London Man: లాయర్ వింత ప్రవర్తన.. రక్తాన్ని ఫుడ్‌లో ఇంజెక్ట్ చేసి, సిరంజీలతో దాడి..
London Man: ఒక్కోసారి కొందరు వ్యక్తులు వింతగా.. పైశాచికంగా ప్రవర్తిస్తుంటారు. ఇలా ప్రవర్తించడానికి చదువు, ఉద్యోగం, ఉన్నత పదవులు ఏవీ అడ్డుకావు. ఇలా వీరు ఎందుకు చేస్తారో ఎంత ఆలోచించినా అర్ధం కాదు..
London Man: ఒక్కోసారి కొందరు వ్యక్తులు వింతగా.. పైశాచికంగా ప్రవర్తిస్తుంటారు. ఇలా ప్రవర్తించడానికి చదువు, ఉద్యోగం, ఉన్నత పదవులు ఏవీ అడ్డుకావు. ఇలా వీరు ఎందుకు చేస్తారో ఎంత ఆలోచించినా అర్ధం కాదు.. ఇలాంటి దారుణ ఘటన గురించి ఇప్పటికే అనేకం విన్నాం.. తాజాగా ఓ లాయర్(Lawyer) చాలా దారుణంగా ప్రవర్తిస్తూ… దుశ్చర్యలకు పాల్పడ్డాడు. పలు దుకాణాల్లో ఆహార పదార్ధాల ప్యాకెట్లకు సిరెంజ్‌లతో రక్తాన్ని ఇంజెక్ట్ చేశాడు(Injects Blood Into Supermarket Food). దాంతో ఆ సూపర్ మార్కెట్ల యజమానులు కోట్లలో నష్టపోయారు. ఈ ఘటన గ్రేట్ బ్రిటన్ లో ముఖ్య నగరంలో జరిగింది.. లండన్‌కి చెందిన ఓ వ్యక్తి సూపర్ మార్కెట్లకు వెళ్లి అక్కడి ఆహార పదార్థాల్లోకి తన రక్తాన్ని ఇంజెక్ట్ చేశాడు. అలా ఒకటి రెండు కాదు ఏకంగా మూడు సూపర్ మార్కెట్‌లలోని ఆహార పదార్థాల్లోకి రక్తాన్ని ఇంజెక్ట్ చేశాడు. అదంతా అక్కడి సీసీటీవీలో రికార్డు అయ్యింది.
తమ షాపులోని ఆహారపదార్ధాల్లో జరిగిన కల్తీని గుర్తించిన షాపు యాజమాన్యం వెంటనే చర్యలు తీసుకున్నారు. తమ కస్టమర్‌లను పంపించేసి షాపులోని ఆహార పదార్థాలన్నింటిని పడేశారు.ఇలా ఆహార పదార్ధాల్లో రక్తాన్ని ఇంజెక్ట్ చేస్తున్న వ్యక్తిని పట్టుకోడానికి ప్రయత్నించి సెక్యూరిటీ గార్డ్‌పై రక్తం నింపిన సిరెంజ్‌లతో దాడికి తెగబడ్డాడు. రంగంలోకి దిగిన పోలీసులు నిందుతుడు ఒక న్యాయవాది అని, స్వంతంగా అతనికి ఓ లీగల్ కన్సల్టెన్సీ కూడా ఉందని గుర్తించారు. కాగా అతడు వెళ్లిన సూపర్ మార్కెట్ల సీసీ పుటేజ్‌లు పరిశీలించారు పోలీసులు. అందులో ఆపిల్‌లు, చికెన్ టిక్కా ఫిల్లెట్‌ల ప్యాకెట్‌లకు అతను రక్తాన్ని ఇంజెక్ట్ చేసినట్లు తెలిసింది. అంతేకాదు విచారణలో అవన్నీ 37 ఏళ్ల క్రితం నాటి ఆహారంగా చూపించడంతో పోలీసులు ఆశ్చర్యపోయారు. ఈ వింత కేసును విచారించిన లండన్ కోర్టు సదరు వ్యక్తి నేరం చేస్తున్నప్పుడు అతని మానసిక పరిస్థితిపై నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. అయితే నిందితుడి తరపు న్యాయవాదులు, సైక్రియార్టిస్ట్ కూడా అతని మానసిక పరిస్థితి బాగోలేదని, అతను ఉద్దేశపూర్వకంగా ఈ పని చేయలేదని చెబుతున్నారు.
Also Read: అమెరికాలో అత్యున్నత పదవిని అందుకున్న మరో భారతీయ వైద్యురాలు.. దేవిక భూషణ్