Viral Video: అమ్మ కోసం బుడ్డోడు చేసిన బరువైన సాహసం.. మాటల్లేవ్.. వీడియో చూడాల్సిందే..
తల్లీబిడ్డల అనుబంధం చాలా గొప్పది. అది మనుషులకైనా.. జంతువులకైనా ఒకే విధంగా ఉంటుంది. పిల్లలకు కష్టం వస్తే ఏ తల్లీ తట్టుకోలేదు. వారిని ప్రమాదం నుంచి బయటపడేసేంత వరకు కుదుటపడరు. కొన్ని సార్లు...

తల్లీబిడ్డల అనుబంధం చాలా గొప్పది. అది మనుషులకైనా.. జంతువులకైనా ఒకే విధంగా ఉంటుంది. పిల్లలకు కష్టం వస్తే ఏ తల్లీ తట్టుకోలేదు. వారిని ప్రమాదం నుంచి బయటపడేసేంత వరకు కుదుటపడరు. కొన్ని సార్లు అందుకోసం ప్రాణాలనూ పణంగా పెడుతుంటారు. అందుకే ఓ సినిమాలో వచ్చిన.. తల్లిని మించిన యోధురాలు ఎవ్వరూ లేరు.. అనే డైలాగ్ చాలా ఫేమస్ అయింది. నిజమే మరి.. నవమాసాలు మోసి, కని, పెంచి పెద్ద చేసిన పిల్లలకు కష్టం వస్తే ఆ తల్లి మనసు ఊరుకుంటుందా. అందుకే అవసరమైతే అవరకాళిలా మారుతుంది. ప్రేమను పంచే దేవతామూర్తిగానూ మారుతుంది. అలాగే పిల్లలు కూడా వారి తల్లిదండ్రుల పట్ల అలాంటి ప్రేమనే కలిగి ఉంటారు. వారు కష్టాల్లో ఉంటే చూడలేరు. వారికి ఇబ్బంది కలగకుండా ఉండేందుకు ప్రయత్నిస్తుంటారు. కాబట్టి తల్లిదండ్రులు, పిల్లల మధ్య ప్రేమ చాలా మధురంగా ఉంటుంది.. ఇదంతా ఇప్పుడెందుకంటే.. ప్రస్తుతం వైరల్ అవుతున్న ఓ వీడియో ఇలాంటిదే.
వైరల్ అవుతున్న ఈ వీడియోలో ఓ మహిళ తన కుమారిడితో కలిసి ఉండటాన్ని చూడవచ్చు. ఆమె ఓ నిచ్చెన సహాయంతో ఇంటి పైన ఏవో వస్తువులను సర్దుతోంది. అదే సమయంలో ఆకస్మాత్తుగా నిచ్చెన కింద పడిపోతుంది. దీంతో ఆమె పైనున్న ఆధారాన్ని పట్టుకుని గాల్లోనే వేలాడుతుంటుంది. వెంటనే అలర్ట్ అయిన ఆ చిన్నారిర తన తల్లిని ఆ ప్రమాదం నుంచి బయటపడేసేందుకు శాయశక్తులా ప్రయత్నిస్తాడు. తన శక్తి చాలకున్నా.. శక్తికి మించి నిచ్చెనను పైకి లేపుతాడు. తన తల్లిని ప్రమాదం నుంచి కాపాడతాడు.




ప్రముఖ సోషల్ మీడియా మాధ్యమం ఇన్ స్టా గ్రామ్ లో ఈ వీడియో పోస్ట్ అయింది. ఇప్పటి వరకు లక్షల సంఖ్యలో వ్యూస్, వేల సంఖ్యలో లైక్స్ వస్తున్నాయి. అంతే కాకుండా వీడియో చూసిన తర్వాత నెటిజన్లు తమ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో రాస్తున్నారు.
View this post on Instagram
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి