Viral: కాక్‌పీట్‌లో రచ్చ రచ్చ.. విమానంలో పిల్లితో పైలట్ ఫైటింగ్.. ఎమర్జెన్సీ ల్యాండింగ్..!
Pilot Flight with Cat: టార్కో ఏవియేషన్‌కు చెందిన విమానం సూడాన్ రాజధాని ఖార్టూమ్ నుంచి ఖతార్ టేకాఫ్ అయ్యింది. విమానం టేకాఫ్ అయిన కొద్దిసేపటికే కాక్‌పిట్‌లో పిల్లి ఆకస్మికంగా కనిపించి...
Cat Attacks Pilot: ఒక్కోసారి కొన్ని ఘటనలు పెద్ద సమస్యలను సృష్టిస్తుంటాయి. చిన్న పక్షి పెద్ద విమానాన్ని కూల్చనూవచ్చు.. ప్రమాదంలోకి నెట్టనూ వచ్చు. అయితే ఇలాంటి ఘటనే ఒకటి ఆకాశయానంలో జరిగింది. కాక్‌పిట్‌లో నక్కిన పిల్లి పైలట్‌పై దాడి చేసింది. దీంతో విమానాన్ని అత్యవసరంగా ల్యాండ్ చేశారు.
టార్కో ఏవియేషన్‌కు చెందిన విమానం సూడాన్ రాజధాని ఖార్టూమ్ నుంచి ఖతార్ టేకాఫ్ అయ్యింది. విమానం టేకాఫ్ అయిన కొద్దిసేపటికే కాక్‌పిట్‌లో పిల్లి ఆకస్మికంగా కనిపించి ఆందోళనకు గురి చేసింది. అంతటితో ఆగకుండా.. పైలెట్‌పై అటాక్ చేసింది. పెద్ద రచ్చ చేసింది. దాడి చేస్తున్న సమయంలో ఎవరొచ్చిన వారిపైకి దూకేందుకు ప్రయత్నించింది. ఆ పిల్లని కంట్రోల్ చేసేందుకు విమాన సిబ్బంది పెద్ద యుద్ధం చేశారట.
దీంతో ఆ పిల్లి చూపించిన నరకానికి ఏం చోయాలో తెలియగా చివరికి విమానాన్ని ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేయాల్సి వచ్చింది. అయితే ఇందులోని ప్రయాణికులంతా సురక్షింతంగానే ఉన్నారు. అయితే ఆ పిల్లి విమానంలోకి ఎలా వచ్చిందో సరిగ్గా విమాన సిబ్బంది చెప్పలేక పోతున్నారు. టాకాఫ్‌కు ముందే విమానం మొత్తం పరిశీలించి ఓకే చెప్పిన తర్వాతే ప్రయాణం మొదలు పెడుతారు. అయితే ఇలా పిల్లి విమానంలోకి ఎలా వచ్చిందనేది ఇప్పుడు పెద్ద ప్రశ్నగా మారింది.
అయితే ఈ విమానం ప్రయాణానికి ముందు రోజు రాత్రి అదే విమానాశ్రయంలో ఒక హ్యాంగర్ దగ్గర హాల్ట్‌లో ఉంది. ఇలా ఆగి ఉన్న సమయంలో ఈ పిల్లి విమానంలోకి వెళ్లి ఉంటుందనే సందేహాలూ వ్యక్తమవుతున్నాయి. విమానాశ్రయంలో రాత్రి సమయంలో ఆ పిల్లి అక్కడికి వచ్చి ఉంటుందని విమాన సబ్ స్టాఫ్ అనుకుంటున్నారు. రాత్రి విమానాన్ని శుభ్రం చేసే సమయంలో ఆ పిల్లి అక్కడే నక్కి ఉంటుందని అనుకుంటున్నారు. ఈ ఘటనపై టార్కో ఏవియేషన్ ఇప్పటివరకు స్పందించలేదు.
విమానాల్లో ఇలాంటి ఘటనలు జరగడం ఇదే మొదటి సారి కాదు. గతంలో ఇలాంటి ఘటనలు చాలా ఎదురయ్యాయని విమాన అధికారులు వెల్లడించారు. ఇటువంటి సందర్భాల్లో విమానాన్ని గంటల తరబడి నిలిపివేసిన ఘటనలు ఉన్నాయని అంటున్నారు.
గతంలో ఇలాంటి ఘటనలు…
కాగా ఓ జంతువులు, పక్షుల కారణంగా విమానాలు నిలిచిపోయిన ఘటనలు.. అత్యవసరంగా ల్యాండ్ చేసిన సంఘటనలు చేలానే ఉన్నాయి. గాలి గందరగోళానికి ఒక దొంగ జంతువు కారణం కావడం ఇదే మొదటిసారి కాదు. గత సంవత్సరం కూడా అహ్మదాబాద్ నుండి జైపూర్‌కు ప్రయాణించాల్సిన గో ఎయిర్ విమానంలోకి రెండు పావురాలు ప్రవేశించాయి.