Viral Video: ఎండిన చెట్టు కొమ్మ అనుకున్నారు.. తెరిచి చూడగా భారీ తేనె పట్టు..
తేనె తినడం ఆరోగ్యానికి చాలా మంచిదన్న విషయం అందరికీ తెలిసిందే. అందాన్ని పెంచడంలో కూడా ఇది ఎంతో చక్కగా పని చేస్తుంది. తేనెలో ఎన్నో రకాల ఔషధ గుణాలు ఉంటాయి. పలు రకాల వ్యాధుల్ని కూడా నయం చేసుకోవచ్చు. ఆయుర్వేదంలో కూడా తేనెకు ఎంతో ప్రాముఖ్యత ఇస్తారు. అయితే ఈ పోషకాలు అన్నీ నేచురల్‌గా లభ్యమయ్యే తేనెలో దొరుకుతాయి. ఈ తేనె అటవీ ప్రాంతాల్లో..
తేనె తినడం ఆరోగ్యానికి చాలా మంచిదన్న విషయం అందరికీ తెలిసిందే. అందాన్ని పెంచడంలో కూడా ఇది ఎంతో చక్కగా పని చేస్తుంది. తేనెలో ఎన్నో రకాల ఔషధ గుణాలు ఉంటాయి. పలు రకాల వ్యాధుల్ని కూడా నయం చేసుకోవచ్చు. ఆయుర్వేదంలో కూడా తేనెకు ఎంతో ప్రాముఖ్యత ఇస్తారు. అయితే ఈ పోషకాలు అన్నీ నేచురల్‌గా లభ్యమయ్యే తేనెలో దొరుకుతాయి. ఈ తేనె అటవీ ప్రాంతాల్లో ఎక్కువగా లభ్యమవుతుంది. చాలా మంది తేనెనే సేకరిస్తూ ఉంటారు. ఎత్తైన చెట్లు, కొండల మధ్య ప్రమాదకరమైన పరిస్థితుల్లో తేనె తీస్తూ ఉంటారు. తేనె తీస్తున్న వీడియోలు కూడా నెట్టింట జోరుగా వైరల్ అవుతూ ఉంటాయి. ఈ వీడియోలు కూడా మీరు చూసే ఉంటారు. తాజాగా తేనె లభ్యమయిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. మరి ఆ వైరల్ వీడియోలో ఏముందో ఇప్పుడు చూద్దాం.
ఈ వైరల్ వీడియోని ‘bal_avcisi’ అనే ఇన్ స్టా అకౌంట్ నుంచి సేర్ చేశారు. ఇందులో ఓ వ్యక్తి ఎండిన చెట్టు కొమ్మను రెండుగా చీల్చగా.. అందులో భారీగా తేనె పట్టు ఉంది. అది చూసి అందరూ షాక్ అయ్యారు. అలాగే తేనె టీగలు కూడా ఎక్కువగానే ఉన్నాయి. కొమ్మల మధ్య భాగం పూర్తిగా తేనె పట్టుతో నిండి పోయి ఉంది. తేనెను నిల్వ చేయడానికి, పిల్లల పెంపకానికి తేనె టీకలు పెద్ద పెద్ద తేనె పట్టులను నిర్మించాయి.
అయితే కొమ్మను చీల్చిన వ్యక్తి తేనె టీగలు కుట్టకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోలేదు. అయినా అతను నిర్భయంగా తన పని చేసుకుంటున్నాడు. పక్క నుంచి ఎవరో పొగ పెట్టారు. ప్రస్తుతం ఈ వీడియోకు ఏకంగా 43 లక్షల వ్యూస్ వచ్చాయి. ఈ వీడియోను చూసిన నెటిజన్లు రక రకాల కామెంట్స్ చేస్తున్నారు. చాలా మంది ఈ వీడియోని షేర్ చేస్తున్నారు.
వీడియో చూడండి..
View this post on Instagram