Funny Video: ఇలాంటి కోతి చేష్టలు చేసే ఫ్రెండ్ ప్రతి గ్యాంగ్‌లో ఒకడుంటాడు.. చూస్తే నవ్వాపుకోలేరు
ప్రతిరోజు మనకు సోషల్ మీడియాలో రకరకాల వీడియోలు తారసపడుతుంటాయి. వాటిలో కొన్ని కోపం తెప్పిస్తే.. మరికొన్ని నవ్విస్తాయి. తాజాగా...
ప్రతిరోజు మనకు సోషల్ మీడియాలో రకరకాల వీడియోలు తారసపడుతుంటాయి. వాటిలో కొన్ని కోపం తెప్పిస్తే.. మరికొన్ని నవ్విస్తాయి. తాజాగా ఇంటర్నెట్‌లో ట్రెండ్ అవుతున్న ఓ తమాషా వీడియోను మీ ముందుకు తీసుకొచ్చాం. ఈ వీడియో చూసిన తర్వాత మీరు నవ్వు ఆపుకోవడం కష్టం. అంతేకాదు దీన్ని చూసిన తర్వాత మీ గ్యాంగ్ లోని ఓ ఫ్రెండ్ కూడా మీకు గుర్తుకువస్తాడు. ఒక వ్యక్తి గ్లాసు నిండా కూల్ డ్రింక్ పోసి.. దాన్ని తాగేందుకు మరో ఇద్దరు మిత్రులను ఆహ్వానించాడు. ఆ తర్వాత అక్కడి జరిగిన సీన్ చూసి.. ఆ ఇద్దరు ఫ్రెండ్స్ ఆశ్చర్యపోయారు.
తినబోతూ రుచెందుకు.. ముందుగా ఆ వీడియోపై ఓ లుక్కెయ్యండి
View this post on Instagram
వీడియోలో మీరు ఇద్దరు స్నేహితులు 1 ట్రక్ దగ్గర సెల్ఫీలు క్లిక్ చేస్తుండటం చూడవచ్చు. మూడవ స్నేహితుడు వారిద్దరినీ బైక్ దగ్గరకు కూల్ డ్రింక్ తాగేందుకు ఇన్వైట్ చేశాడు. వారి మధ్య ఉన్న ఫ్రెండ్షిప్ చాలా గొప్పది మరి. అందుకే ముగ్గురు ఫ్రెండ్స్ కూడా లవర్స్ మాదిరి ఒకే గ్లాసులోని కూల్ డ్రింక్‌ను స్ట్రాలతో తాగడం ప్రారంభించారు. సెకన్ల వ్యవధిలోనే అందులోని డ్రింక్ అయిపోయింది. కట్ చేస్తే.. డ్రింక్ తాగేందుకు ఇన్వైట్ చేసిన ఫ్రెండే మొత్తం తాగేశాడు. ఒకే స్ట్రాకు ఉన్న రెండు మొనలను ఇద్దరు ఫ్రెండ్స్‌కు ఇచ్చి వారిని ఆటపట్టించాడు. సోషల్ మీడియాలో ఈ వీడియోను నెటిజన్లు బాగా లైక్ చేస్తున్నారు. తమ బ్యాచ్‌లో కూడా ఇలాంటివాడు ఒకడు ఉంటాడంటూ వారి పేర్లను కామెంట్ల రూపంలో తెలియజేస్తున్నారు. ఇది కావాలని చేసిన వీడియో అయినప్పటికీ, నెటిజన్లను మాత్రం బాగా ఆకట్టుకుంటుంది.
Also Read:‘బాహుబలి’లో రానాలా కటింగ్ కొట్టాడు.. కట్ చేస్తే.. నవ్వుతో మీ పొట్ట చెక్కలవ్వడం ఖాయం