AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రూ. 4,000ల పాత సోఫాలో రూ. 36 లక్షల నగదు.. చూసి నోరెళ్లబెట్టిన కుటుంబం, ఆ తర్వాత ఏం చేశాడంటే?

అదృష్టం ఏ రూపంలో వస్తుందో ఎవరూ ఊహించలేరు. కానీ, అలా లభించిన అదృష్టం కంటే నిజాయితీ గొప్పదని నిరూపించాడు అమెరికాలోని మిచిగాన్‌కు చెందిన హోవార్డ్ కిర్బీ. సెకండ్ హ్యాండ్ షాప్‌లో తక్కువ ధరకు కొన్న ఒక పాత సోఫా, ఆయన జీవితంలో మరువలేని ఒక అద్భుతమైన ఘట్టానికి వేదికగా నిలిచింది.

రూ. 4,000ల పాత సోఫాలో రూ. 36 లక్షల నగదు.. చూసి నోరెళ్లబెట్టిన కుటుంబం, ఆ తర్వాత ఏం చేశాడంటే?
Sofa Cash Discovery
Jyothi Gadda
|

Updated on: Sep 16, 2026 | 4:55 PM

Share

అమెరికాలోని మిచిగాన్‌కు చెందిన హోవార్డ్ కిర్బీ అనే వ్యక్తి సెకండ్ హ్యాండ్ షాప్‌లో 50 డాలర్లకు (రూ. 4,000 పైగా) ఒక పాత సోఫాను కొనుగోలు చేశాడు. కొద్దిరోజుల తర్వాత దాని కుషన్ అసౌకర్యంగా అనిపించడంతో, ఆయన కోడలు కుషన్ జిప్‌ను తెరిచి చూసింది. అందులో ఊహించని విధంగా 43,170 డాలర్లు (సుమారు రూ. 36 లక్షల నగదు) ఉన్న పెట్టె బయటపడింది. ఆ తర్వాత ఏం జరిగిందో పూర్తి వివరాల్లోకి వెళ్లాల్సిందే..

హోవార్డ్ కిర్బీ ఒవోస్సోలోని బిటాట్ ఫర్ హ్యుమానిటీ రీస్టోర్ అనే పాత వస్తువుల విక్రయశాల నుండి కేవలం 50 డాలర్లకు (సుమారు రూ. 4,000) ఒక పాత సోఫాను, దానితో పాటు ఉండే కూర్చునే కుషన్ సీటును కొనుగోలు చేశాడు. కొద్ది వారాల పాటు దానిని ఉపయోగించిన తర్వాత, ఆ సీటులో కూర్చోవడం కొద్దిగా అసౌకర్యంగా అనిపించింది. దాంతో దాని లోపల ఏముందో చూడాలని కిర్బీ కోడలు కుషన్ జిప్‌ను తెరిచింది. లోపల కట్టలుగా అమర్చి ఉన్న నోట్ల కట్టల పెట్టెను చూసి ఆమె తీవ్ర ఆశ్చర్యానికి గురైంది. ఆ డబ్బును లెక్కించగా ఏకంగా 43,170 డాలర్లు (భారత కరెన్సీలో సుమారు రూ. 36 లక్షలకు పైగా) ఉంది.

ఇంత పెద్దమొత్తంలో డబ్బు లభించడంతో కిర్బీ కుటుంబం ఆనందంలో మునిగిపోయింది. నిజానికి కిర్బీకి తన ఇంటి కప్పు ను బాగు చేయించుకోవడానికి డబ్బు అత్యంత అవసరంగా ఉంది. పైగా, కొనుగోలు చేసిన వస్తువులో దొరికిన డబ్బును చట్టపరంగా ఆయనే ఉంచుకోవచ్చని న్యాయవాదులు కూడా చెప్పారు. కానీ, కిర్బీ మనస్సాక్షి దానికి అంగీకరించలేదు. వేరొకరి కష్టార్జితాన్ని తనదిగా అనుకోవడం ఆయనకు నచ్చలేదు.

