Viral Video: వావ్.. వాట్ ఏ డేరింగ్.. సింహంతో సయ్యాటలు.. అలా ఎలా గురు..! అంటున్న నెటిజన్లు..
సింహం బోనులో ఉంటేనే దగ్గరికి వెళ్లి చూడటానికి భయపడతారు. కానీ, ఓ వ్యక్తి సింహాలు తనకేదో బెస్ట్ ఫ్రెండ్స్ అన్నట్టు వాటితో సయ్యాటలాడుతున్నాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. ఈ వీడియోలో ఓ వ్యక్తి అడవిలో సింహాలతో కలిసి సరదాగా ఆడుకుంటున్నాడు.
సింహం బోనులో ఉంటేనే దగ్గరికి వెళ్లి చూడటానికి భయపడతారు. కానీ, ఓ వ్యక్తి సింహాలు తనకేదో బెస్ట్ ఫ్రెండ్స్ అన్నట్టు వాటితో సయ్యాటలాడుతున్నాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. ఈ వీడియోలో ఓ వ్యక్తి అడవిలో సింహాలతో కలిసి సరదాగా ఆడుకుంటున్నాడు. అతను అడవిలో పరుగెత్తుతుంటే.. సింహాలు అతని వెంట పరుగెత్తుకుంటూ వచ్చి అతనిపై వాలిపోతున్నాయి… అతనితో సరదాగా ఆడుకుంటున్నాయి. దొంగా పోలీసు మాదిరిగా.. సింహాలు, ఆ వ్యక్తి రన్నింగ్ పోటీ పెట్టుకున్నారు. చివరకు సింహాలు అతన్ని పట్టుకుని, ఆడుకున్నాయి. అతన్ని నాలుకతో తడుముతూ తమ ప్రేమను చూపించాయి సింహాలు. ఆ సీన్ చూసి నెటిజన్లు షాక్ అవుతున్నారు. ఇంత ధైర్యం ఎలా వచ్చిందంటూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. సింహాలతో స్నేహం అదుర్స్ అంటూ మరికొందరు కామెంట్ పెట్టారు. ఈ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేయగా.. లక్షలమంది వీక్షిస్తున్నారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Viral Video: నడిరోడ్డుపై వీరనారి.. విశ్వరూపం చూపించేసిందిగా.. ఔరా.. అంటున్న నెటిజనం..
Viral Video: రోడ్డు దాటుతున్న బైక్ ను ఢీ కొట్టి.. ఆగకుండా ఈడ్చుకెళ్లి.. ఒళ్లు గగుర్పొడిచే వీడియో..