Watch video: రెస్టారెంట్ లో పనిచేసే అమ్మాయికి కారునే టిప్ గా ఇచ్చిన ప్రముఖ యూట్యూబర్..వీడియో వైరల్
మనకు నచ్చిన వాళ్లకు ఏదైన బహుమతులు ఇస్తే వారు చాలా సంతోషిస్తారు. అలాగే మనకు తెలియని వారికి కూడా ఏదైన బహుమతి ఇస్తే వారి ఆనందానికి అవధులు ఉండవు. తాజాగా ప్రముఖ అమెరికన్ యూట్యూబర్ కూడా అలాంటి పని చేసి అందరిని ఆశ్చర్యపరిచాడు.
మనకు నచ్చిన వాళ్లకు ఏదైన బహుమతులు ఇస్తే వారు చాలా సంతోషిస్తారు. అలాగే మనకు తెలియని వారికి కూడా ఏదైన బహుమతి ఇస్తే వారి ఆనందానికి అవధులు ఉండవు. తాజాగా ప్రముఖ అమెరికన్ యూట్యూబర్ కూడా అలాంటి పని చేసి అందరిని ఆశ్చర్యపరిచాడు. యూట్యూబ్ లో మిస్టర్ బీస్ట్ గా పేరు పొందిన జిమ్మీ డొనాల్డ్ సన్.. రెస్టారెంట్ లో వెయిట్రస్ గా పనిచేస్తున్న ఓ మహిళకు ఏకంగా ఓ బ్రాండ్ న్యూ కారును బహుమతిగా ఇచ్చాడు. యూట్యూబ్ లో ప్రస్తుతం 13.9 కోట్ల మంది సబ్ స్క్రైబర్లు ఉన్న మిస్టర్ బీస్ట్ ఈ వీడియోను తన ఇన్ స్టాగ్రాంలో షేర్ చేశాడు. అయితే ఈ వీడియోలో ఓ రెస్టారెంట్ కు వచ్చిన బీస్ట్..ఇప్పటివరకు అందుకున్న అత్యధిక టిప్ ఎంతని ఆ వెయిట్రస్ ని అడుగుతాడు. అప్పుడు ఆమె 50 డాలర్ల వరకూ ఉంటుందని చెబుతుంది.
ఇప్పటి వరకు ఎవరైనా టిప్ గా కారును ఇచ్చారా అని అడుగుతూ కారు తాళాలను ఆమె ఇస్తాడు. ఆమె ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఇది కేవలం కారు కీ అని..మీరు అబద్దం చెబుతున్నారని చెబుతుంది. అయితే అతను ఆ కారుని పార్క్ చేసిన చోటుకి తీసుకెళ్లి దాన్ని అప్పగిస్తాడు. ఆ కారుపై తన చాక్లెట్ కంపెని ఫీస్టేబుల్స్ లోగో కనిపిస్తుంది. ఊహించని విధంగా కారును బహుమతిగా అందుకోవడంతో ఆ వెయిట్రస్ భావోద్వేగానికి లోనవుతుంది. బీస్ట్ కి కృతజ్ఞతలు చెబుతుంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. నెటిజన్లు బీస్ట్ పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.
View this post on Instagram
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం..