Viral: దొంగతనాల్లో వీరి స్టైలే వేరయా..! ఏటీఎం చోరీకి ఏం చేశారో చూస్తే ఫ్యూజులౌట్..
Thieves use JCB to steal ATM machine: దేశమంతా బుల్‌డోజర్ పాలిటిక్స్ జోరుగా సాగుతున్న వేళ మహారాష్ట్రలో వింత సంఘటన జరిగింది. సాంగ్లీ నగరంలోని మిరాజ్ ప్రాంతంలో ఏటీఎంను

Thieves use JCB to steal ATM machine: దేశమంతా బుల్‌డోజర్ పాలిటిక్స్ జోరుగా సాగుతున్న వేళ మహారాష్ట్రలో వింత సంఘటన జరిగింది. సాంగ్లీ నగరంలోని మిరాజ్ ప్రాంతంలో ఏటీఎంను ఎత్తుకెళ్లడానికి ఏకండా బుల్‌డోజర్‌ను ఉపయోగించారు తెలివి మీరిన దొంగలు. అక్రమ నిర్మాణాల కూల్చివేతకు దేశవ్యాప్తంగా బీజేపీ పాలిత రాష్ట్రాల్లో బుల్‌డోజర్లను ఉపయోగిస్తున్నారు. కానీ మహారాష్ట్రలో దొంగలు మాత్రం ఏటీఎం ఎత్తుకెళ్లడానికి బుల్‌డోజర్‌ను ఉపయోగించడం సంచలనం రేపింది. బుల్‌డోజర్‌తో ఏటీఎంను ఎత్తుకెళ్లిన దృశ్యాలు సీసీటీవీలో రికార్డయ్యాయి. 21 లక్షల నగదును దొంగలు యాక్సిస్ బ్యాంక్ ఏటీఎం నుంచి ఎత్తుకెళ్లినట్టు పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తును చేపట్టారు.
సీసీటీవీ ఫుటేజీలో ఒక వ్యక్తి ఏటీఎంలోకి ప్రవేశించి వెంటనే బయటకు వెళ్లడం కనిపించింది. ఆ తర్వాత జేసీబీ సహాయంతో ఏటీఎం అద్దాలను ధ్వంసం చేసి.. ఏటీఎం మిషన్‌ను అపహరించారు. చోరీకి గురైన ఏటీఎం యాక్సిస్ బ్యాంక్‌కు చెందినదని మిరాజ్ గ్రామీణ పోలీస్ స్టేషన్ ఇన్‌స్పెక్టర్ చంద్రకాంత్ బేద్రే వెల్లడించారు. కాగా.. దొంగలు మొదట పెట్రోలు పంపు నుంచి జేసీబీని దొంగిలించారని, ఆ తర్వాత దాని ద్వారా ఏటీఎంను దొంగిలించారని పోలీసులు తెలిపారు.
దొంగలను పట్టుకునేందుకు సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తున్నారు. దీంతోపాటు రెండు బృందాలను ఏర్పాటు చేసి నిందితుల కోసం గాలిస్తున్నామని పోలీసులు వెల్లడించారు.
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Also Read: