Viral: కడుపు నొప్పితో ఆస్పత్రికి వెళ్లిన వ్యక్తి.. స్కాన్ చేసి రిపోర్ట్స్ చూడగా డాక్టర్లకు మైండ్ బ్లాంక్!
ఇదొక క్రేజీ న్యూస్. మీరెప్పుడూ విని ఉండరు. ఈ వార్త వింటే మీరు కచ్చితంగా ఆశ్చర్యపోతారు. లేట్ ఎందుకు ఓ సారి చూసేయండి..
ఇదొక క్రేజీ న్యూస్. మీరెప్పుడూ విని ఉండరు. సాధారణంగా పీరియడ్స్.. ప్రతీ నెలా మహిళలను పలకరిస్తుంటాయి. ఆ సమయంలో అధిక రక్తస్రావం అవుతుందన్న విషయం తెలిసిందే. అంతేకాదు తీవ్రమైన కడుపు నొప్పి, నడుం నొప్పి లాంటి సమస్యలు కూడా తలెత్తుతాయి. ఇప్పుడిదంతా ఎందుకు చెబుతున్నానని అనుకుంటున్నారా.? ఇక్కడొక పురుషుడ్ని ప్రతీ నెలా పీరియడ్స్ పలకరిస్తున్నాయి. అవునా.! ఇది నిజమేనా.. మరి లేట్ ఎందుకు ఆ కథేంటో తెలియాలంటే..
చెన్ లీ(Chen Li) అనే 33 ఏళ్ల వ్యక్తి తరచూ తీవ్రమైన కడుపు నొప్పితో బాధపడటమే కాదు.. అతడి మూత్రం ద్వారా తీవ్రమైన రక్తంస్రావం అవుతూ వచ్చింది. దీంతో ఒక్కసారిగా కంగారుపడిన అతడు.. చెకప్ చేయించుకునేందుకు ఆసుపత్రికి వెళ్లాడు. ఇక సదరు వ్యక్తిని స్కాన్ చేసిన డాక్టర్లు.. వచ్చిన రిపోర్ట్స్ చూసి ఖంగుతిన్నారు. చెన్‌లీకి అండాశయం, గర్భాశయం రెండూ కలిపి ఉన్నట్లు గుర్తించారు. క్రోమోజోమ్ విశ్లేషణ పరీక్ష అనంతరం ఈ 33 ఏళ్ల పురుషుడు జన్యుపరంగా స్త్రీ అని డాక్టర్లు తేల్చారు.
అసలు సంగతేంటంటే..
నైరుతి చైనా ప్రాంతమైన సిచువాన్ ప్రావిన్స్‌లో నివసించే చెన్‌లీ.. యుక్త వయసులో సక్రమంగా మూత్ర విసర్జన కాకపోవడంతో.. అందుకు సంబంధించి ఓ ఆపరేషన్ చేయించుకున్నాడు. అప్పటి నుంచి అతడికి మూత్రం ద్వారా అధికంగా రక్తస్రావం కావడం.. తీవ్రమైన కడుపునొప్పి రావడం మొదలైంది. మొదట్లో వైద్యులు.. అది అపెండిసైటిస్ అని నిర్ధారించి.. దానికి తగ్గట్టుగా చికిత్స అందించారు. అయినప్పటికీ ఎలాంటి ప్రయోజనం లేకపోయింది.
ఆ లక్షణాల్లో ఎలాంటి మార్పు లేదు. చేసేదేమి లేక గతేడాది చెన్‌లీ.. చెకప్ నిమిత్తం మరో డాక్టర్ దగ్గరకు వెళ్లగా.. అతడిలో ఆడ సెక్స్ క్రోమోజోములు ఉన్నట్లు గుర్తించారు. అలాగే మరొక వైద్య పరీక్షలో అతనికి గర్భాశయం, అండాశయాలతో సహా స్త్రీ పునరుత్పత్తి అవయవాలు ఉన్నాయని తేలింది. అంతేకాకుండా అతడిలో మగ సెక్స్ హార్మోన్ ఆండ్రోజెన్ స్థాయిలు సగటు కంటే తక్కువని డాక్టర్లు గుర్తించారు. కాని ఆడ సెక్స్ హార్మోన్లు, అండాశయ కార్యకలాపాల స్థాయిలు ఆరోగ్యకరమైన వయోజన మహిళల్లో కనిపించే వాటిలా ఉన్నాయని నిర్ధారించారు. దీనితో డాక్టర్లు చివరికి అతడు ఇంటర్ సెక్స్యూవల్ అని తేలింది. కాగా, తనలో స్త్రీ పునరుత్పత్తి అవయవాలు బయటపడటంతో నిర్ఘాంతపోయిన చెన్‌లీ.. గత నెలలో ఆపరేషన్ ద్వారా వాటిని తొలగించుకున్నాడు. దాదాపు మూడు గంటల పాటు డాక్టర్లు శస్త్రచికిత్స నిర్వహించారు. ఆపరేషన్ అనంతరం చెన్‌లీ ఆరోగ్యంగా ఉన్నాడని డాక్టర్లు వెల్లడించారు.