AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఈ ఆకుకూర రోజూ తింటే వ్యాధులన్నీ పరార్‌..! ఎన్ని రకాల ప్రయోజనాలో తెలుసా?

దీనివల్ల బరువు కూడా తగ్గే అవకాశం ఉంది. జుట్టు ఒత్తుగా పెరుగుతుంది. గోంగూరలో విటమిన్ సి అధికంగా ఉంటుంది. మనకు రోజూవారీగా కావాల్సిన విటమిన్ సిలో 53 శాతం గోంగూరలో ఉంటుంది. ఇది రోగనిరోధక శక్తిని పెంచుతుంది. దగ్గు, ఆయాసం, తుమ్ములతో బాధపడేవారికి గోంగూర ఉపశమనం కలిగిస్తుంది. ఈ సమస్యతో బాధపడేవారు గోంగూర తినడం వల్ల ఫలితం ఉంటుంది.

ఈ ఆకుకూర రోజూ తింటే వ్యాధులన్నీ పరార్‌..! ఎన్ని రకాల ప్రయోజనాలో తెలుసా?
Gongura
Jyothi Gadda
|

Updated on: Aug 09, 2024 | 9:51 PM

Share

ఆకు కూర‌లు మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయ‌ని నిపుణులు పదే పదే చెబుతున్నారు. అలాంటి ఆకుకూర‌ల్లో గోంగూర కూడా ఒకటి. దీనినే పుంటికూర అని కూడా అంటారు. గోంగూర‌తో ప‌చ్చడి, ప‌ప్పు, పులిహోర‌ను, గోంగూర చికెన్‌,గోంగూర మ‌ట‌న్, ఇలా రకరకాల వంటకాలు త‌యారు చేస్తారు. గోంగూర కేవలం రుచిలోనే కాదు..ఆరోగ్య పరంగా అనేక ప్రయోజనాలు కలిగి ఉందని మీకు తెలుసా..? తరచూ గోంగూర తింటే ఆరోగ్యానికి పుష్కలమైన ఉపయోగాలు ఉన్నాయంటున్నారు ఆరోగ్య నిపుణులు. అవేంటో ఇక్కడ తెలుసుకుందాం..

గోంగూరలో ఎన్నో ఔషధ గుణాలు ఉంటాయి. ఇవి నోటికి రుచిని అందించడంతో పాటు శరీరానికి అనేక పోషకాలను అందించి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. గోంగూర ఆకులను తీసుకుని వాటికి కొద్దిగా ఆముదం రాయాలి. ఆ ఆకులను వేడి చేసి వాపు, గడ్డలు, నొప్పులు ఉన్నచోట కట్టులా కట్టాలి. దీంతో నొప్పి, వాపు తగ్గుతుంది.

గోంగూరలో ఎ, బి1, బి2, బి9 విటమిన్లతో పాటు విటమిన్ సి కూడా ఉంటుంది. అంతేకాదు..గోంగూరలో క్యాల్షియం, ఫాస్ఫరస్, పొటాషియం, సోడియం, ఐరన్ వంటి ఇతర ఖనిజాలు కూడా ఉన్నాయి. అంతేకాకుండా యాంటీఆక్సిడెంట్స్ మరెన్నో పోషక పదార్థాలు ఉంటాయి. రేచీకటితో బాధపడేవారు గోంగూరను తింటే మంచి ఫలితం ఉంటుంది. గోంగూర పూలను దంచి అరకప్పు రసం చేసి దాన్ని వడకట్టి దానిలో అరకప్పు పాలు కలిపి ఉదయం, సాయంత్రం రెండుపూటలా తాగితే. కంటికి మంచి జరుగుతుంది.

ఇవి కూడా చదవండి

మిరపకాయలు వేయకుండా ఉప్పులో ఊరవేసిన గోంగూరతో అన్నం తిన్నా కూడా విరేచనాలకు చెక్ పెట్టవచ్చు. శ‌రీరంలో రోగ నిరోధ‌క శ‌క్తిని పెంచ‌డంలో, జీర్ణ శ‌క్తిని పెంచ‌డంలో గోంగూర ఎంతో స‌హాయ‌ప‌డుతుంది. ర‌క్త హీన‌త స‌మ‌స్యతో బాధ‌ప‌డే వారు గోంగూర‌ను ఆహారంలో భాగంగా తీసుకోవ‌డం వ‌ల్ల మంచి ఫ‌లితాల‌ను పొంద‌వ‌చ్చు. గోంగూర ఆకుల పేస్ట్‌ను తలకు పట్టించి కొంతసేపు అయ్యాక స్నానం చేయాలి. దీనివల్ల జుట్టు రాలడం, చుంద్రు సమస్య తగ్గుతుంది. గోంగూర నుంచి తీసిన జిగురును నీటిలో కలిపి తాగితే విరేచనాలు తగ్గుతాయి.

