Viral Video: చెట్టుపై కనిపించిన నల్లటి ఆకారం.. దెబ్బకు బెదిరిపోయిన కుక్కలు.. సీన్ కట్ చేస్తే!

అర్ధరాత్రి వేళ చెట్టు కింద నిద్రపోతున్న రెండు వీధి కుక్కలకు అలికిడి వినిపించింది. ఏంటా అని చూడగా..

Viral Video: చెట్టుపై కనిపించిన నల్లటి ఆకారం..  దెబ్బకు బెదిరిపోయిన కుక్కలు.. సీన్ కట్ చేస్తే!
Dogs Viral Video
Follow us
Ravi Kiran

|

Updated on: Sep 13, 2022 | 4:04 PM

అర్ధరాత్రి వేళ చెట్టు కింద నిద్రపోతున్న రెండు వీధి కుక్కలకు అలికిడి వినిపించింది. ఏంటా అని చూడగా.. వాటికి చెట్టుపై మెరిసే కళ్లతో ఓ నల్లటి ఆకారం కనిపించింది. దాన్ని చూసి మొరగడం ప్రారంభించాయి. అంతే!.. ఆ ఆకారం ఒక్క ఉదుటున చెట్టుపై నుంచి కిందకు దూసుకొచ్చింది. సీన్ కట్ చేస్తే.. అసలేం జరిగిందో.. ఆ తర్వాత ఏమైందో ఇప్పుడు తెలుసుకుందాం..

వైరల్ వీడియో ప్రకారం.. చీకట్లో చెట్టుపై కనిపించిన ఓ నల్లటి ఆకారాన్ని చూసి రెండు కుక్కలు మొరుగుతున్నట్లు మీరు చూడవచ్చు. ఇంతకీ చెట్టుపై ఉన్నది ఏంటి.? దేన్నీ చూసి కుక్కలు మొరుగుతున్నాయి.? అని అనుకుంటున్నారా.! వీడియో కొంచెం ఫార్వర్డ్ చేయండి.. మీకే తెలుస్తుంది… 1..2..3.. అర్ధమైందా.? అదేంటో..! చిరుతపులి అండీ.. జనావాసాల్లోకి వచ్చిన ఓ చిరుతపులి.. ఎంచక్కా చెట్టు ఎక్కి కూర్చుంది. ఇక ఈ రెండు కుక్కలు దాన్ని చూసి మొరగడం మొదలుపెట్టాయి. క్రూర జంతువు ఊరుకుంటుందా.? వాటిని ఓ పట్టు పట్టేందుకు కిందకు దూకుతుంది.

అంతవరకూ ధైర్యంగా చిరుతపులిపై అరిచిన ఈ రెండు కుక్కలు.. తోకముడుచుకుని చెరో పక్కా పరుగులు పెడతాయి. బహుశా చిరుతకు వేటాడే మూడ్ లేనట్లు ఉంది. ఆ రెండింటిని చంపకుండా వదిలిపెట్టడమే కాకుండా.. అక్కడ నుంచి పారిపోతుంది. ఈ ఘటన పూణే నగర శివార్లలో చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. కాగా, ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ అధికారి సురేందర్ మెహ్రా ఈ వీడియోను ట్విట్టర్‌లో పోస్ట్ చేయగా.. ఇప్పటిదాకా దీన్ని 10 వేల మంది నెటిజన్లు పైగా వీక్షించారు. అలాగే ఈ వీడియోకు 400లకు పైగా లైకులు వచ్చిపడ్డాయి.