ్యం కనిపిస్తుంది. పాముకు పాటలు పాడుతూ..జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ, మన సంప్రదాయాలను, ఆచారాలను భయం, భక్తి లేకుండా ఎగతాళి చేస్తున్నారు.
ఒక రోజు క్రితం షేర్ చేయబడిన ఈ వీడియో 1.9 మిలియన్లకు పైగా వ్యూస్‌తో వైరల్‌గా మారిరంరది. వీడియో చూసిన ప్రతి ఒక్కరూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. యువకులు చేసిన ఎగతాళి పనిని తీవ్రంగా ఖండిస్తూ ఘాటుగా విమర్శిస్తున్నారు.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..