Viral Video: పిల్లి కాదురా సింగం.! నీ ధైర్యానికి ఓ దండం.. చిన్న కర్రతో మృగరాజును బెదిరించేశాడుగా..

'పందులే గుంపులుగా వస్తాయి.. సింహం ఎప్పుడూ సింగిలే' ఈ డైలాగ్ సినిమాలోనిదైనా.. మృగరాజుకి ఇది యాప్ట్ అని చెప్పాలి.

Viral Video: పిల్లి కాదురా సింగం.! నీ ధైర్యానికి ఓ దండం.. చిన్న కర్రతో మృగరాజును బెదిరించేశాడుగా..
Lion
Follow us
Ravi Kiran

|

Updated on: Sep 14, 2022 | 9:27 PM

‘పందులే గుంపులుగా వస్తాయి.. సింహం ఎప్పుడూ సింగిలే’ ఈ డైలాగ్ సినిమాలోనిదైనా.. మృగరాజుకి ఇది యాప్ట్ అని చెప్పాలి. బోనులో ఉన్నా.. బయట ఉన్నా.. సింహం సింహమే.. దాని గర్జనకు ఏ జంతువైనా బెదిరిపోవాల్సిందే.. ఎంత పెద్ద జంతువునైనా సింహం ఇట్టే మట్టికరిపిస్తుంది. అంతటి బలశాలి అయిన సింహాన్ని ఇక్కడొక వ్యక్తి.. పిల్లిలా మార్చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది.

వైరల్ వీడియోలో ఓ వ్యక్తి.. చిన్న కర్రతో సింహాన్ని బెదిరిస్తున్నట్లు మీరు చూడవచ్చు. ఇక మృగరాజు ఏమో.. తాను అడవికి రారాజు అని మర్చిపోయినట్లు ఉంది. పిల్లి మాదిరిగా ఆ కర్రకు భయపడి.. వెనక్కి జంకుతోంది. అంతేకాదు అక్కడ నుంచి పరుగులు పెడుతోంది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. లేట్ ఎందుకు మీరూ ఓసారి చూసేయండి. కాగా, ఈ వీడియో చూసిన నెటిజన్లు వరుసపెట్టి కామెంట్స్‌తో హోరెత్తిస్తున్నారు. దీనికి కోట్లలో వ్యూస్ వచ్చిపడగా.. 10 లక్షలకు పైగా లైకులు వచ్చాయి.

View this post on Instagram

A post shared by LIONS KING (@lions.saven)