AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: సింహం భయపడటం ఎప్పుడైనా చూశారా?.. చెట్టును పట్టుకుని ఎలా విలపించిందో ఓసారి చూడండి..

Viral Video: అడవికి రాజు ఎవరు అని అడిగితే టక్కున సింహం అని చెబుతారు అందరు. ఎందుకంటే.. సింహం అంత బలమైన జంతువు, క్రూరమైన జంతువు అడవిలో మరోటి లేదు కాబట్టి.

Viral Video: సింహం భయపడటం ఎప్పుడైనా చూశారా?.. చెట్టును పట్టుకుని ఎలా విలపించిందో ఓసారి చూడండి..
Lion
Shiva Prajapati
|

Updated on: Feb 25, 2022 | 6:30 AM

Share

Viral Video: అడవికి రాజు ఎవరు అని అడిగితే టక్కున సింహం అని చెబుతారు అందరు. ఎందుకంటే.. సింహం అంత బలమైన జంతువు, క్రూరమైన జంతువు అడవిలో మరోటి లేదు కాబట్టి. సింహం వేటాడితే అవతి జంతువుకు అదే చివరి రోజు అని ఫిక్స్. అందుకే.. సింహం అలజడి కనిపిస్తే చాలు మిగతా జంతువులు ప్రాణ భయంతో పరుగులు తీస్తాయి. అయితే, ఇతర జంతువులను ఇంతలా భయపెట్టించే మృగరాజే.. ఇప్పుడు గజగజా వణికి పోయాడు. అడవి దున్నల మంద ఇచ్చిన షాక్‌కు చెట్టుని పట్టుకుని వేలాడుతూ బేరుమన్నాడు. రక్షించండి అన్నట్లుగా ధీనంగా గర్జిస్తూ దిక్కులు చూశాడు. అవును.. అన్ని జంతువులను భయపెట్టించే మృగరాజునే గజగజ వణికించాయి అడవి దున్నలు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

ఈ వైరల్ వీడియోలో విశాలమైన అడవిలో అడవి దున్నలు ప్రశాంతంగా మేత మేస్తున్నాయి. ఇంతలో ఆకలిమీదున్న సింహం అటుగా వచ్చింది. సాధారణంగా అయితే.. దున్నలు భయంతో పరుగెత్తుతాయి. కానీ, ఇక్కడ సీన్ రివర్స్ అయ్యింది. దున్నలన్నీ ఏకమయ్యాయి. మృగరాజుకు ముచ్చెమటలు పట్టించాయి. దాడి చేయడానికి వచ్చిన సింహంపై ఎదురు దాడి చేశాయి. ఈ ఊహించని ప్రతిఘటనతో బెంబేలెత్తిపోయిన సింహం.. పీచేముడ్ అంటూ వెనక్కి పరుగెత్తింది. ప్రాణభయంతో ఓ చెట్టు ఎక్కేందుకు ప్రయత్నించింది. అయితే, పూర్తిగా చెట్టుపైకి ఎక్కరాలేదు. కిందకు దిగితే దున్నల మంద కుమ్మేస్తందుకు రెడీగా ఉంది. దాంతో ఆ సింహం గజగజ వణికిపోయింది. చెట్టుని గట్టిగా పట్టుకుని మధ్యలోనే ఉండిపోయింది. ధీనంగా గర్జిస్తూ.. వణికిపోయింది. ఈ వీడియోను వైల్డ్ యూనివర్స్‌ ఇన్‌స్టాగ్రమ్ అకౌంట్‌లో పోస్ట్ చేయగా.. అది కాస్తా వైరల్‌గా మారింది. మృగరాజు అవస్థను, భయపడుతున్న విధానాన్ని చూసి నెటిజన్లు షాక్ అవుతున్నారు. పాపం మృగరాజు అంటూ సింపతీ తెలుపుతున్నారు. భయపట్టే సింహాన్నే గడగడలాడించిన అడవి దున్నల యూనిటీకి సెల్యూట్ చేస్తున్నారు.

Also read:

Viral Video: రైనో, అడవి దున్న మధ్య భీకర యుద్ధం.. వీడియో చూస్తే గుండెలదిరిపోవాల్సిందే..

Health Tips: ఆస్తమాతో ఇబ్బంది పడుతున్నారా.. అయితే, ఈ ఆహారాలను దూరం పెట్టండి..!

Kushboo Sundar: స్క్రిప్ట్ న‌చ్చితే కొత్త‌వారితో సినిమా చేయ‌డానికి నేను ఎప్పుడూ రెడీ : కుష్బూ