Viral Video: చిన్నారిని బెదిరించి మరీ చదువు చెబుతున్న తల్లి.. ఇది సరికాదంటూ అభ్యంతరం వ్యక్తం చేస్తోన్న నెటిజన్లు..

అంతేకాదు బాలుడు కళ్ళు కన్నీటితో నిండిపోయాయి. ఏదైనా తప్పు చేస్తే అమ్మ కొడుతుందేమోనని పదే పదే భయపడుతున్నాడు. ఒక చోట కొడుకు ఏడుస్తూ తల్లిని తన సందేహం అడగడం కూడా వీడియోలో చూడవచ్చు.

Viral Video: చిన్నారిని బెదిరించి మరీ చదువు చెబుతున్న తల్లి.. ఇది సరికాదంటూ అభ్యంతరం వ్యక్తం చేస్తోన్న నెటిజన్లు..
Kid Video Viral
Follow us
Surya Kala

|

Updated on: Dec 22, 2022 | 9:38 PM

ప్రస్తుతం అన్నింటా పోటీనే.. ఈ పోటీ ప్రపంచంలో వయసుతో సంబంధం లేకుండా పోటీ .పడాల్సిందే. చదువుకునే పిల్లలు ర్యాంకుల కోసం అయితే.. చదువు పూర్తీ అయ్యాక ఉద్యోగం కోసం ఇలా రోజూ కాలంతో పోటీ పడుతూ పరుగులు తీస్తూ జీవించాల్సిందే. ఈ నేపథ్యంలో ఒక తల్లి తన చిన్నారి తనయుడికి చదువు చెబుతోంది. అయితే ఆ బాలుడు ఏడుస్తూ చదువుకోవడంతో ఇప్పుడు ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.  అయితే ఈ క్లిప్‌ని చూసిన జనాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తల్లి.. చిన్నారికి బోధించిన తీరుపై నెటిజన్లు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు . పిల్లవాడికి కోపంతో కాకుండా ప్రేమతో వివరించి నేర్పించాలని సూచిస్తున్నారు. ఇప్పుడు బాలుడిది ఆదుకునే వయసు.. అయితే హోమ్ రాస్తున్న సమయంలో తప్పు చేస్తే.. తల్లి కొట్టడంతో ఆ పిల్లవాడు చాలా కంగారు పడినట్లు వీడియోలో చూడవచ్చు.

వైరల్ అవుతున్న వీడియోలో..  పిల్లవాడిని తల్లి చదివిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే 1 నుండి 10 వరకు అంకెలు రాస్తున్న సమయంలో తన తల్లి కొట్టినందుకు చాలా భయపడ్డాడు ఆ బాలుడు. అంతేకాదు బాలుడు కళ్ళు కన్నీటితో నిండిపోయాయి. ఏదైనా తప్పు చేస్తే అమ్మ కొడుతుందేమోనని పదే పదే భయపడుతున్నాడు. ఒక చోట కొడుకు ఏడుస్తూ తల్లిని తన సందేహం అడగడం కూడా వీడియోలో చూడవచ్చు. అయితే తర్వాత చాలా ప్రేమతో తన తల్లిని  దగ్గరకు తీసుకుని నుదిటిపై ముద్దు పెట్టుకున్నాడు ఆ  చిన్నారి బాబాలుడు . బహుశా తల్లి కరిగిపోవాలి అనే ఆలోచనతో.. దీంతో ఆ మహిళ- ‘ఎందుకు ఏడుస్తున్నావు… అంటూ కన్నీళ్లు తుడవడం కనిపిస్తుంది.

ఇవి కూడా చదవండి

మినీ చందన్ ద్వివేది అనే వినియోగదారుడు ఈ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. వీడియో రాసే సమయానికి, వీడియోను 60 లక్షల మంది చూశారు. 4 లక్షల మందికి పైగా లైక్ చేసారు.

అయితే ఎక్కువమంది తల్లి బెదిరిస్తూ చదువు చెప్పడం పై అభ్యంతరం వ్యక్తం చేశారు. తల్లిదండ్రులు ఇలాంటి వీడియోలు చిత్రీకరించడం తప్పన్నారు. ‘ అదే సమయంలో ‘పిల్లవాడు భయపడుతున్నాడు. మీరు అతనిలో ఎందుకు అంత భయాన్ని సృష్టించారు? అతనికి ప్రేమతో కూడా వివరించవచ్చు అని అంటున్నారు. పిల్లవాడికి నేర్పించే మార్గం మాత్రం ఇది కాదంటూ రకరకాల కామెంట్‌ చేస్తున్నారు.

మరిన్ని ట్రెండింగ్ వీడియో వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..