AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: మూర్ఖత్వానికి పరాకాష్ట ఇది.. మండుతున్న అగ్నిపర్వతం దగ్గర సెల్ఫీలు.. మండిపడుతోన్న నెటిజన్లు

Shocking Video: ప్రస్తుతం ప్రపంచమంతా సోషల్‌ మీడియాలో మునిగిపోయింది. కొందరు లైకులు, షేర్లు, కామెంట్ల కోసం పిచ్చి పిచ్చి పనులు చేస్తున్నారు. ఫొటోటు, సెల్ఫీల క్రేజులో తమ విలువైన ప్రాణాలను కూడా పణంగా పెడుతున్నారు.

Viral Video: మూర్ఖత్వానికి పరాకాష్ట ఇది.. మండుతున్న అగ్నిపర్వతం దగ్గర సెల్ఫీలు.. మండిపడుతోన్న నెటిజన్లు
Volcano Eruption
Basha Shek
|

Updated on: Sep 13, 2022 | 3:32 PM

Share

Shocking Video:  ప్రస్తుతం ప్రపంచమంతా సోషల్‌ మీడియాలో మునిగిపోయింది. కొందరు లైకులు, షేర్లు, కామెంట్ల కోసం పిచ్చి పిచ్చి పనులు చేస్తున్నారు. ఫొటోటు, సెల్ఫీల క్రేజులో తమ విలువైన ప్రాణాలను కూడా పణంగా పెడుతున్నారు.ఇటీవల తెలంగాణలో కదులుతున్న రైలుకు దగ్గరగా రీల్స్‌ చేద్దామని ప్రయత్నించిన ఓ బాలుడు తీవ్రంగా గాయపడి ఆస్పత్రిపాలైన సంగతి తెలిసిందే. ఇలాంటి ఘటనలు తరచూ జరుగుతున్నాయి. ఇప్పుడు వైరల్ అవుతున్న ఈ వీడియోను ఒక్కసారి చూడండి . ఇందులో కొందరు వ్యక్తులు అగ్నిపర్వతానికి దగ్గరగా సెల్ఫీలు దిగుతున్నారు. పక్కన కొందరు భయంతో కేకలు వేస్తోన్న వీరు మాత్రం సెల్ఫీలు దిగి తమ మూర్ఖత్వాన్ని చాటుకున్నారు. అగ్నిపర్వతం దగ్గర మరిగే లావా ఉష్ణోగ్రత సుమారు 1000 డిగ్రీల సెల్సియస్ వరకు ఉంటుంది. అలాంటి మండుతున్న లావా ఎవరి మీదనైనా పడితే అంతే సంగతులు. అదే సమయంలో దాని అంచుల ఉష్ణోగ్రత సుమారు 500 డిగ్రీలు. అలాంటి పరిస్థితుల్లో ఎవరైనా సెల్ఫీ దిగుతారా? కానీ కొందరు ఫొటోలు దిగి తమ స్టుపిడిటీని చాటుకున్నారు.

viralhog అనే ఐడీతో ఇన్‌స్టాగ్రామ్‌ షేర్‌ చేసిన ఈ వైరల్‌ వీడియోలో కొంతమంది అగ్నిపర్వతానికి చాలా దగ్గరగా సెల్ఫీలు తీసుకుంటున్నట్లు చూడవచ్చు. అది కూడా రాత్రి సమయంలో. ఓవైపు మండుతున్న లావా దావానంలా వ్యాపిస్తున్నప్పటికీ సెల్ఫీలు, ఫొటోలు దిగడం కనిపిస్తుంది. ఈ వీడియో ఇప్పుడు నెట్టింట్లో తెగ వైరలవుతోంది. దీనిని చూసిన నెటిజన్లు తెగ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ‘ఈ భూమిపై మనుషులంత తెలివి తక్కువ వారు మరొకరు లేరు’, ‘వీరి పిచ్చి పీక్స్‌కు వెళ్లింది’, ‘సోషల్‌ మీడియాలో లైకులు, షేర్ల కోసం ఇలాంటి తెలివి తక్కువ పనులు అవసరమా’ అంటూ కామెంట్లు పెడుతున్నారు.

ఇవి కూడా చదవండి
View this post on Instagram

A post shared by ViralHog (@viralhog)

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం క్లిక్ చేయండి..

Follow Us
ఏసీ 8 గంటలు ఆన్ చేసినా.. కరెంట్ బిల్లు తక్కువ రావాలంటే ఇలా చేయండి
ఏసీ 8 గంటలు ఆన్ చేసినా.. కరెంట్ బిల్లు తక్కువ రావాలంటే ఇలా చేయండి
ఫోన్‌కు వచ్చిన ట్రాఫిక్ చలానా పరిశీలించిన వ్యక్తి.. ఓపెన్ చేయగా
ఫోన్‌కు వచ్చిన ట్రాఫిక్ చలానా పరిశీలించిన వ్యక్తి.. ఓపెన్ చేయగా
తెలంగాణకు కేంద్రం భారీ కానుక.. రెండు కొత్త రైల్వే ప్రాజెక్టులు!
తెలంగాణకు కేంద్రం భారీ కానుక.. రెండు కొత్త రైల్వే ప్రాజెక్టులు!
రాసిపెట్టుకోండి..వారికి ఇబ్బడిముబ్బడిగా ఆదాయం పెరిగే ఛాన్స్..!
రాసిపెట్టుకోండి..వారికి ఇబ్బడిముబ్బడిగా ఆదాయం పెరిగే ఛాన్స్..!
వాట్సాప్ యాప్‌పై ఎలాన్ మస్క్ సంచలన ఆరోపణలు!
వాట్సాప్ యాప్‌పై ఎలాన్ మస్క్ సంచలన ఆరోపణలు!
టమాటాలతో ఎంపీ జన్మదిన వేడుకలు.. వినూత్న రీతిలో అభిమానం చాటుకున్న
టమాటాలతో ఎంపీ జన్మదిన వేడుకలు.. వినూత్న రీతిలో అభిమానం చాటుకున్న
KGBV పాఠశాలల్లో ప్రవేశాలకు 2026 దరఖాస్తు గడువు పొడిగింపు
KGBV పాఠశాలల్లో ప్రవేశాలకు 2026 దరఖాస్తు గడువు పొడిగింపు
ఈ సినిమా చాలా స్పెషల్‌గా అనిపించింది: పీవీ సింధు
ఈ సినిమా చాలా స్పెషల్‌గా అనిపించింది: పీవీ సింధు
వంటగదిలో ఉండే ఈ పదార్దాలతో.. ములక్కాయలు పిచ్చిపిచ్చిగా కాస్తాయి..
వంటగదిలో ఉండే ఈ పదార్దాలతో.. ములక్కాయలు పిచ్చిపిచ్చిగా కాస్తాయి..
ప్రయాణికులకు అలర్ట్.. కన్ఫర్మ్ టికెట్ రద్దుపై కొత్త నిబంధనలు
ప్రయాణికులకు అలర్ట్.. కన్ఫర్మ్ టికెట్ రద్దుపై కొత్త నిబంధనలు