పసి వయస్సు.. పెద్ద మనసు.. వరించిన అవార్డు

పసి వయస్సు.. పెద్ద మనసు.. వరించిన అవార్డు

కొద్ది రోజుల క్రిందట ఒక ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అయింది. అదేంటంటే ఒక చిన్న పిల్లవాడు తన సైకిల్ టైర్ కింద పడిన కోడి పిల్లను హాస్పిటల్ కు తీసుకెళ్లి వైద్యం చేయమని జాలిగా అడగడం.. అతని పసి మనసును చూసి నర్సు.. ఆ చిన్నారి ఫోటోను తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం జరిగింది. మీకు ఇప్పటికైనా గుర్తొచ్చి ఉంటాడు. ఆ చిన్నారి పేరు డెరిక్. ఇప్పుడు ఆ డెరిక్‌కు ప్రతిష్ఠాత్మక పెటా అవార్డు […]

Ravi Kiran

|

Apr 28, 2019 | 7:20 AM

కొద్ది రోజుల క్రిందట ఒక ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అయింది. అదేంటంటే ఒక చిన్న పిల్లవాడు తన సైకిల్ టైర్ కింద పడిన కోడి పిల్లను హాస్పిటల్ కు తీసుకెళ్లి వైద్యం చేయమని జాలిగా అడగడం.. అతని పసి మనసును చూసి నర్సు.. ఆ చిన్నారి ఫోటోను తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం జరిగింది. మీకు ఇప్పటికైనా గుర్తొచ్చి ఉంటాడు. ఆ చిన్నారి పేరు డెరిక్. ఇప్పుడు ఆ డెరిక్‌కు ప్రతిష్ఠాత్మక పెటా అవార్డు లభించింది.

అసలు వివరాల్లోకి వెళ్తే కొద్ది రోజులు క్రిందట మిజోరాం రాష్ట్రానికి చెందిన డెరిక్  ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అయిన సంగతి తెలిసిందే. ఆడుకుంటూ ఉన్నప్పుడు తన సైకిల్ టైర్ కింద పడి గాయాలపాలైన కోడి పిల్లను హాస్పిటల్ కి తీసుకెళ్లాల్సిందిగా మొదట తల్లిదండ్రులను కోరాడు. అయితే అప్పటికే కొన ఊపిరితో ఉన్న ఆ కోడి పిల్ల మృతి చెందింది. ఈ విషయాన్ని డెరిక్ కు అతని తల్లిదండ్రులు చెప్పినా వినకుండా.. కోడిపిల్లను బ్రతికించాలనే తపనతో దగ్గర్లో ఉన్న ఆసుపత్రికి పరుగులు తీశాడు. ఏమైంది అని అక్కడి నర్సు ఈ చిన్నారిని ప్రశ్నించింది. జరిగిన విషయం చెప్పాడు. కోడిపిల్ల తన సైకిలు టైరు కింద పడిందని దాన్ని బతికించాలంటూ డెరిక్ నర్సును ప్రాథేయపడ్డాడు. అంతేకాదు తన దగ్గర 10 రూపాయలు ఉన్నాయంటూ అక్కడి నర్సుకు చూపించాడు. ఆమె డెరిక్ పసి మనసుకి కరిగిపోయింది. వెంటనే చిన్నారి ఫోటోను తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఇక ఏముంది ఆ ఫోటో నెట్టింట్లో వైరల్ అయింది. డెరిక్ ఫోటో సోషల్ మీడియాను ఒక ఊపు ఊపేసింది. కోడిపిల్లను కాపాడాలన్న అతని తపన ప్రపంచాన్ని ఆలోచింపజేసింది. డెరిక్ కు మూగజీవులపై ఉన్న ప్రేమకు నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఆ చిన్నారి అమాయకత్వం చూస్తే ఎంతో ముచ్చటేస్తుంది… కోడిపిల్లను కాపాడాలన్న ఆ తపన తన కళ్లల్లో స్పష్టంగా కనిపిస్తోంది అంటూ కామెంట్ చేశారు. ఇక ఫోటో వైరల్ అవడంతో ఆ చిన్నారికి ప్రతిష్టాత్మక పెటా అవార్డు లభించింది. ఇక ఈ అవార్డును స్కూలు యాజమాన్యం ద్వారా ఆ చిన్నారికి ప్రదానం చేసింది పెటా సంస్థ.

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu