Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

విరాట్ కోహ్లి ఫేవరెట్ కార్న్ చాట్..! చాట్ ప్రేమికుల కోసం బెస్ట్ రెసిపీ..!

క్రికెట్ లో అద్భుతమైన ప్రదర్శన ఇచ్చే విరాట్ కోహ్లి తన ఫిట్ నెస్ విషయంలో కూడా అత్యంత శ్రద్ధ వహిస్తాడు. ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడంలో అతను ఎంతో కచ్చితంగా ఉంటాడు. విరాట్ కోహ్లీకి కార్న్ చాట్ అంటే చాలా ఇష్టం. ఇది తేలికగా రుచికరంగా ఉండటమే కాకుండా.. ఆరోగ్యానికి కూడా చాలా మంచిది.

విరాట్ కోహ్లి ఫేవరెట్ కార్న్ చాట్..! చాట్ ప్రేమికుల కోసం బెస్ట్ రెసిపీ..!
Virat Kohli Favorite Corn Chaat
Follow us
Prashanthi V

|

Updated on: Mar 23, 2025 | 7:53 PM

క్రికెట్ లోనే కాదు.. విరాట్ కోహ్లి ఫిట్ నెస్ పరంగా కూడా ఎంతో జాగ్రత్త వహిస్తాడు. అతని ఆహార అలవాట్లు చాలా మంది అభిమానులను ఆకర్షిస్తాయి. ఆయనకు ప్రత్యేకంగా ఇష్టమైన వంటకం కార్న్ చాట్. ఆరోగ్యానికి మేలు చేయడమే కాకుండా.. రుచిలోనూ అదుర్స్ అనిపించే ఈ స్నాక్ మీరు కూడా ట్రై చేయొచ్చు. అది ఎలానో ఇప్పుడు తెలుసుకుందాం.

కావాల్సిన పదార్థాలు

  • ఉడికించిన స్వీట్ కార్న్ – 1 కప్పు
  • చిన్న ఉల్లిపాయ – 1 (సన్నగా తరిగినది)
  • చిన్న టమోట – 1 (సన్నగా తరిగినది)
  • పచ్చిమిర్చి – 1 (సన్నగా తరిగినది)
  • నల్ల ఉప్పు – 1 టీస్పూన్
  • జీలకర్ర పొడి – 1/2 టీస్పూన్ (వేయించినది)
  • చాట్ మసాలా – 1/2 టీస్పూన్
  • నిమ్మరసం – 1 చెక్క
  • కొత్తిమీర – 1 టేబుల్ స్పూన్ (సన్నగా తరిగినది)
  • దానిమ్మ గింజలు – 1 టేబుల్ స్పూన్ (గార్నిషింగ్ కోసం)

తయారీ విధానం

మొదటగా స్వీట్ కార్న్ ని గిన్నెలో వేసి తగినన్ని నీరు పోసి ఉడకబెట్టాలి. 5-7 నిమిషాల పాటు మృదువుగా ఉడికాక నీటిని వంపేసి చల్లారనివ్వాలి. ఇప్పుడు ఒక గిన్నెలో ఉడికించిన స్వీట్ కార్న్ తీసుకుని.. సన్నగా తరిగిన ఉల్లిపాయ, టమోటా, పచ్చిమిర్చి వేసి బాగా కలపాలి. ఇవి కార్న్ కు రుచిని పెంచటానికి సహాయపడతాయి.

ఆ తర్వాత ఈ మిశ్రమానికి నల్ల ఉప్పు, వేయించిన జీలకర్ర పొడి, చాట్ మసాలా వేసి మొత్తం కలిసేలా బాగా కలపాలి. తరువాత కొత్తిమీరను జత చేసి చివరగా నిమ్మరసం పిండాలి. ఇప్పుడు దానిమ్మ గింజలతో గార్నిష్ చేయండి. ఇంతే సింపుల్.. ఇది ఒక్కసారి ట్రై చేసి చూడండి. మీరు వేడిగా తిన్నా.. లేక చల్లగా అయినాక తిన్నా రుచి మాత్రం అద్భుతంగా ఉంటుంది.