Viral video: ఈ బుడ్డోడిని ఒలింపిక్స్ కు రెడీ చేయండి.. నెట్టింట్లో వైరలవుతోన్న చిన్నారి వీడియో..

చిన్న పిల్లలు (Kids) ఉంటే ఇల్లంతా సందడి సందడిగా ఉంటుంది.  బుడిబుడి అడుగులు వేస్తూ వారు చేసే చిలిపి పనులు చూస్తుంటే అసలు సమయమే తెలియదు. ఈక్రమంలో  తమ పిల్లలకు సంబంధించిన ఫొటోలు, వీడియోలను అప్పుడప్పుడు సోషల్ మీడియాలో (Social media) పోస్ట్ చేస్తుంటారు.

Viral video: ఈ బుడ్డోడిని ఒలింపిక్స్ కు రెడీ చేయండి.. నెట్టింట్లో వైరలవుతోన్న చిన్నారి వీడియో..
Follow us
Basha Shek

|

Updated on: Jan 31, 2022 | 8:48 AM

చిన్న పిల్లలు (Kids) ఉంటే ఇల్లంతా సందడి సందడిగా ఉంటుంది.  బుడిబుడి అడుగులు వేస్తూ వారు చేసే చిలిపి పనులు చూస్తుంటే అసలు సమయమే తెలియదు. ఈక్రమంలో  తమ పిల్లలకు సంబంధించిన ఫొటోలు, వీడియోలను అప్పుడప్పుడు సోషల్ మీడియాలో (Social media) పోస్ట్ చేస్తుంటారు. అవి ఒక్కొక్కసారి వైరలవుతుంటాయి. అలా తాజాగా ఒక వీడియో (Viral video) కూడా నెట్టింట్లో తెగ హల్ చల్ చేస్తోంది. సాధారణంగా పల్లెలు, గ్రామాల్లో చెక్క లేదా ఇనుప నిచ్చెనలు (ladder) ఉంటాయి.  ఇంటిపైకి చేరుకోవాలంటే ఇప్పటికీ చాలామంది వాటినే ఉపయోగిస్తారు. అయితే వీటిని ఉపయోగించేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి.  ఒక్కో మెట్టుపై జాగ్రత్తగా కాలుపెట్టి దిగుతారు.  అయితే ఇక్కడ ఓ బుడ్డోడు మాత్రం నిచ్చెనపై జారుకుంటూ వేగంగా కిందకు వచ్చాడు. నియంత్రణ కోల్పోకుండా ఉండేందుకు చేతుల ద్వారా మెట్లను పట్టుకుంటూ కిందకు దిగాడు.  సుమారు 15కు పైగా మెట్లున్న ఆ చెక్కనిచ్చెనను ఆ పిల్లాడు క్షణాల్లో దిగేశాడు.  అయితే ఆ వీడియో చూస్తున్న వారికి మాత్రం ఆ చిన్నారి ఎక్కడ కింద పడతాడోనన్న భయం మాత్రం కలుగుతుంది.  అదృష్టవశాత్తూ ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.  అయితే ఇది ఎక్కడ జరిగిందో తెలియదు కానీ సోషల్ మీడియాలో మాత్రం తెగ వైరల్ గా మారింది.

బాగుంది .. కానీ

కాగా ఈ వీడియోను ghantaa అనే ఇన్​స్టా పేజీ లో షేర్ అయింది.  ఇక  ఆ బుడ్డోడిని ఒలింపిక్సక్​కు రెడీ చేయండంటూ ఓ ఫన్నీ క్యాప్షన్ ను కూడా జోడించారు.  ఈ వీడియో చూసిన నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు. కొందరు ఈ చిన్నారి సాహసాన్ని మెచ్చుకుంటున్నారు. ‘గ్రేట్’, ‘మనకిక రోబోలు అవసరం లేదు’ అంటూ కామెంట్లు పెడుతున్నారు.  మరికొందరు మాత్రం  ఆ చిన్న కుర్రాడు అలా కిందకు దిగడం ప్రమాదకరమంటూ హెచ్చరిస్తున్నారు. పసి పిల్లల విషయంలో తల్లిడండ్రులు అత్యంత జాగ్రత్తగా ఉండాలి అంటూ సలహాలు ఇస్తున్నారు.  మొత్తానికి ఈ వీడియో మాత్రం నెటిజన్లను బాగా అలరిస్తోంది. మరి మీరు కూడా ఈ వీడియోపై ఓ లుక్కేయండి.

Also Read: Arya- Sayyeshaa: టైటానిక్ ఫోజులో రొమాంటిక్ కపుల్.. నెట్టింట్లో వైరల్ గా మారిన ఫొటో..

30 weds 21: మళ్లీ అలరించేందుకు సిద్ధమైన 30 వెడ్స్ 21.. రెండో సీజన్ కు రంగం సిద్ధం..

Jobs In Hyderabad: పీజీ అర్హతతో ఐకార్‌లో యంగ్‌ప్రొఫెషనల్ పోస్టులు.. ఇంటర్వ్యూతోనే ఎంపికలు!