ఇవి కూడా చదవండి

బాధ్యతాయుతంగా ప్రవర్తించిన కిర్బీ వెంటనే సోఫా అమ్మిన షాపు నిర్వాహకులను సంప్రదించి, ఆ సోఫా అసలు యజమాని వివరాలు సేకరించాడు. ఆ సోఫా ఫిలిప్ ఫౌత్ అనే వ్యక్తికి చెందినదిగా తెలిసింది. ఆయన మరణించిన తర్వాత, మనవరాలు కిమ్ ఫౌత్-న్యూబెర్రీ ఆ సోఫాలో దాచిన డబ్బు గురించి తెలియక సెకండ్ హ్యాండ్ షాప్‌నకు విరాళంగా ఇచ్చేసింది.

కిర్బీ ఆమెను పిలిపించి, కుషన్‌లో దొరికిన రూ. 36 లక్షల నగదును పైసా తగ్గకుండా తిరిగి అప్పగించాడు. కిర్బీ చేసిన ఈ ఉదారత్వానికి, నిజాయితీకి ఆ కుటుంబంతో పాటు స్థానికులు, సోషల్ మీడియా నెటిజన్లు నీరాజనాలు పలికారు. “నేను సరైన నిర్ణయం తీసుకున్నందుకు నా మనస్సుకు ఎంతో ప్రశాంతంగా ఉంది” అని కిర్బీ ఆనందంగా వెల్లడించాడు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Follow Us
మానవ శరీర భాగాలతో పూజలు చేస్తే అద్భుత శక్తులు వస్తాయని.. దారుణం
మానవ శరీర భాగాలతో పూజలు చేస్తే అద్భుత శక్తులు వస్తాయని.. దారుణం
పెళ్లైన నాలుగేళ్లకే విడాకులు.. చిన్న విషయానికే ఇంట్లో యుద్ధం
పెళ్లైన నాలుగేళ్లకే విడాకులు.. చిన్న విషయానికే ఇంట్లో యుద్ధం
ఇమ్రాన్ ఖాన్ పరిస్థితిపై రవిశాస్త్రి ఆగ్రహం
ఇమ్రాన్ ఖాన్ పరిస్థితిపై రవిశాస్త్రి ఆగ్రహం
సారీ నాన్న.. ఈ భారం నేను మోయలేకపోతున్నా..
సారీ నాన్న.. ఈ భారం నేను మోయలేకపోతున్నా..
గాఢంగా ప్రేమించాడు.. కట్ చేస్తే.. ఆ ఒక్క ఫోన్ కాల్‌తో..
గాఢంగా ప్రేమించాడు.. కట్ చేస్తే.. ఆ ఒక్క ఫోన్ కాల్‌తో..
ఆ సినిమాతో నా కెరీర్ అయిపోయిందని అన్నారు.. థియేటర్లను షేక్ చేసిన
ఆ సినిమాతో నా కెరీర్ అయిపోయిందని అన్నారు.. థియేటర్లను షేక్ చేసిన
ఆ ఒక్క హీరోతో వరుసగా మూడు సినిమాలు.. అది అంత మంచిది కాదు..
ఆ ఒక్క హీరోతో వరుసగా మూడు సినిమాలు.. అది అంత మంచిది కాదు..
గాల్లో ఉండగా బ్రిటిష్ ఎయిర్‌వేస్ విమానంలో హైఅలర్ట్.. ఏంజరిగిందంటే
గాల్లో ఉండగా బ్రిటిష్ ఎయిర్‌వేస్ విమానంలో హైఅలర్ట్.. ఏంజరిగిందంటే
ఫాస్టెస్ట్ సెంచరీ చేస్తా.. వైభవ్ టార్గెట్లు మామూలుగా లేవు
ఫాస్టెస్ట్ సెంచరీ చేస్తా.. వైభవ్ టార్గెట్లు మామూలుగా లేవు
శంషాబాద్ ఎయిర్‌పోర్టులో బుల్లెట్ కలకలం.. ప్రయాణికుడు అదుపులోకి..
శంషాబాద్ ఎయిర్‌పోర్టులో బుల్లెట్ కలకలం.. ప్రయాణికుడు అదుపులోకి..