AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral News: వాటెన్ ఐడియా.. ఎనిమిది నెలలకు సరిపడా వంట ఒకేసారి.. ఎలా చేసిందో తెలిస్తే షాక్..

ఇంట్లో ఉదయం వండిన ఫుడ్ సాయంత్రం తినాలంటేనే ముఖం అదోలా పెడతాం.. వేడి వేడిగా ఏ పూట వంట ఆపూట చేసి పెడితే ఫుల్ గా లాంగిచేస్తాం. ఇది ఇండియాలో పరిస్థితి. అదే అమెరికా, లండన్, కెనడాలో అయితే..

Viral News: వాటెన్ ఐడియా.. ఎనిమిది నెలలకు సరిపడా వంట ఒకేసారి.. ఎలా చేసిందో తెలిస్తే షాక్..
Kelsey
Amarnadh Daneti
|

Updated on: Aug 29, 2022 | 2:11 PM

Share

Viral News: ఇంట్లో ఉదయం వండిన ఫుడ్ సాయంత్రం తినాలంటేనే ముఖం అదోలా పెడతాం.. వేడి వేడిగా ఏ పూట వంట ఆపూట చేసి పెడితే ఫుల్ గా లాంగిచేస్తాం. ఇది ఇండియాలో పరిస్థితి. అదే అమెరికా, లండన్, కెనడాలో అయితే.. భార్య, భర్తలిద్దరూ ఉద్యోగాలు చేయాలి కాబట్టి.. రోజుకో సారి వండుకోవడం చూస్తుంటాం. కొంత మంది అయితే టిఫిన్స్ లాంటివి ఒక వారానికి సరపడా ఒకేసారి తయారు చేసుకోవడం మనం విన్నాం. వీకెండ్స్ లో తయారు చేసిన ఫుడ్ మళ్లీ వీకెండ్ వరకు వచ్చేలా కొంతమంది ప్లాన్ చేసుకుంటారు. కాని ఎనిమిది నెలలకు సరిపడా ఫుడ్ ఒకేసారి తయారైతే.. ఇది నమ్మేట్టు లేదుగా.. ఎనిమిది నెలల పాటు ఫుడ్ పాడవకుండా ఎలా ఉంటుంది.. ఇది ఇంపాజిబుల్ అని అనుకుంటున్నారా.. కాని ఇది నిజం.

ఆస్ట్రేలియాకు చెందిన కెల్సీషా అనే మహిళ.. తన కుటుంబంతో కలిసి అమెరికాలో స్థిరపడింది. ప్రతిరోజూ… తన కుటుంబ సభ్యులకు వంట చేసి పెట్టడమే ఆమెకు పెద్ద పని అయ్యేది. రోజంతా అదే సరిపోయేది. వేరే పని చేయడానికి సమయమే లేదు అన్నట్లుగా ఉండేది ఆమె పరిస్థితి. దీంతో ఆహారం నిల్వ చేసే పద్దతుల గురించి ఆలోచించడం మొదలుపెట్టింది. దీని కోసం ఆమె కాస్త ఎక్కువగానే కసరత్తు చేసింది. ప్రతిరోజూ రెండుగంటల పాటు సమయం కేటాయించి.. ఎక్స్ ర్ సైజ్ ప్రారంభించింది. దాదాపు 3 నెలల పాటు శ్రమించి 426 మీల్స్ సిద్ధం చేసింది కెల్సీషా.

ఈ ఆహారం వారికి 8 నెలల పాటు సరిపోయిందట. కరోనా సమయంలో ఎలాంటి ఇబ్బంది లేకుండా వీరు ఆ ఆహారాన్ని తీసుకున్నారని తాజాగా వెలుగులోకి వచ్చింది. డీ హైడ్రేషన్, వాటన్ క్యానింగ్ లాంటి వివిధ రకాల పద్దతుల్లో ఆమె ఈ ఆహారాన్ని నిల్వ చేసినట్లు వెల్లడించింది. ఇంటర్నెట్‌తోపాటు పుస్తకాల ద్వారా ఆమె సమాచాన్ని సేకరించింది. 2017లో తన కుటుంబంతో సహా అమెరికాలోని ఇండియానాకు వెళ్లినప్పుడు తన తల్లి ముందుగానే ఆహారాన్ని సిద్ధం చేయడం ప్రారంభించింది. దీన్ని గమనించిన కెల్సీషా ముందుగానే ఆహారాన్ని తయారుచేసుకుని.. నిల్వ చేసుకునే పద్ధతులపై దృష్టిపెట్టి.. 426 మీల్స్ ను తయారు చేసింది. ఈ విషయం తాజాగా వెలుగులోకి రావడంతో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కెల్సీషా ఐడియాకు నెటిజన్లు హ్యాట్సప్ అంటున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం చూడండి..