Viral Video: రైల్వే ట్రాక్‌ క్రాస్ చేస్తోన్న ఆవు.. లోకో పైలట్ చేసిన పనికి హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే..!

రైల్వే ట్రాక్‌పై దూసుకొస్తున్న రైలుకు ఎదురుగా వెళ్లడం అంటే ఇక ప్రాణాలు గాల్లో కలిసిపోయినట్టే. అందుకే రైల్వే ట్రాక్‌లపై జనం సంచరించకుండా తీవ్రమైన ఆంక్షలు అమలులో ఉన్నాయి. అయితే తరచూ కొందరు పొరబాటున రైల్వే ట్రాక్ దాటుతూ ప్రమాదవశాత్తు మరణిస్తున్న ఘటనలు నిత్యం జరుగుతూనే ఉన్నాయి.

Viral Video: రైల్వే ట్రాక్‌ క్రాస్ చేస్తోన్న ఆవు.. లోకో పైలట్ చేసిన పనికి హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే..!
Cow Crossing Railway Track
Follow us
Janardhan Veluru

|

Updated on: Sep 07, 2024 | 10:04 PM

రైల్వే ట్రాక్‌పై దూసుకొస్తున్న రైలుకు ఎదురుగా వెళ్లడం అంటే ఇక ప్రాణాలు గాల్లో కలిసిపోయినట్టే. అందుకే రైల్వే ట్రాక్‌లపై జనం సంచరించకుండా తీవ్రమైన ఆంక్షలు అమలులో ఉన్నాయి. అయితే తరచూ కొందరు పొరబాటున రైల్వే ట్రాక్ దాటుతూ ప్రమాదవశాత్తు మరణిస్తున్న ఘటనలు నిత్యం జరుగుతూనే ఉన్నాయి. మరీ ముఖ్యంగా మూగజీవాలు రైల్వే ట్రాక్ దాటుతూ బలవుతున్న ఘటనలు చాలా జరుగుతున్నాయి. ట్రాక్‌పై జంతువులు కనిపిస్తే అది బతకడం కేవలం లోకో పైలట్ దాయాదాక్షణ్యాలపైనే ఆధారపడి ఉంటుంది.

రైలు లోపల పైలట్ క్యాబిన్ నుండి తీసిన ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. రైల్వే ట్రాక్‌పై ఆవు కనిపించగా లోకో పైలట్ మానవత్వాన్ని చాటుకున్నాడు. ఇది గమనించిన లోకో పైలట్ వెంటనే రైలు వేగాన్ని తగ్గించాడు. ఓ ఆవు ట్రాక్ దాటిగా.. కొన్ని మీటర్ల దూరంలోనే మరో ఆవు ట్రాక్‌పైన కనిపించింది. పైలట్ హారన్ కొట్టినా ఫలతంలేక పోయింది. దీంతో పైలట్ రైలును ఆపేశాడు. మనుషుల కోసం అయితే సరేకానీ.. ఇలా జంతువుల కోసం రైలును ఆపిన సంఘటనలు చాలా ఆరుదుగానే కనిపిస్తాయి. అందుకే ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోను ఇప్పటి వరకు 12 లక్షల కంటే ఎక్కువసార్లు వీక్షించారు. 6 వేల మందికి పైగా లైక్ చేశారు.

రైల్వే ట్రాక్ పైకి ఆవురావడంతో రైలు ఆపిన లోకో పైలట్.. వీడియో చూడండి

ఆవు ప్రాణాలు కాపాడేందుకు రైలును ఆపిన లోకో పైలట్‌ మానవత్వం, సమయస్ఫూర్తిని నెటిజన్లు మెచ్చుకుంటున్నారు. మూగ జీవి ప్రాణాలు నిలబెట్టిన పైలట్ అన్నా నీకు సెల్యూట్ అంటూ కొందరు నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఇలాంటి వ్యక్తులను చూస్తేనే మానవత్వం ఇంకా మిగిలి ఉందన్న నమ్మకం కలుగుతోందంటూ మరో నెటిజన్ కామెంట్ చేశారు. ఆవును రక్షించడంలో లోకో పైలట్ ఎంతో మానతవ్వాన్ని చూపారంటూ మరో నెటిజన్ కొనియాడారు.