Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: జంతువులకూ ప్రేమ కావాలి.. అందుకు సాక్ష్యం ఈ కోతి.. ప్రేమగా కోతి కౌగిలి.. నెట్టింట్లో వైరల్..

Viral Video: ప్రపంచంలో మనిషికే కాదు.. ప్రతి ఒక్క జీవికి కొంచెమైన ప్రేమ (Love )అవసరం. ఇది అనేక సార్లు కుక్క, పిల్లి, ఏనుగు, కోతి వంటి పలు జంతువులు తోటివారి పట్ల తమ ప్రేమని చూపిస్తూ.. నిరూపించాయి కూడా..

Viral Video: జంతువులకూ ప్రేమ కావాలి.. అందుకు సాక్ష్యం ఈ కోతి.. ప్రేమగా కోతి కౌగిలి.. నెట్టింట్లో వైరల్..
Monkey Love
Follow us
Surya Kala

|

Updated on: Jan 28, 2022 | 7:40 AM

Viral Video: ప్రపంచంలో మనిషికే కాదు.. ప్రతి ఒక్క జీవికి కొంచెమైన ప్రేమ (Love )అవసరం. ఇది అనేక సార్లు కుక్క, పిల్లి, ఏనుగు, కోతి వంటి పలు జంతువులు తోటివారి పట్ల తమ ప్రేమని చూపిస్తూ.. నిరూపించాయి కూడా.. ముఖ్యంగా మనిషికి దగ్గర పోలిక ఉండే కోతికి ఈ విషయంలో మరీ ఉదాహరణగా నిలుస్తుంది. అందుకు సాక్ష్యం ఈ వీడియో. ప్రస్తుతం ఆన్ లైన్ లో వైరల్ అయిన ఈ వీడియో (Viral Video) క్లిప్ లో ఏముందంటే… ఒక కోతి బాల్కనీలోకి వెళ్లి.. అక్కడ కుర్చీపై కూర్చున్న వ్యక్తి చేతుల్లోకి నేరుగా వెళ్లింది. అనంతరం ఆ వ్యక్తిని ఎంతో ప్రేమగా కౌగిలించుకుంది. ఆ సమయంలో దాని ప్రేమ కెమెరాలో బంధించారు. ఈ వీడియో ఓ రేంజ్ లో వైరల్ అవుతుంది, పలువురు నెటిజన్ల మనసులను గెలుచుకుంది.ఈ ఘటన మెక్సికోలో చోటు చేసుకుంది.

మెక్సికోలో ఓ ఫ్యామిలీ విహారయాత్రకు వెళ్ళింది. ఇప్పుడు వైరల్ అవుతున్న వీడియోలో, బాల్కనీలో కుర్చీపై కూర్చున్న వ్యక్తిని ఒక కోతి ఆప్యాయంగా కౌగిలించుకోవడం చూడవచ్చు. నిజానికి ఈ కోతి హోటల్ బాల్కనీలోకి ఎక్కి ఆ వ్యక్తి దగ్గరకు నేరుగా వెళ్ళింది. ఒడిలోకి ఎక్కి.. అతడిని ఎంతో ప్రేమగా కౌగిలించుకుంది. కోతి ప్రేమకు ఆ వ్యక్తి కూడా ఫిదా ఐనట్లున్నాడు. దీంతో అతను కూడా ఆ కోతి ఇష్టంగా దగ్గరకు తీసుకున్నాడు. దీంతో ఆ వ్యక్తి , కోతి ఒకరినొకరు కౌగిలించుకునే విధానం ఎంతో అందంగా ఉంది. మళ్ళీ మళ్ళీ చూడాలనిపిస్తుంది.

