Viral Video: ఓ వైపు సింగిల్ గా ఏనుగు.. మరోవైపు 20 సింహాలు.. అడవికి రాజెవరో తేలిపోయిందిగా..
అడవికి రాజు అనగానే మనకు గుర్తొచ్చే జంతువు సింహం. సింహం కనిపించిందంటే చాలు జంతువులన్ని పరుగులు పెడతాయి. ఒక్క సింహాన్ని చూసే ఆవి ఇంత భయపడితే ..ఆదే 20 సింహాలున్న గుంపును చూస్తే ఇంకేమైనా ఉందా..మరొసారి ఆ చుట్టుపక్కలకు కూడా వెళ్లాలనుకోవు. కానీ ఇక్కడ జరిగిన సన్నవేశం చూస్తే మీరు మీ అభిప్రాయాన్ని కచ్చితంగా మార్చుకుంటారు.

ఇక్కడ క్లిక్ చేసి ఒక్కసారి ఈ వీడియో చూడండి….
అడవిలో ఒక ఏనుగు ఒంటరిగా వెళ్తూ ఉంటుంది. అలా వెళ్తూ ఉన్న ఏనుగుకు..20 సింహాల గుంపు ఎదురవుతుంది. ఏనుగు ఒక్కటే ఉంది.. అటు వైపు ఇరవై సింహాలు ఉన్నాయి. అయినా ఆ ఏనుగు అదరలేదు బెదరలేదు..గుండెల నిండా ఆత్మస్థైర్యంతో సింహాల సమూహంపై పైకి దూసుకెళ్లింది. ఏనుగు రాకను చూసిన ఆ 20 సింహాల గుంపు ఒక్కసారిగా బెదిరిపోయింది. ఏనుగపై దాడి చేయకుండా అక్కడి నుంచి పారిపోయింది. అవతల ఉన్న సింహాలు అడవికి రాజులైనా సరే.. ఆ ఏనుగు మనోధైర్యం ముందు నిలవలేకపోయాయి. ఆ ఏనుగును చూసి తిరిగి చూడకుండా పారిపోయాయి. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మన ఎదుట ఉన్నవారు ఎంతటివారైన సరే..మనలో మనోధైర్యం ఉంటే ఏదైనా చేయగలం అని వీడియో చూసిన నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.
సాధారణంగా ఏదైనా జంతువులు కనిపిస్తే సింహాలు వెనకడుగు వేయవు.. దాన్ని వేటాడి తినాలి అనుకుంటాయి. ముఖ్యంగా ఇవి సమూహంగా ఉన్నప్పుడు చాలా శక్తి వంతంగా ఉంటాయట. కానీ ఏనుగు వంటి జంతువులు ఒంటరిగా ఉన్నప్పటికీ, దాని భారీ శరీరం, బలమైన తొండం, పొడవైన కొమ్ములు సింహాలకు ప్రమాదకరంగా కనిపిస్తాయట. అయితే వేటలో గాయాలు అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటే సింహాలు దాడి చేయకుండా వెనక్కి తగ్గుతాయట. ఒక ఏనుగు భయపెట్టే విధంగా చెవులు ఆడించి, తొండం ఊపుతూ, దాడి చేసే సూచనలు చూపితే, సింహాలు దాన్ని గంభీరంగా తీసుకొని వెనక్కి పోతాయని పై వీడియోని చూస్తే అర్థం అవుతంది.
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…