Fire in Aeroplane: విమానంలో ప్రయాణిస్తుండగా.. ప్రయాణికుడి మొబైల్ నుంచి ఒక్కసారిగా పొగ, మంటలు..
ఆకాశంలో ప్రయాణిస్తున్న విమానంలో ఒక్కసారిగా కలకలం రేగింది. ఓ ప్రయాణికుడి మొబైల్ ఫోన్ నుంచి మంటలు చెలరేగాయి. దాంతో తోటి ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. వెంటనే స్పందించిన క్యాబిన్ సిబ్బంది అగ్నిమాపక యంత్రంతో మంటలను ఆర్పివేశారు.
ఆకాశంలో ప్రయాణిస్తున్న విమానంలో ఒక్కసారిగా కలకలం రేగింది. ఓ ప్రయాణికుడి మొబైల్ ఫోన్ నుంచి మంటలు చెలరేగాయి. దాంతో తోటి ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. వెంటనే స్పందించిన క్యాబిన్ సిబ్బంది అగ్నిమాపక యంత్రంతో మంటలను ఆర్పివేశారు. ఈ విషయాన్ని పౌర విమానయాన శాఖ డైరెక్టరేట్ జనరల్ వర్గాలు తెలిపాయి. ఈ ప్రమాదంలో ప్రయాణికులు, సిబ్బంది కూడా క్షేమంగా ఉన్నట్టు అధికార వర్గాలు వెల్లడించాయి. ఇండిగో సంస్థకు చెందిన 6ఈ 2037 విమానం అసోంలోని దిబ్రూగఢ్ నుంచి ఢిల్లీకి వెళుతుండగా గురువారం ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ప్రయాణికుడి ఫోన్ నుంచి మంటలు, పొగ రావడాన్ని గమనించిన విమాన సిబ్బందిలో ఒకరు వేగంగా స్పందించి అగ్నిమాపక యంత్రం సాయంతో ఆర్పివేయడంతో పెను ప్రమాదం తప్పింది. సదరు విమానం సురక్షితంగా ఢిల్లీ విమానాశ్రయంలో ల్యాండ్ అయింది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Elephant-Lion: అః.. కుక్క మొరిగితే కొండకు సేట.. ఏనుగుపై సింహం దాడి.. కట్‌చేస్తే.. సీన్ రివర్స్
Viral Video: అవ్వ..! పెళ్లిలో వరుడి స్నేహితుడి నిర్వాకం.. ఏం చేస్తున్నాడో మీరే చూడండి..
ఏపీ-ఒడిశా సరిహద్దులో కొత్త జలపాతం.. నెట్టింట వైరల్
2,400 ఏళ్ల చరిత్రకు సజీవ సాక్ష్యం!
యూట్యూబర్ మధుమితకు బిగ్ షాక్
బెంగళూరు బిజీ లైఫ్‌పై ఓ డాక్టర్ ఆసక్తికర పోస్ట్..
మనిషి శరీర భాగాలతో క్షుద్రపూజలు... సైకోలుగా మారుతున్న యువకులు
చీరకట్టుతో 1600 మీటర్లు పరుగు..
రెండో అంతస్తునుంచి పడిన బాలుడు.. అద్భుతంగా సేవ్ చేసిన యువకుడు

