Viral Video: ఒక బైక్ మీద ఏడుగురు ప్రయాణం.. ఇదేంటి అని ప్రశ్నించిన పోలీసుకు.. పెట్రోల్ ధర పెరిగిందని ఆన్సర్.. ఎక్కడంటే..

Viral Video: పూర్వకాలంలో ఎడ్ల బండి, గుర్రపు బండిలో ఒకేసారి పది మంది వరకూ ప్రయాణించేవారు. అయితే కాలక్రమంలో ఎడ్ల బండ్లు, గుర్రపు బండ్లు కనుమరుగయ్యాయి.. ఎక్కడో అరుదుగా మాత్రమే ప్రస్తుతం కనిపిస్తున్నాయి...

Viral Video: ఒక బైక్ మీద ఏడుగురు ప్రయాణం.. ఇదేంటి అని ప్రశ్నించిన పోలీసుకు.. పెట్రోల్ ధర పెరిగిందని ఆన్సర్.. ఎక్కడంటే..
Video Viral
Follow us
Surya Kala

|

Updated on: Apr 02, 2022 | 10:02 AM

Viral Video: పూర్వకాలంలో ఎడ్ల బండి, గుర్రపు బండిలో ఒకేసారి పది మంది వరకూ ప్రయాణించేవారు. అయితే కాలక్రమంలో ఎడ్ల బండ్లు, గుర్రపు బండ్లు కనుమరుగయ్యాయి.. ఎక్కడో అరుదుగా మాత్రమే ప్రస్తుతం కనిపిస్తున్నాయి. కాలక్రమంలో వచ్చిన మార్పుల్లో భాగంగా రిక్షాలు, సైకిళ్ళు, మోటార్ బైక్స్ , బస్సులు, కార్లు వంటివి అందుబాటులోకి వచ్చాయి. బైక్ ఇప్పుడు ప్రతి ఒక్కరి ఇంట్లోనూ ఉంటుంది. అయితే ఈ బైక్ పై ఎంతమంది ఒకేసారి ప్రయనిస్తారు అని అంటే.. ఇద్దరు మహా ఐతే ముగ్గురు..ముగ్గురు వెళ్తేనే.. ట్రిపుల్ రైడింగ్ అంటూ ట్రాపిక్ కానిస్టేబుల్స్ ఫైన్ వేస్తారు.. మరి అలాంటిది ఒక బైక్ పై మొత్తం ఏడుగురు ప్రయాణించడం ఎప్పుడైనా చూశారా.. అసలు అలా ఎప్పుడైనా ఎవరైనా ప్రయాణం చేస్తారని అనుకున్నారు. అరుదైన ఈ ఫీట్ ను ఒక వ్యక్తి చేశాడు.. బైక్ పై అతనితో కలిపి మొత్తం ఏడుగురు వెళ్తున్నారు. వెంటనే అతడిని పోలీసులు ఆపి ఇదేంటి ఇంతమందిని ఒకేసారి బైక్ మీద తీసుకెళ్తున్నావని అడిగారు. పోలీసుల పశ్నకు బైక్ నడుపుతున్న వ్యక్తి చెప్పిన అన్సార్ విని.. ఓ రేంజ్ లో షాక్ కు గురయ్యారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో వైరల్(Viral Video) అవుతుంది. ఈ ఘటన బీహార్(Bihar)లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే..

బీహార్ రాష్ట్రంలోని షియోహర్ జిల్లా నవాబ్ హైస్కూల్ వద్ద ట్రాపిక్ పోలీసులు వాహనాలను తనిఖీ చేస్తున్నారు. అప్పుడు అటుగా వస్తున్నా ఓ బైక్ ను చూసి పోలీసులు షాక్ తిన్నారు. బైక్ మీద నలుగురు పిల్లలు, ఇద్దరు మహిళలు సహా బైక్ నడిపే వ్యక్తి మొత్తం ఏడుగురు బైక్ మీద ఉన్నారు. పోలీసులు వెంటనే ఆ బైక్ ను ఆపి.. ఒక్క బైక్ పై ఏడుగురు ఎలా వెళ్తున్నారు.. ఇది ప్రమాదం.. ఇలాంటి పనులు ఎలా చేస్తారు అంటూ ఆ వ్యక్తిని ప్రశ్నించారు. వెంటనే బైక్ నడుపుతున్న వ్యక్తి స్పందిస్తూ…” పెట్రోల్ ధర ఎక్కువగా ఉంది. రోజు రోజుకీ పెట్రోల్ ధర పెరిగి పోతుంది కూడా.. ఇలాంటి సమయంలో నేను మూన్నాలుగు రౌండ్లు వేస్తే పెట్రోల్ కు భారీగా డబ్బులవుతాయి సార్.. అందుకే అందరినీ ఒకేసారి తీసుకెళ్తున్నానని నెమ్మదిగా చెప్పాడు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. బైక్ నడుపుతున్న వ్యక్తి తెలివి తేటలకు.. పొడుపు ఆలోచన కు నెటిజన్స్ ఫన్నీగా స్పందిస్తున్నారు. అంతేకాదు పెట్రోల్ ధరలపై ఫన్నీగా కామెంట్ చేస్తూనే.. తమ పరిస్థితి కూడా అలాగే ఉంటుంది అంటున్నారు.

Also Read: Viral Video: ఒక బైక్ మీద ఏడుగురు ప్రయాణం.. ఇదేంటి అని ప్రశ్నించిన పోలీసుకు.. పెట్రోల్ ధర పెరిగిందని ఆన్సర్.. ఎక్కడంటే..

క్యాచ్ పట్టుకునే ప్రయత్నంలో ఢీకొన్న క్రికెటర్లు.. వీడియోలు వైరల్
క్యాచ్ పట్టుకునే ప్రయత్నంలో ఢీకొన్న క్రికెటర్లు.. వీడియోలు వైరల్
డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ యాక్ట్ ముసాయిదా రిలీజ్
డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ యాక్ట్ ముసాయిదా రిలీజ్
ఎంగేజ్‌మెంట్ చేసుకున్న అరుంధతి ఛైల్డ్ ఆర్టిస్ట్.. ఫొటోస్ వైరల్
ఎంగేజ్‌మెంట్ చేసుకున్న అరుంధతి ఛైల్డ్ ఆర్టిస్ట్.. ఫొటోస్ వైరల్
సల్మాన్ ఖాన్ తమ్ముడు విడాకులు..
సల్మాన్ ఖాన్ తమ్ముడు విడాకులు..
12 కిలోల బరువు పెరిగి.. ఆపై చైన్ స్మోకర్‏గా మారిన హీరోయిన్..
12 కిలోల బరువు పెరిగి.. ఆపై చైన్ స్మోకర్‏గా మారిన హీరోయిన్..
రోజుకు ఎన్ని లీటర్ల నీరు తాగాలో తెలుసా.. ఎక్కువైతే ఏమౌతుంది..?
రోజుకు ఎన్ని లీటర్ల నీరు తాగాలో తెలుసా.. ఎక్కువైతే ఏమౌతుంది..?
కొత్త ఏడాది పైనే ఫ్లాప్ హీరోయిన్ల ఆశలు.. ఇప్పుడైన కలిసొచ్చేన
కొత్త ఏడాది పైనే ఫ్లాప్ హీరోయిన్ల ఆశలు.. ఇప్పుడైన కలిసొచ్చేన
నీయవ్వ తగ్గేదేలే.. పుష్పరాజ్‌లా పోజులిచ్చిన స్టార్ హీరోయిన్ డాటర్
నీయవ్వ తగ్గేదేలే.. పుష్పరాజ్‌లా పోజులిచ్చిన స్టార్ హీరోయిన్ డాటర్
వీళ్లు బాదంపప్పును పొరపాటున కూడా తినకూడదు.. దూరంగా ఉంటేనే ఆరోగ్యం
వీళ్లు బాదంపప్పును పొరపాటున కూడా తినకూడదు.. దూరంగా ఉంటేనే ఆరోగ్యం
హీరో ఆది పినిశెట్టి భార్య ఫేమస్ హీరోయిన్ తెలుసా.. ?
హీరో ఆది పినిశెట్టి భార్య ఫేమస్ హీరోయిన్ తెలుసా.. ?