AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: ఆకాశంలో అద్భుతం.. రంగు రంగుల లైట్లతో దూసుకెళ్లిన ట్రైన్..! చూస్తుండగానే.. వీడియో

రోజూలానే సాయంత్రం చికటి పడింది.. ఈ క్రమంలో ఆకాశంలో నక్షత్రాలకు బదులు.. రంగురంగులతో దూసుకెళ్తున్న ఓ ట్రైన్ లాంటి ఆకారం కనిపించింది. దీంతో జనం ఒక్కసారిగా అవాక్కయ్యారు.

Viral Video: ఆకాశంలో అద్భుతం.. రంగు రంగుల లైట్లతో దూసుకెళ్లిన ట్రైన్..! చూస్తుండగానే.. వీడియో
Viral
Shaik Madar Saheb
|

Updated on: Sep 13, 2022 | 4:25 PM

Share

Mysterious light in sky: రోజూలానే సాయంత్రం చికటి పడింది.. ఈ క్రమంలో ఆకాశంలో నక్షత్రాలకు బదులు.. రంగురంగులతో దూసుకెళ్తున్న ఓ ట్రైన్ లాంటి ఆకారం కనిపించింది. దీంతో జనం ఒక్కసారిగా అవాక్కయ్యారు. ఆకాశంలో ఏదో అద్భుతం జరుగుతుందంటూ అంతా రోడ్డెక్కారు. ఈ విచిత్ర ఘటన ఉత్తరప్రదేశ్‌లో చోటుచేసుకుంది. ఉత్తరప్రదేశ్‌లోని అనేక నగరాల్లో సాయంత్రం వేళ ఆకాశంలో రంగురంగుల లైట్లు వేగంగా దూసుకళ్తున్నట్లు కనిపించడంతో అంతటా ఆసక్తి నెలకొంది. ఫరూఖాబాద్ జిల్లా పరిసర ప్రాంతాల్లో ఆకాశంలో రంగురంగుల లైట్లు.. మెరుస్తున్న నక్షత్రాల్లాంటి వస్తువు కనిపించింది. ఈ దృశ్యం చాలా సేపు ఆకాశంలో కనిపించింది. దీంతో చాలామంది రోడ్లపైకి వచ్చి మొబైల్‌లలో చిత్రీకరించారు.

ఆకాశంలో చిన్న చిన్న బల్బుల వంటి ప్రకాశవంతమైన ఓ వస్తువు వేగంగా దూసుకెళ్లడం కనిపించింది. అనంతరం దీనికి సంబంధించిన వీడియో బాగా వైరల్ అవుతోంది. ఇది అమృత్‌పూర్, కంపిల్, రాజేపూర్, జిజోతా పహార్‌పూర్, హల్దీ ఖేడా, సిటీ ఏరియాతో సహా అనేక ప్రాంతాల్లో సోమవారం సాయంత్రం 7.30 గంటల ప్రాంతంలో కనిపించింది. ఓ ఫైటర్ ప్లేన్ వెళ్లిన తర్వాత ఆకాశంలో ఈ రంగురంగుల కాంతి కనిపించినట్లు వీడియోలో తెలుస్తోంది. రైలు ఆకారంలో లైట్లు గాలిలో కనిపించడం చూసి ప్రజలు ఆశ్చర్యపోయారు. అనంతరం కొద్దిసేపటికే కనుమరుగైనట్లు స్థానికులు తెలిపారు.

ఇవి కూడా చదవండి

వీడియో చూడండి..

కాగా, ఈ ఘటనపై ప్రజల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇంతకు ముందు ఆకాశంలో ఇలాంటి దృశ్యాన్ని చూడలేదని అంటున్నారు. కొందరు ఉల్కా అని పేర్కొంటుంటే.. మరికొందరు రాకెట్ అని చెబతున్నారు. కొంతమంది దీనిని కాన్స్టెలేషన్ అని కూడా పిలుస్తున్నారు. వాస్తవానికి ఈ కాంతి ఎందుకు ఏర్పడింది.. ఎక్కడ నుంచి వచ్చింది..? అనే దానిపై ఖచ్చితమైన సమాచారం లేదు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
ముంబైపై ఘన విజయం.. ప్లేఆఫ్ రేస్‌లోకి కేకేఆర్ ఎంట్రీ..!
ముంబైపై ఘన విజయం.. ప్లేఆఫ్ రేస్‌లోకి కేకేఆర్ ఎంట్రీ..!
భానుడి భగభగలు..! ఎండల్లో ఎలాంటి డ్రింక్స్ తాగాలి? వేటికి దూరంగా..
భానుడి భగభగలు..! ఎండల్లో ఎలాంటి డ్రింక్స్ తాగాలి? వేటికి దూరంగా..
సోషల్ మీడియా స్టార్ కుర్చీతాత హఠాన్మరణం.. ఏం జరిగిందంటే?
సోషల్ మీడియా స్టార్ కుర్చీతాత హఠాన్మరణం.. ఏం జరిగిందంటే?
2026లో కెరీర్ గ్రోత్ కోసం హైదరాబాద్ టాప్ 10 కంపెనీలు ఇవే..
2026లో కెరీర్ గ్రోత్ కోసం హైదరాబాద్ టాప్ 10 కంపెనీలు ఇవే..
పిడుగురాళ్లలో 47.6, నిర్మల్‌లో 46.5 డిగ్రీలు.. సూరీడుతో జాగ్రత్త
పిడుగురాళ్లలో 47.6, నిర్మల్‌లో 46.5 డిగ్రీలు.. సూరీడుతో జాగ్రత్త
ఊరు పెరిగింది.. జనాభా పెరిగింది.. ట్రాఫికర్ మాత్రం షేమ్‌టుసేమ్
ఊరు పెరిగింది.. జనాభా పెరిగింది.. ట్రాఫికర్ మాత్రం షేమ్‌టుసేమ్
ఒకే FDలో మొత్తం డబ్బు పెట్టేస్తున్నారా? తప్పు చేస్తున్నట్లే!
ఒకే FDలో మొత్తం డబ్బు పెట్టేస్తున్నారా? తప్పు చేస్తున్నట్లే!
పెరుగు బాగా పులిసిపోయిందా? పారేయకండి.. ఈ 4 వంటకాలతో పాటు మీ ఇళ్లు
పెరుగు బాగా పులిసిపోయిందా? పారేయకండి.. ఈ 4 వంటకాలతో పాటు మీ ఇళ్లు
సమ్మర్‌ స్పెషల్ హెల్తీ బ్రేక్‌ఫాస్ట్‌..ఈ గులాబీ రంగు ఇడ్లీలు ట్రై
సమ్మర్‌ స్పెషల్ హెల్తీ బ్రేక్‌ఫాస్ట్‌..ఈ గులాబీ రంగు ఇడ్లీలు ట్రై
రోజుకు 2 అరటిపండ్లు తింటే ఏం జరుగుతుంది..? పెద్ద కథే ఇది..
రోజుకు 2 అరటిపండ్లు తింటే ఏం జరుగుతుంది..? పెద్ద కథే ఇది..