ఈ వీడియోను గుడ్ న్యూస్ మూవ్‌మెంట్ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. “ప్రేమ అనేది విశ్వవ్యాప్తం.. కోతి కొంత ప్రేమ కోసం బాల్కనీకి ఎక్కింది.. కోతి అక్కడ నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఆ వ్యక్తి హోటల్ లో తన రూమ్ లోకి తిరిగి వెళ్ళిపోయాడు అని కామెంట్ జత చేసింది. సోషల్ మీడియాలో షేర్ చేసిన ఈ వీడియో 5 మిలియన్లకు పైగా వీక్షణలను సంపాదించింది. ఇది నా జీవితంలో అత్యుత్తమ రోజు,” అని ఒక కామెంట్ చేయగా… నాకు వీరి ప్రేమ చూస్తుంటే కంట కన్నీరు ఆగడం లేదు అంటూ వ్యాఖ్యానించారు. ఇంకొకరు.. ప్రపంచంలో ప్రతి ఒక్కరికీ ప్రేమ అవసరం.. అది జంతువైనా సరే అంటూ కామెంట్ చేశారు.

Also Read: కరోనాతో సహజీవనం చేయడం నేర్చుకున్నాం.. సాధారణ ప్లూగానే చూస్తాం..మాస్క్ సహా కరోనా నిబంధనలు ఎత్తివేసిన దేశం..

పళ్లు ఊడిపోయినా బేఫికర్‌.. ఒరిజినల్‌వే మళ్లీ మొలిపిస్తరట..
పళ్లు ఊడిపోయినా బేఫికర్‌.. ఒరిజినల్‌వే మళ్లీ మొలిపిస్తరట..
ఒక్క రూపాయికే వైద్యం! ఈ డాక్టర్​ను అభినందించాల్సిందే
ఒక్క రూపాయికే వైద్యం! ఈ డాక్టర్​ను అభినందించాల్సిందే
ఏంటి మావా అదేమైనా పిల్లి అనుకున్నావా.. అలా ముద్దులు పెడుతున్నావ్
ఏంటి మావా అదేమైనా పిల్లి అనుకున్నావా.. అలా ముద్దులు పెడుతున్నావ్
షుగర్‌ పేషంట్స్‌ చెరుకు రసం తాగొచ్చా? నిపుణులు ఏమంటున్నారు?
షుగర్‌ పేషంట్స్‌ చెరుకు రసం తాగొచ్చా? నిపుణులు ఏమంటున్నారు?
బ్యాంక్‌లో మీకు రుణం ఉందా అయితే మీకో గుడ్‌ న్యూస్‌
బ్యాంక్‌లో మీకు రుణం ఉందా అయితే మీకో గుడ్‌ న్యూస్‌
గోల్కొండ బ్లూ డైమండ్ చరిత్ర ఏంటి..? దేశం దాటి ఎలా వెళ్లింది..?
గోల్కొండ బ్లూ డైమండ్ చరిత్ర ఏంటి..? దేశం దాటి ఎలా వెళ్లింది..?
సమంత షాకింగ్‌. భార్యలకు రోగాలు వస్తే, భర్తలు విడాకులు ఇస్తున్నారు
సమంత షాకింగ్‌. భార్యలకు రోగాలు వస్తే, భర్తలు విడాకులు ఇస్తున్నారు
మహేష్ బాబు మిస్సైన సినిమాతో.. రామ్ చరణ్ బ్లాక్ బస్టర్ హిట్
మహేష్ బాబు మిస్సైన సినిమాతో.. రామ్ చరణ్ బ్లాక్ బస్టర్ హిట్
తీవ్ర రక్త స్రావం.. ఆసుపత్రిలో ఆపరేషన్! ఇంతకీ రష్మీకి ఏమైంది?
తీవ్ర రక్త స్రావం.. ఆసుపత్రిలో ఆపరేషన్! ఇంతకీ రష్మీకి ఏమైంది?
అమర్‌దీప్‌ను అలా చూశాక.. బిగ్ బాస్‌కు వెళ్లడం వద్దనుకున్నా..
అమర్‌దీప్‌ను అలా చూశాక.. బిగ్ బాస్‌కు వెళ్లడం వద్దనుకున్నా..