గోంగూరలో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి బాడీలో చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తాయి. దీనివల్ల బరువు కూడా తగ్గే అవకాశం ఉంది. జుట్టు ఒత్తుగా పెరుగుతుంది. గోంగూరలో విటమిన్ సి అధికంగా ఉంటుంది. మనకు రోజూవారీగా కావాల్సిన విటమిన్ సిలో 53 శాతం గోంగూరలో ఉంటుంది. ఇది రోగనిరోధక శక్తిని పెంచుతుంది. దగ్గు, ఆయాసం, తుమ్ములతో బాధపడేవారికి గోంగూర ఉపశమనం కలిగిస్తుంది. ఈ సమస్యతో బాధపడేవారు గోంగూర తినడం వల్ల ఫలితం ఉంటుంది.

(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు TV9 Telugu.com బాధ్యత వహించదు.)

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి..

Follow Us
2వ ట్రోఫీతో రికార్డుల దూల తీర్చిన ఆర్సీబీ.. లిస్ట్ చూస్తే షాకే..!
2వ ట్రోఫీతో రికార్డుల దూల తీర్చిన ఆర్సీబీ.. లిస్ట్ చూస్తే షాకే..!
పాములు నిజంగానే పగబడతాయా?.. మానవులను ఆశ్చర్య పరిచే..
పాములు నిజంగానే పగబడతాయా?.. మానవులను ఆశ్చర్య పరిచే..
10,000అడుగుల వాకింగ్ నిజంగా అవసరమేనా?ఆర్థోపెడిక్ నిపుణుల క్లారిటీ
10,000అడుగుల వాకింగ్ నిజంగా అవసరమేనా?ఆర్థోపెడిక్ నిపుణుల క్లారిటీ
బిగ్‌షాక్‌.. మరోసారి పెరిగిన గ్యాస్‌ సిలిండర్ ధర..ఎంత పెరిగిందంటే
బిగ్‌షాక్‌.. మరోసారి పెరిగిన గ్యాస్‌ సిలిండర్ ధర..ఎంత పెరిగిందంటే
నాడు బీసీసీఐ నిషేధం.. నేడు ఆర్సీబీ మ్యాచ్ విన్నర్ ఈ రసిఖ్ సలామ్
నాడు బీసీసీఐ నిషేధం.. నేడు ఆర్సీబీ మ్యాచ్ విన్నర్ ఈ రసిఖ్ సలామ్
మందులతో పనిలేదు.. రోజూ ఈ ఒక్క పని చేస్తే చాలు..
మందులతో పనిలేదు.. రోజూ ఈ ఒక్క పని చేస్తే చాలు..
తెలుగు రాష్ట్రాల్లో తులం బంగారం ధర ఎంతో తెలుసా..?
తెలుగు రాష్ట్రాల్లో తులం బంగారం ధర ఎంతో తెలుసా..?
ఏకంగా 6 అవార్డులతో దుమ్మురేపిన బుడ్డోడు.. పూర్తి జాబితా ఇదే..!
ఏకంగా 6 అవార్డులతో దుమ్మురేపిన బుడ్డోడు.. పూర్తి జాబితా ఇదే..!
విక్రమార్కుడు–బేతాళుడు కథ.. మీ తెలివి తేటలకు పదును బెట్టే ప్రశ్న
విక్రమార్కుడు–బేతాళుడు కథ.. మీ తెలివి తేటలకు పదును బెట్టే ప్రశ్న
జూన్ 1 రాశిఫలాలు: వారికి ఆకస్మిక ధనలాభం, కొత్త ఉద్యోగం..
జూన్ 1 రాశిఫలాలు: వారికి ఆకస్మిక ధనలాభం, కొత్త ఉద్యోగం..