Viral video: సాహసాల వీరుడు.. ఆకాశంలో గిరగిరా తిరుగుతూ..తన రికార్డును తానే బ్రేక్ చేసుకుని..
సహసాలు చేయాలని ఎవరికి ఉండదు. ఏదైనా సహసం చేసి ప్రపంచ రికార్డు పొందాలని అంతా కలలు కంటుంటారు. కాని.. నిజ జీవితంలో సహసాలు చేయడం అంతా ఆషామాషీ కాదు. ఒకవేళ నిజంగా..

Viral News: సాహసాలు చేయాలని ఎవరికి ఉండదు. ఏదైనా సహసం చేసి ప్రపంచ రికార్డు పొందాలని అంతా కలలు కంటుంటారు. కాని.. నిజ జీవితంలో సహసాలు చేయడం అంతా ఆషామాషీ కాదు. ఒకవేళ నిజంగా ఏదైనా సహసం చేస్తే తగిన గుర్తింపు తప్పకుండా వస్తుంది. కొంతమంది కష్టమని తెలిసినా.. ప్రమాదమని తెలిసినా సహసాలు చేసేందుకు వెనుకాడరు. సహస వీరులు ఒక సహసంతో ఆగరు. దానిని అలవాటుగా చేసుకుంటారు కొంతమంది. కొన్ని సందర్భాల్లో తమ రికార్డును మరెవరో బ్రేక్ చేయడం కొంతమంది సహసవీరులకు ఇష్టం ఉండదు. తమ రికార్డును తామే బ్రేక్ చేసుకోవాలనుకుంటారు. ఇలాంటివి చాలా అరుదుగా జరుగుతుంటాయి. ఇలా తన రికార్డును తానే బ్రేక్ చేసుకుని మరో సారి గిన్నిస్ బుక్ రికార్డుల్లో ఎక్కాడు అమెరికాకు చెందిన ఓ స్కై సర్ఫర్.
స్కై సర్ఫ్ అంటే హెలికాప్టర్ లో వెళ్లి గాల్లోకి వెళ్లిన తర్వాత.. ఆహెలికాప్టర్ లోంచి దూకి గిర గిరా తిరుగుతూ నేలపైకి రావడం ఇదో సహస క్రీడ.. ఏంటి బాబోయ్ ఇదేలా సాధ్యం అనుకుంటున్నారా.. సాధారణంగా సాధ్యం కాదు.. అందుకే దీనిని సహస క్రీడ అన్నారు. స్కైసర్ఫ్ ని సాధ్యం చేసిన సహసవీరులు ఎంతో మంది ఉన్నారు. ఈస్కై డ్రైవింగ్ లో కొంతసేపు ఊపిరి ఆడనట్టు అనిపించినా.. ఆతరువాత ఆకాశంలో స్వేచ్ఛగా విహరిస్తే వచ్చే థ్రిల్ చెప్పడం కంటే అనుభవిస్తే గాని తెలియదు. ఆకాశంలో తలికిందులుగా వేలాడుతూ.. హెలికాప్టర్ స్పిన్స్ కొట్టి గిన్నిస్ వరల్డ్ రికార్డు సాధించాడు అమెరికాకు చెందిన కీత్ కెబె.
నేల మీద ఓ 10 సార్లు గిరగిర తిరిగితే కళ్లు తిరుగుతున్నట్లు అనిపిస్తుంది. మరి ఆకాశంలో రివర్స్ రొటేట్ లో తిరగడం అంటే మామూలు విషయం కాదు. పోని ఒకటో, రెండో స్పిన్ లు కాదు. ఏకంగా 175 స్పిన్స్ తిరిగి తనకు తానే సాటి అని చాటాడు సహస వీరుడు కీత్ కెబె. వర్జీనియాలోని ఆరెంజ్ కౌంటీలో హెలికాప్టర్ నుంచి దూకి స్పిన్ చేస్తున్న వీడియోను గిన్నిస్ వరల్డ్ రికార్డు తన సోషల్ మీడియా అకౌంట్లలో రిలీజ్ చేసింది.ఈఏడాది జులై 4వ తేదీన ఈఫీట్ చేసిన కెబె 2021లో ఈజిప్ట్ లోని గిజాలో ఇలాంటి సహసం ఒకటి చేశాడు. అయితే అప్పుడు 165 స్పిన్స్ చేసిన కీత్ కెబె ఇప్పడు సింగిల్ జంప్ లో 175 స్పిన్స్ కంప్లీట్ చేసి తన రికార్డును తానే రికార్డు చేసుకున్నాడు. ఈవీడియో చూస్తున్న వారంతా ఆసహసవీరుడి ఫీట్లకు ఫిదా అవుతున్నారు.




మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం చూడండి..