Viral Video: స్కూల్ కు డ్యాన్స్ చేసుకుంటూ వెళ్తోన్న బాలిక.. లిటిల్ బేబీ ఎక్స్‌ప్రెషన్స్ కి నెటిజన్లు ఫిదా..
స్కూలుకు వెళ్లేందుకు బయలుదేరిన ఆ చిన్నారి ఇంటినుంచి బయటకు రాగానే డాన్స్ చేయడం మొదలు పెట్టింది. ఆ లిటిల్ బేబీ 'సైయన్ దిల్ మే ఆనా రే' పాట రీమిక్స్ వెర్షన్‌కి డాన్స్ చేసింది. ఎంతో అద్భుతంగా స్టెప్స్ వేసిన ఆ బాలిక అంతే అద్భతంగా ఎక్స్‌ప్రెషన్స్ ఇచ్చింది.

ప్రస్తుతం సోషల్‌మీడియా యుగంలో ఎందరెందరో తమ ట్యాలెంట్‌ను నెట్టింట ప్రదర్శిస్తూ పాపులర్ అవుతున్నారు. ఈ సోషల్ మీడియా రాత్రికి రాత్రి పలువురిని సెలబ్రిటీలుగా మార్చేసింది. తాజాగా ఓ చిన్నారి సెలబ్రిటీ తన డాన్స్‌తో నెటిజన్లను ఆకట్టుకుంటోంది. ఆ బాలిక క్యూట్ క్యూట్ ఎక్స్‌ప్రెషన్స్‌కి నెటిజన్లు ఫిదా అయిపోతున్నారు.
వైరల్ అవుతున్న ఈ వీడియోలో ఆధ్యాయశ్రీ అనే చిన్నారి స్కూలుకు వెళ్తోంది. తెల్లని స్కూల్ యూనిఫాంమీద రెడ్‌కలర్ స్వెట్టర్ వేసుకొని ఎంతో ముద్దుగా ఉంది. స్కూలుకు వెళ్లేందుకు బయలుదేరిన ఆ చిన్నారి ఇంటినుంచి బయటకు రాగానే డాన్స్ చేయడం మొదలు పెట్టింది. ఆ లిటిల్ బేబీ ‘సైయన్ దిల్ మే ఆనా రే’ పాట రీమిక్స్ వెర్షన్‌కి డాన్స్ చేసింది. ఎంతో అద్భుతంగా స్టెప్స్ వేసిన ఆ బాలిక అంతే అద్భతంగా ఎక్స్‌ప్రెషన్స్ ఇచ్చింది. ఆ చిన్నారి చేసిన క్యూట్ యాక్టింగ్‌చూసి నెటిజన్లు తెగ ముచ్చటపడిపోతున్నారు. మరో విశేషమేంటంటే.. ఈ చిన్నారి ఓ డ్యాన్సింగ్ రియాలిటీ షోలో రన్నరప్‌గా నిలిచిందట. ఆ విషయం ఆమె ప్రొఫైల్ చూస్తే తెలుస్తోంది.




View this post on Instagram
కాగా ఈ వీడియోను ఆధ్యాయశ్రీ తనే స్వయంగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేసింది. కాగా ఈ వీడియోను 8 లక్షలమందికి పైగా వీక్షించారు. అనేకమంది వీడియోను లైక్ చేస్తూ చిన్నారి ట్యాలెంట్ మెచ్చుకుంటూ ప్రశంసల కామెంట్లు కురిపించారు.
మరిన్ని వైరల్ వీడియో వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..