AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mini Kejriwal: ఢిల్లీ ఎన్నికల ఫలితాల వేళ..‘మినీ కేజ్రీవాల్’ సందడి..ఆ వీడియో వైరల్…

మాజీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ ఓటమి పాలయ్యారు. కేజ్రీవాల్ కు ఉన్న నిజాయితీపరుడనే ఇమేజ్ డ్యామేజ్‌ కావడంతో ఆయన ఎన్నికల్లో ఓడిపోయారు. ఇదిలా ఉంటే, ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు వేళ ఓ ఆసక్తికర సన్నివేశంలో అందరినీ ఆకర్షించింది. మాజీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ వేషధారణలో ఉన్న ‘మినీ కేజ్రీవాల్’ అక్కడ సందడి చేశాడు.

Mini Kejriwal: ఢిల్లీ ఎన్నికల ఫలితాల వేళ..‘మినీ కేజ్రీవాల్’ సందడి..ఆ వీడియో వైరల్...
Mini Kejriwal
Jyothi Gadda
|

Updated on: Feb 08, 2025 | 2:02 PM

Share

ఎట్టకేలకు హస్తిన పీఠంపై కమలం పాగా వేసింది. యమునా నది ఒడ్డున ఉన్న ఢిల్లీ రాజకీయ వాతావరణం మారిపోయింది. 1998 నుండి 2025 వరకు.. 27 సంవత్సరాల సుదీర్ఘ పోరాటం ఫలించింది. కేంద్రంలోని బీజేపీకి ఢిల్లీ ప్రజలు పట్టం కట్టారు. మాజీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ ఓటమి పాలయ్యారు. కేజ్రీవాల్ కు ఉన్న నిజాయితీపరుడనే ఇమేజ్ డ్యామేజ్‌ కావడంతో ఆయన ఎన్నికల్లో ఓడిపోయారు. ఇదిలా ఉంటే, ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు వేళ ఓ ఆసక్తికర సన్నివేశంలో అందరినీ ఆకర్షించింది. మాజీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ వేషధారణలో ఉన్న ‘మినీ కేజ్రీవాల్’ అక్కడ సందడి చేశాడు.

ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) చీఫ్ అరవింద్ కేజ్రీవాల్‌కు మద్దతుదారుడైన అవ్యాన్ తోమర్ నిన్న ఉదయం కేజ్రీవాల్ గెటప్‌లో ఆయన ఇంటికి వెళ్లాడు. అచ్చం రాజకీయ నాయకుడిలా కనిపించిన అవ్యాన్‌ను చూసి అందరూ ఆశ్చర్యపోయారు. అవ్యాన్ అచ్చం కేజ్రీవాల్‌లానే నీలం రంగు స్వెట్టర్, వైట్ కాలర్, గ్రీన్ పఫ్ జాకెట్ ధరించాడు. మెడకు నల్లని మఫ్లర్ కూడా కట్టుకుని కనిపించాడు.. కళ్లకు అద్దాలు పెట్టుకోవడంతోపాటు మీసాలు కూడా దిద్దుకున్నాడు. అయితే, అవ్యాన్‌ ఇలా కనిపించడం ఇదే తొలిసారి కాదు.. ఎన్నికల ఫలితాల వేళ తాము ప్రతిసారి ఇక్కడకు వస్తామని అవ్యాన్ తండ్రి రాహుల్ తోమర్ చెప్పారు. అవ్యాన్‌కు ఆప్ ‘బేబీ మఫ్లర్ మ్యాన్’గా నామకరణం చేసింది.

ఇవి కూడా చదవండి

అవ్యాన్ 2022 ఢిల్లీ స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ ఇలాగే అందరినీ ఆకర్షించాడు. ఆ ఎన్నికల్లో ఆప్ గెలిచిన తర్వాత తోటి చిన్నారులతో కలిసి అవ్యాన్ సంబరాలు చేసుకున్నాడు. నాలుగేళ్ల అవ్యాన్ విక్టరీ సింబల్ చూపిస్తున్న ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..